iDreamPost

చంద్రబాబు దీక్షల పిలుపు అట్టర్ ఫ్లాపేనా … ఈనాడు కథనమే సాక్ష్యం

చంద్రబాబు దీక్షల పిలుపు అట్టర్ ఫ్లాపేనా … ఈనాడు కథనమే సాక్ష్యం

విద్యుత్ బిల్లులపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా చంద్రబాబునాయుడు ఇచ్చిన దీక్షల పిలుపు అట్టర్ ఫ్లాప్ అయిందనే చెప్పాలి. చంద్రబాబు దీక్ష పిలుపును చాలామంది నేతలు పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. ఈ ఒక్క దీక్షే కాదు గతంలో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇచ్చిన అనేక పిలుపులు కూడా ఫెయిలయ్యాయి. తాజాగా విద్యుత్ బిల్లులకు నిరసనగా చంద్రబాబు ఇచ్చిన పిలుపు అట్టర్ ఫ్లాప్ అయ్యిందనటానికి ఈనాడు దినపత్రికలో ఇచ్చిన లెక్కలే సాక్ష్యం.

ఈనాడు మొదటి పేజీలో కరెంటు బిల్లులపై కన్నెర్ర అనే బ్యానర్ హెడ్డింగ్ ఒకటే భారీగా కనబడింది. లోపల చూస్తే వార్తంతా డొల్లే. పైగా ఎన్నిమండలాల్లో, ఎంతమంది నేతలు, ఎంతమంది ప్రజాప్రతినిధులు, ఎన్ని నియోజకవర్గాల్లో దీక్షలు జరిగాయనే విషయాన్ని లెక్కలతో చెప్పింది. ఈనాడిచ్చిన లెక్కల ప్రకారమే 175 నియోజకవర్గాలకు గాను 160 నియోజకవర్గాల్లోనే దీక్షలు జరిగాయి. మరి మిగిలిన 15 నియోజకవర్గాల్లో దీక్షలు ఎందుకు చేయలేదు ?

అలాగే 673 మండలాలకు గానీ దీక్షలు జరిగింది 620 మండలాల్లోనే. మరి మిగిలిన మండలాల్లో దీక్షలు ఎందుకు జరగలేదో ఈనాడు చెప్పలేదు. సరే నియోజకవర్గాలు, మండలాల్లో బాగానే దీక్షలు జరిగాయని టిడిపి, ఎల్లోమీడియా సమర్ధించుకోవచ్చు. అయితే దీక్షల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధుల సంఖ్య 180 అని చెప్పింది. అదే విధంగా దీక్షల్లో పాల్గొన్న పార్టీ నేతల సంఖ్య 400గా చెప్పింది. ఇక్కడే దీక్షలు ఎంత ఫ్లాప్ అయ్యాయో చెప్పకనే చెప్పేసింది.

పార్టీలో ప్రజాప్రతినిధుల సంఖ్య 180, దీక్షలు చేసిన నేతలు 400 మాత్రమేనా ? ప్రస్తుత ఎంపిలు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలతో కలుపుకుని మాజీమంత్రులు, మాజీ ఎంపిలు, మాజీ ఎంఎల్ఏల సంఖ్య కొన్ని వేలుండాలన్నది వాస్తవం. అలాగే దీక్షలు చేసిన వాళ్ళు కూడా 400 అని చెప్పింది. మొత్తం 175 నియోజకవర్గాల్లో దీక్షలు చేసింది 400 అంటే నియోజకవర్గానికి ఎంతమంది దీక్షలు చేసినట్లు ? కనీసం ముగ్గురు కూడా చేయలేదని తేలిపోయింది కదా.

టిడిపిలో గ్రామస్ధాయి నుండి నియోజకవర్గం స్ధాయి వరకూ తీసుకుంటే వందమంది నేతలు చాలా ఈజీగా ఉంటారు. సింపుల్ లెక్క ప్రకారమే నియోజకవర్గానికి వందమంది చొప్పున దీక్షలు చేసుంటే 17500 మంది దీక్షలు చేసుండాలి. అలాంటిది ఒక్కో నియోజకవర్గంలో ముగ్గురు నేతలు కూడా దీక్షల్లో పాల్గొనలేదంటే ఫ్లాప్ కాక మరేమిటి ? తమ పార్టీ సభ్యత్వమే 70 లక్షలని గతంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చాలా ఘనంగా చెప్పుకున్నాడు. అలాంటిది దీక్షల్లో కనీసం ఒక్కశాతం కూడా పాల్గొనలేదంటే ఏమిటర్ధం ? టిడిపి దీక్షలన్నీ ఎల్లోమీడియాలో మాత్రమే జరుగుతోందనర్ధం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి