iDreamPost

కిరాణా దుకాణాల్లో మందుల విక్రయంపై కేంద్రం కీలక నిర్ణయం..

కిరాణా షాపుల్లో మెడిసిన్స్ విక్రయంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇందుకోసం కేంద్రం కొత్త ప్లాన్ చేస్తోంది. ఈ అంశంపై కేంద్రం ఓ కమిటీని కూడా వేసింది.

కిరాణా షాపుల్లో మెడిసిన్స్ విక్రయంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇందుకోసం కేంద్రం కొత్త ప్లాన్ చేస్తోంది. ఈ అంశంపై కేంద్రం ఓ కమిటీని కూడా వేసింది.

కిరాణా దుకాణాల్లో మందుల విక్రయంపై కేంద్రం కీలక నిర్ణయం..

భారత్ అత్యధిక జనాభా కలిగిన దేశం. ఇప్పటికీ పలు రాష్ట్రాల్లోని ప్రజలకు వైద్య సదుపాయాలు అందలేకపోతున్నాయి. సాధారణ వ్యాధులకు సైతం మెడిసిన్స్ అందించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. పేద ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోలేని పరిస్థితి. దగ్గు, జలుబు, జ్వరాలకు గురైనప్పుడు స్థానిక మెడికల్ షాపుల్లో లభించే మెడిసిన్స్ ను వినియోగిస్తుంటారు. మరి మెడికల్ షాపులు గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉండవు కదా. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఉండే ప్రజలకు ఉపయోగకరంగా ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం కొత్త ప్లాన్ చేస్తోంది. ఇకపై కిరాణా కొట్లలోనూ మెడిసిన్స్ విక్రయంపై కీలక నిర్ణయం తీసుకోనుంది.

సాధారణంగా జబ్బు చేసినప్పుడు స్థానిక వైద్యుడి వద్దకు వెల్లడం లేదా దగ్గర్లోని ఆసుపత్రికి వెల్లడం చేస్తుంటారు. వైద్య పరీక్షల అనంతరం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ స్లిప్ రాసిస్తారు. దీని సాయంతో మెడికల్ షాపుల్లో సంబంధిత మెడిసిన్స్ ను కొనుగోలు చేస్తుంటారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించకూడదనే నిబంధన ఉంది. దీంతో అర్థరాత్రుల్లో ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే వైద్యుడు అందుబాటులో లేకున్నా కనీసం మెడిసిన్స్ అయినా తీసుకోలేని పరిస్థితి. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. త్వరలో కిరాణా షాపుల్లో వైద్యుల ప్రిస్క్రిప్షన్ స్లిప్పులు లేని జనరిక్ మందులు విక్రయానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా లభించే మందులను దీనికింద విక్రయానికి అందుబాటులో ఉంచాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పెయిన్ రిలీఫ్, కోల్డ్ వంటి ఇతర మందులను సాధారణ కిరాణా దుకాణాల్లో కూడా అందుబాటులో ఉంచేలా నిబంధనలను కేంద్రం మార్చనున్నట్లు తెలుస్తోంది. కిరాణా కొట్టలోనూ మందుల విక్రయంపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ అధ్యయనం చేస్తోంది. కమిటీ రిపోర్ట్ అందించిన అనంతరం కిరాణా దుకాణాల్లో మెడిసిన్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే విక్రయించేందుకు కేంద్రం అనుమతివ్వనున్నట్లు తెలుస్తోంది. ఇది అమల్లోకి వస్తే ప్రజలకు మెడిసిన్స్ అందడం సులభతరం అవుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి