iDreamPost

మీ పొలంలో విద్యుత్ స్తంభానికి అనుమతి ఇస్తే.. భారీ లాభం! కేంద్రం కొత్త నిర్ణయం!

  • Published Apr 15, 2024 | 3:24 PMUpdated Apr 15, 2024 | 3:24 PM

ప్రజలకు కష్టాలకు ఎప్పుడు అండగా ఉండేలా.. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలను తీసుకుంటూనే ఉంది. ఈ క్రమంలో వ్యవసాయ భూములపై విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫారంలు ఏర్పాటు చేయడం వలన రైతులు పడే ఇబ్బందులకు పరిష్కార మార్గాలను కనుగొంది ప్రభుత్వం.

ప్రజలకు కష్టాలకు ఎప్పుడు అండగా ఉండేలా.. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలను తీసుకుంటూనే ఉంది. ఈ క్రమంలో వ్యవసాయ భూములపై విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫారంలు ఏర్పాటు చేయడం వలన రైతులు పడే ఇబ్బందులకు పరిష్కార మార్గాలను కనుగొంది ప్రభుత్వం.

  • Published Apr 15, 2024 | 3:24 PMUpdated Apr 15, 2024 | 3:24 PM
మీ పొలంలో విద్యుత్ స్తంభానికి అనుమతి ఇస్తే.. భారీ లాభం! కేంద్రం కొత్త నిర్ణయం!

దేశంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మంచి నిర్ణయాలను తీసుకుంటూ.. ప్రజలకు అండ దండగా ఉంటుంది. కొత్త కొత్త పథకాలు ప్రవేశ పెడుతూ.. వారికీ ఉపాధి హామీలను కలిగిస్తూ సహాయం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే వ్యవసాయ భూములపై విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ ఫారంలను ఏర్పాటు చేయడం వలన రైతులు వారి వ్యవసాయ పనులకు ఇబ్బంది కలుగుతుందని.. ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో అటువంటి వారికీ మౌలిక సదుపాయాలను కలిగి ఉన్న భూములకు.. అనేక రకాల ప్రయోజనాలు కల్పించనుంది. పైగా.. విద్యుత్ చట్టం ప్రకారం.. రైతులు వారి వ్యవసాయ భూమిలో ఎలక్ట్రిక్ స్తంభాలను ఏర్పాటు చేస్తే.. వారికీ మరిన్ని ప్రయోజాబాలు ఉన్నాయి. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఇలాంటి ప్రయోజనాలకు అర్హత పొందేందుకు.. రైతులంతా ఖచ్చితంగా రాతపూర్వకంగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇక 30 రోజుల తర్వాత వాటికీ ఆమోదం లభించినప్పుడు.. పోల్ రకాన్ని బట్టి.. వారికీ ఆర్ధిక సహాయం అందుతుంది. ఇక ఆర్ధిక సహాయం కింద.. భూమిలో విద్యుత్ స్తంభాలను కలిగి ఉన్న రైతులకు.. వారానికి 100 రూపాయలు పరిహారం పొందుతారు. అంతే కాకుండా.. ట్రాన్స్ ఫారమ్స్ లో ఏదైనా లోపం ఉన్నట్లయితే.. దాని ప్రక్రియను 48 గంటల లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అలా కనుక జరగకపోతే.. రైతులకు చట్టం కింద 50 రూపాయల వరకు పరిహారం లభిస్తుంది. ఇక రైతులకు లభించే విద్యుత్ ప్రయోజనాల విషయానికొస్తే.. వారికీ DP , PL తో పాటు 2000 నుండి 5000 యూనిట్ల వరకు విద్యుత్ ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. అలాగే అందుకు తగిన సర్టిఫికెట్లు జారీ చేసినట్లయితే.. కంపెనీ, రైతుల మధ్య లీజ్ ఒప్పందం కూడా ఎరపడుతుంది. దాని నుంచి రైతులు రెండు నుంచి ఐదు వేల రూపాయల వరకు ఆర్ధిక సహాయాన్ని పొందుతారు.

Electric Transormation

ఇక వ్యవసాయ భూములలో కొత్తగా విద్యుత్ కనెక్షన్స్ తీసుకునే వారికీ.. కంపెనీ నిర్వాహకులు ఫ్రీ గానే కనెక్షన్స్ ఇస్తారు. కానీ కొత్త కనెక్షన్ తీసుకోడానికి మాత్రం 1500 నుంచి 5000 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. కానీ స్వయంగా వారి డబ్బుతోనే విద్యుత్ కనెక్షన్స్ ఉన్న యజమానులు మాత్రం వెంటనే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వ్యవసాయ విద్యుత్ స్తంభాలు ఉండటం వలన రైతుల నుండి తీవ్రమైన ఆందోళనలు వస్తూ ఉండేవి. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు, రైతులకు నష్టపరిహారం, అనేక ప్రయోజనాలను అందించడం ద్వారా.. ఆర్ధికంగా అండగా ఉంటూ.. ఇలాంటి ఆందోళనలను తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది. కాబట్టి దీనికి సంబంధించిన పథకాల కోసం రైతులు అప్లై చేసుకోవచ్చు. దీని ద్వారా ప్రయోజనాలను పొందుతూ వారి వ్యవసాయ కార్యకలాపాలతో పాటు.. విద్యుత్ మౌలిక సదుపాయాలను కూడా పొందవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి