iDreamPost

ప్రశాంతంగా చంద్రబాబు

ప్రశాంతంగా చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఉదయం 11:10 గంటలకు సమావేశం ప్రారంభం కాగా ఆదిలోనే పరిపాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి బిల్లు –2020, సీఆర్‌డీఏ రద్దు బిల్లు – 2020 అనే రెండు బిల్లులను ప్రవేశపెట్టారు. మొదటి బిల్లుపై ఆర్థిక మంత్రి బుగ్గన సుదీర్ఘంగా మాట్లాడుతున్నారు.

Read Also: పవన్ ఆదేశాలను రాపాక పాటిస్తారా?

ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నారా చంద్రబాబు నాయుడు ప్రశాంతంగా బుగ్గన మాటలను వింటున్నారు. ప్రారంభంలో మూడు రాజధానులు వద్దు.. అమరావతి ముద్దు అని రెండునిమిషాలు టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేసినా.. కూడా చంద్రబాబు మాత్రం మౌనంగానే ఉన్నారు. అప్పటి నుంచి దాదాపు గంట నుంచి సాగుతున్న సభలో టీడీపీ సభ్యులతోపాటు ఆ పార్టీ నేత చంద్రబాబు శాంతియుతంగా ఉండడం విశేషం.

Read Also: అసెంబ్లీలో టీడీపీ నిరసన.. బుగ్గన కౌంటర్ తో ఏమి జరిగిందంటే..

బిల్లులో మూడు రాజధానుల ఏర్పాటను మంత్రి బుగ్గన ప్రకటించినా కూడా టీడీపీ సభ్యుల నుంచి కానీ, చంద్రబాబు నుంచి కానీ ఎలాంటి నిరసన వ్యక్తం కాలేదు. అసెంబ్లీలో తీవ్ర గందరగోళం, టీడీపీ నిరసనలు ఉంటాయని మీడియా, రాజకీయ విశ్లేషకులు అంచనా వేసినా… అందుకు భిన్నంగా సభ సాగుతుండడం గమనార్హం. అమరావతి అంటూ ఐదేళ్ల పాటు గ్రాఫిక్స్‌ చూపించారని మంత్రి బుగ్గన విమర్శించినా కూడా చంద్రబాబు కూల్‌గా ఉండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. సభలో పూర్తి స్థాయిలో చర్చలో పాల్గొనేందుకే చంద్రబాబు, టీడీపీ నేతలు ఇలా వ్యవహరిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి