iDreamPost

APకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం..ఎన్నిక వేళ కీలక ప్రకటన!

Nirmala Sitharaman: వచ్చే ఏడాది ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇలా ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఏపీ ప్రభుత్వానికి కేంద్ర శుభవార్త చెప్పింది.

Nirmala Sitharaman: వచ్చే ఏడాది ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇలా ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఏపీ ప్రభుత్వానికి కేంద్ర శుభవార్త చెప్పింది.

APకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం..ఎన్నిక వేళ కీలక ప్రకటన!

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై అధికారాలు కలిగి ఉంటుందనే సంగతి తెలిసిందే. అంతేకాక కేంద్రానికి వచ్చే ఆదాయంలో రాష్ట్రాల వారిగా నిధులు కేటాయింపులు జరుగుతాయి. అంతేకాక రాష్ట్రాలు తీసుకునే రుణాలపై కూడా కేంద్ర పెత్తనం ఉంటుంది. అందుకే సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్స్ కి మంచి సంబంధాలు ఉండాలి. ఇక కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తరచూ గుడ్ న్యూస్ చెబుతుంది. అలానే ఏపీకి కూడా ఓ శుభవార్తను కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మరికొద్ది రోజుల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే కేంద్ర్ చెప్పిన విషయం ఏపీ పెద్ద ఊరటనే చెప్పాలి. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అధికార, ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. అంతేకాక కీలకమైన శంకుస్థాపనలు, ఇతర ముఖ్యకార్యక్రమాలపై అధికార వైసీపీ దృష్టి సారించింది. ఇలా ఎన్నికలకు సిద్ధమవుతున్న వైసీపీ ప్రభుత్వానికి కేంద్రం శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఆర్ధిక ఇబ్బందులతో సతమతం అవుతూనే భారీ ఎత్తున సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్న జగన్ సర్కార్ కు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ మంచి వార్త అందించారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు మరో ఆరు రాష్ట్రాలకు వర్తింపచేసేలా ఓ ముఖ్యమైన అంశానికి అనుమతి ఇస్తున్నట్లు కేంద్ర ఆర్ధికమంత్రి తెలిపారు.

good news for ap government

విద్యుత్ రంగంలో జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలకు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాటికి ప్రతిఫలంగా ఏపీ ప్రభుత్వం జీడీపీలో అదనంగా మరో 0.5 శాతం రుణాలు సేకరించుకునేందుకు వీలుగా కేంద్రం అనుమతి  ఇచ్చింది. ఇదే విషయాన్ని కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం వెల్లడించారు. 15వ ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు ఆంధ్రప్రదేశ్ కు అనుమతి  ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. ఏపీతో పాటు మరో ఆరు రాష్ట్రాలకు కూడా అనుమతిని మంజూరు చేశారు. వాటిలో అస్సాం, కేరళ, రాజస్తాన్, సిక్కిం,  పశ్చిమ్ బెంగాల్ లు కూడా  ఉన్నట్లు  కేంద్ర ఆర్థికశాఖ పేర్కొంది.

దేశంలో కేంద్రం చెప్పిన విధంగా విద్యుత్ శాఖలో సంస్కరణలు చేపట్టి అమలు చేస్తే రాష్ట్ర జీడీపీలో 3 శాతం మేర రుణం తీసుకునేందుకు  ఉన్న వెసులుబాటుకు అదనంగా మరో 0.5 శాతం అదనంగా తీసుకునేల అవకాశం కల్పిస్తున్నారు. గతంలోనూ కోవిడ్ సమయంలో రాష్ట్రాలకు కేంద్రం ఈ వెసులుబాటు ఇచ్చింది. ఇక తాజాగా కేంద్రం ఇచ్చిన వెసులుబాటు ప్రకారం ఏపీ ప్రభుత్వం ఇప్పుడు జీఎస్డీపీలో 3.5 శాతం మేర రుణం చేసుకునేందుకు వీలు కలుగుతోంది. గతంలో కేంద్రం ఇచ్చిన వెసులుబాటును  ఏపీ తో సహా 12 రాష్ట్రాలు వినియోగించుకున్నాయి. తాజాగా మరోసారి కేంద్రం ఇచ్చిన ఆఫర్ తో రూ.5858 కోట్ల రుణం తీసుకోబోతోంది. కేంద్ర విద్యుత్ శాఖ సిఫార్సుతో రాష్ట్రాలకు ఈ మేరకు వెసులుబాటు ఇస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ఆర్ధిక మంత్రి వెల్లడించారు. మరి.. ఏపీకి కేంద్రం ఇచ్చిన ఈ వెసులుబాటుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి