iDreamPost

మేధావులకు అంతే …ఒక వైపే కనిపిస్తుంది.. చలసానిని చూస్తే అర్ధమే అవుతుంది !

మేధావులకు అంతే …ఒక వైపే కనిపిస్తుంది.. చలసానిని  చూస్తే అర్ధమే అవుతుంది !

కరోనా మహమ్మారి వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ కంటిమీద కునుకు లేకుండా పనిచేస్తుంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను జాతీయ మీడియా అభినందిస్తూ అనేక కథనాలు రాశాయి. కానీ కొందరు ఈ విపత్తు సమయంలో కూడా రాజకీయ అజెండాతో పనిచేస్తున్నారు.

చల సాని శ్రీనివాస్ “ఆంధ్రాలో తక్కువ కరోనా టెస్ట్ లు జరిగాయి కాబట్టి తక్కువ మందికి జబ్బు ఉన్నట్టు తేలింది” వ్యాఖ్యానించారు .ఈ వాఖ్య కూడా జాగర్తలు చెప్పే ధోరణిలో కాకుండా విమర్శనాత్మకంగా అన్నారు.

ఏ వ్యాధికి అయినా ప్రాథమిక లక్షణాలను బట్టి వ్యాధి ఉండొచ్చు అని అనుమానం వస్తేనే అవసరమైన టెస్ట్ లు చేస్తారు ,అలాగే కరోనాకి కూడా రాష్ట్ర ప్రభుత్వం వివిధ దేశాల నుండి , దేశంలో ఇతర ప్రాంతాలనుండి వచ్చిన వారినీ , కరోనా పాజిటివ్ వ్యక్తుల్ని కలిసిన వారినీ గుర్తించి సదరు వ్యక్తుల్ని హోమ్ ఐసోలేషన్ లో ఉండమని సూచించి అబ్జర్వ్ చేస్తూ వ్యాధి లక్షణాలు కనపడితే క్వారంటయిన్ కి తరలించి కరోనా టెస్ట్ చేసి పాజిటివ్ లేదా నెగటివ్ గా నిర్ధారించి తగు ట్రీట్మెంట్ చేస్తారు .

అదృష్టవశాత్తూ ఈ విషయంలో మన రాష్ట్రం మిగతా రాష్ట్రాల కన్నా పకడ్బందీగా వ్యవహరిస్తూ సమగ్ర సమాచారంతో నిఘా ఉంచి పూర్తి జాగ్రత్తలు తీసుకొని కరోనా వ్యాపించకుండా చేపట్టిన చర్యలు మిగతా రాష్ట్రాలకు కూడా ఆదర్శప్రాయం అయ్యాయి . ఈ విషయంలో ఎక్కువ క్రెడిట్ విలేజ్ వలంటీర్ వ్యవస్థకు ఇవ్వొచ్చు .

జాతీయ మీడియా కూడా ఏపీలో ఉన్న వలంటీర్ వ్యవస్థ వలనే కరోనాని కట్టడి చేయగలిగారు అని అభినందిస్తుంటే చలసాని శ్రీనివాస్ వంటి వారు ఎందుకు ఇలా అపోహలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు .

బహుశా వీరికి బాబు గారి పాలన తప్ప మరెవరి పాలన అయినా లోపాలు కనపడతాయి . సందర్భం ఏదైనా ఒక అంశం మీద బాబు గారు , టీడీపీ పార్టీ బహిరంగంగా మాట్లాడలేని క్లిష్ట పరిస్థితుల్లో మాత్రమే ఇలాంటి స్వయం ప్రకటిత మేధావులు ముందుకొస్తారు . సదరు అంశం ప్రజాపయోగమా కాదా అన్నదానితో సంబంధం లేకుండా కేవలం వక్రీకరించే ప్రయత్నం చేస్తారు .

హోదా , ప్యాకేజి లాంటి అంశాల్లో చంద్రబాబు BJPతో ఉన్న పొత్తు వలన బహిరంగంగా మాట్లాడలేని సందర్భాల్లో ప్రతిపక్ష నేతలు చేసే పోరాటాల వలన వారికి పేరు వస్తుందనుకొన్నప్పుడు మాత్రమే మేధావి సంఘ పోరాటాల పేరిట వీరి గొంతు వినిపిస్తుంది . 2014 లో అధికారంలోకి వచ్చిన నాటి నుండి 2019 ఫిబ్రవరి ఎమ్మెల్సీ ఎన్నికల వరకూ పలు అంశాల్లో టీడీపీకి ఇలా ఉపయోగపడిన వీరు ఆ తర్వాత తన వాణి వినిపించడం తగ్గించేశారు .

బాబు గారు తనకు ఎమ్మెల్సీ పదవి హామీ ఇచ్చి చివరి నిమిషంలో ఏపీఎన్జీవో మాజీ అధ్యక్షుడు పరుచూరి అశోక్ కి ఎమ్మెల్సీ కట్టబెట్టి తనకు అన్యాయం చేశాడని పలువురితో అంతరంగికంగా చెప్పుకొని బాధపడ్డ చలసాని కొన్ని మీడియా చర్చా వేదికల్లో సైతం అశోక్ ని చూడగానే కన్నీరు పెడుతూ దూషించటం తెలుగు ప్రేక్షకులు చూశారు . ఆ కాలంలో బాబు తనని నమ్మించి గొంతు కోసాడని మీరు కూడా బాబుని నమ్మొద్దని చాలామంది నాయకులకు సైతం ఫోన్లు చేసి చెప్పాడని అప్పట్లో పలు కధనాలు వెలువడ్డాయి .

చలసాని శ్రీనివాస్ చెప్పుకునే ఆంధ్రా మేధావి సంఘం అస్తిత్వం ఇప్పటికీ ప్రస్నార్ధకమే.ఇప్పటి వరకూ ఆ మేధావి సంఘం నుండి ఆయన తప్ప మరో వ్యక్తి బయటి ప్రపంచానికి కనపడలేదు .ఆ సంఘం గురించి ఎవరన్నా ప్రశ్నిస్తే ఈయన చెప్పే సమాధానాలు చాలా విచిత్రంగా ఉంటాయి. చాలా పోరాటాలు చేశానండీ ,ఆ రోజు మీరెక్కడున్నారు ,ఈ పోరాటాల వలన అనారోగ్యం పాలయ్యాను, ఆస్తులు అమ్ముకున్నాను ,బిజీగా ఉన్నానండీ మరోసారి చెబుతాను … ఇలా ఉంటాయి వీరి సమాధానాలు .

ఇప్పుడు కూడా కరోనా ప్రభావానికి భయపడి దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించి వైరస్ వ్యాప్తి చెందకుండా సామాజిక బాధ్యతతో కష్టపడుతుంటే సోషల్ డిస్టెంసింగ్ మీద ప్రచారం చేయకుండా,ముఖ్యంగా తాను బలపరుస్తున్న రాజధాని పోరాటాన్ని విరమించమని చెప్పకుండా తక్కువ పరీక్షలు,తక్కువ కేసులు అంటూ భయాలు పెంచటం బాధాకరం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి