iDreamPost

ఉపాధి హామీ కూలీలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం

ఉపాధి హామీ కూలీలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం

ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఆధార్ అధారిత వేతనాల చెల్లింపుల గడువు నేటితో ముగియనున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా ఎంతో మంది ఉపాధి హామీ కూలీల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆ గడువును డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. గడువు పెంచకపోతే కోట్లాది మంది ఉన్న ఉపాధీ కూలీలు నష్టపోతారని ఇటీవల విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసి ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో..  ఉపాధీ హామీ కూలీలు తమ బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ తప్పనిసరిగా లింక్ చేయాలని, అలా అయితేనే వేతనాలు చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఒకవేళ ఇలా లింక్ చేయకపోతే అనేక సమస్యలు వస్తాయని కూడా ముందే వివరించింది. ఈ నేపథ్యంలోనే ఇదంతా పూర్తయ్యే వరకు కూలీలకు పాత పద్దతిలోనే కూలీ డబ్బులు చెల్లిస్తామని తెలిపింది. ఇక గడువు పెంచడంతో ఉపాధీ హామీ కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి