iDreamPost

అరెస్ట్ లోనూ చంద్రబాబు సానుభూతి రాజకీయం!

అరెస్ట్ లోనూ చంద్రబాబు సానుభూతి రాజకీయం!

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ విషయంపైనే చర్చలు జరుగుతున్నాయి. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో నంద్యాలలో ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద ఆయనను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 50 (1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద ఆయను అరెస్ట్ చేశారు. ఈ కేసులో చంద్రబాబు ని ఏ-1, అచ్చెన్నాయుడు ఏ-2 గా పేర్కొన్నారు. శనివారం సాయంత్రం 6 గంటల లోగా విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే.. చంద్రబాబు ని తరలిస్తున్న సమయంలో పలు చోట్ల టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

రాజకీయాల్లో మాజీ సీఎం చంద్రబాబు ప్రతి సందర్భాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో మహాదిట్ట అని అంటుంటారు. స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు ని ఏ-1 నిందితుడిగా సీబీఐ అరెస్ట్ చేశారు. ఇందులోనూ చంద్రబాబు తనపట్ల సానుభూతి సంపాదించుకునే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే చంద్రబాబుని విజయవాడకు రోడ్డు మార్గాన తరలిస్తున్న సమయంలో పెద్ద హై డ్రామా నడిచింది. వాస్తవానికి చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఆయనకు గౌరవం ఇచ్చి హెలికాప్టర్ ఆఫర్ చేశారు సీఐడీ. కానీ ఆయన అందుకు నిరాకరించడమే కాదు.. తనను రోడ్డు మార్గాన తన కాన్వాయ్ లో వస్తానని పట్టుబట్టారు. దీంతో తప్పని సరిపరిస్థితిలో విజయవాడకు ఆయన కాన్వాయ్ లో తరలించారు.

విజయవాడకు చంద్రబాబును రోడ్డు మార్గాన తరలిస్తున్నారన్న విషయం తెలిసి టీడీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. చంద్రబాబు ను తరలిస్తున్న రోడ్డు మార్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా మోహరించి నిరసనలు తెలుపుతున్నారు. అయితే అరెస్టు సమయంలో చంద్రబాబు తన పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు మొక్కుబడిగా సంయమనం పాటించాలని చెప్పిన విషయం తెలిసిందే.. కానీ దానికి భిన్నంగా వ్యవహరించాలని దిశా నిర్ధేశం ఇన్ డైరెక్ట్ గా చేసి ఉంటారని వార్తలు వస్తున్నాయి. అధికార పార్టీ కావాలనే తమ అధినేతను అరెస్ట్ చేశారన్న భావన ప్రజల్లోకి వెళ్లేలే టీడీపీ శ్రేణులు కల్పంచాలని పరోక్షంగా చంద్రబాబు వారికి సూచించినట్లు వార్తలు వస్తున్నాయి.

మొత్తానికి చద్రబాబు అరెస్ట్ ప్రజల్లో సానుభూతి వచ్చేలా చేయాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నట్లు వాచి చర్యల వల్ల తెలుస్తుంది. ఎంతో పకడ్బందీగా చంద్రబాబును సీఐడీ అధికారులు తరలిస్తున్నప్పటికీ టీడీపీ శ్రేణులు కాన్వాయ్ లోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కాన్వాయ్ రూటును పోలీసులు మార్చారు.. పొదిలి నుంచి ఒంగోలు వైపు కాన్వాయ్ ని మళ్లించినట్లు సమాచారం. గుంటూరు మీదుగా విజయవాడకు తరలిస్తున్నట్లు తెలుస్తుంది. సాయంత్రం 6 గంటల లోపు విజయవాడలోని ఏసీబీ కోర్టులో ఆయనను హాజరుపరుస్తామని అధికారులు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి