iDreamPost

ఇంటి నుంచే సంపాదన అంటే నమ్మొద్దు! 100కిపైగా వెబ్‌సైట్లపై కేంద్రం నిషేదం!

websites: నిరుద్యోగులను, మహిళలను, రిటైర్డ్ ఉద్యోగులను టార్గెట్ గా చేసుకుని కొందరు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. ఇంట్లో కూర్చొనే సంపాదించుకోవచ్చంటూ ఆశ చూపి.. మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సైబర్ నేరాల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

websites: నిరుద్యోగులను, మహిళలను, రిటైర్డ్ ఉద్యోగులను టార్గెట్ గా చేసుకుని కొందరు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. ఇంట్లో కూర్చొనే సంపాదించుకోవచ్చంటూ ఆశ చూపి.. మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సైబర్ నేరాల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

ఇంటి నుంచే సంపాదన అంటే నమ్మొద్దు! 100కిపైగా వెబ్‌సైట్లపై కేంద్రం నిషేదం!

నేటికాలంలో చాలా మందికి జాబ్ అనేది అవసరంగా మారింది. అందుకే చాలా మంది ఉద్యోగం కోసం తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. మరికొందరు ఇంట్లో నుంచే ఏదైనా జాబ్ చేయాలని భావిస్తుంటారు. అలా జాబ్ చేయాలనే బలహీనత ఆసరా చేసుకుని కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఇంటి నుంచి అధిక మొత్తంలో సంపాదించుకోవచ్చుని ప్రకటను ఇస్తూ మోసం చేస్తుంటారు. అక్రమ పెట్టుబడులు, టాస్క్‌-ఆధారిత పార్ట్‌టైం జాబ్స్ పేరుతో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న వెబ్‌సైట్లపై కేంద్రం చర్యలకు దిగింది. దాదాపు 100కుపైగా వెబ్ సైట్లను కేంద్రం నిషేధించింది. ఈ మేరకు బుధవారం అధికారకి ప్రకటన విడుదలైంది.

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సిఫార్సుల మేరకు దాదాపు 100కు పైగా వెబ్ సైట్లను కేంద్ర సమాచారా శాఖ బ్లాక్ చేసింది. ఈ మేరకు బుధవారం అధికారిక ప్రకటన విడుదలైంది. మోసపూరిత పెట్టుబడులు, పార్ట్ టైమ్ జాబ్స్ పేరుతో జరుగుతున్న  ఆన్ లైన్ మోసాలపై కేంద్ర హోం శాఖకు చెందిన  ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్టినేషన్ సెంటర్ విభాగం ఇటీవల పరిశీలన చేపట్టింది. అందులో భాగంగా.. సైబర్ మోసాలు జరుగుతున్న కొన్ని వెబ్ సైట్లను గుర్తించి.. వాటిని వెంటనే బ్లాక్ చేయాలని ఐటీ శాఖకు సిఫార్సు చేసింది.

ఈ నేపథ్యంలో కేంద్ర ఐటీ శాఖ తమ ప్రత్యేక అధికారాలతో 100కిపైగా వెబ్ సైట్లను నిషేధించింది. ఆర్థి నేరాలను ప్రోత్సహిస్తున్న ఈ వెబ్ సైట్లను విదేశీ వ్యక్తులు నిర్వహిస్తున్నట్లు ఐటీశాఖ తమ ప్రకటనలో తెలిపింది.  అయితే ఈ వెబ్ సైట్ల వివరాలను మాత్రం కేంద్రం వెల్లడించలేదు. డిజిటల్ ప్రకటనలు, చాట్ మెసెంజర్స్, అద్దె ఖాతలను వినియోగించి వీరు తమ కార్యకలాపాలను సాగిస్తున్నట్లు కేంద్రం తెలిపింది.  ఇలా చేసిన మోసాలతో వచ్చి న సొమ్మును  క్రిప్టో కరెన్సీలు, విదేశీ ఏటీఎం కార్డులు, అంతర్జాతీయ  ఫిన్ టెక్ కంపెనీల సాయంతో మనీ లాండరింగ్ చేస్తున్నట్లు కేంద్ర ఐటీ శాఖ గుర్తించింది. ఈ సందర్భంగా పార్ట్ టైం ఉద్యోగాల మోసాలపై కేంద్రం హెచ్చరికలు చేసింది.

“ఇంట్లోనే కూర్చుని సంపాదన’ వంటి ప్రకటనలతో సైబర్ కేటుగాళ్లు యూజర్లను ఆకట్టుకుంటారని తెలిపింది. పదవి విరమణ చేసిన వారు, మహిళలు, నిరుద్యోగులను ఎక్కువగా టార్గెట్ చేస్తారని పేర్కొంది.  ఇలాంటి మోసాల పట్ల యూజర్లు జాగ్రత్తగాఉండాలని కేంద్రం హెచ్చరించింది.  తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చేయొద్దని సూచించింది. ఇటీవలే మహాదేవ్ బెట్టింగ్ యాప్ వివాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్రమంగా బెట్టింగ్ కు పాల్పడే 22 యాప్ లు వెబ్ సైట్ల పై కేంద్రం నిషేధం విధించిన విషయం తెలిసిందే. తాజాగా 100కు పైగా వెబ్ సైట్లపై కేంద్రం నిషేధం విధించింది. మరి.. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి