iDreamPost

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్‌!

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్‌!

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలకు ఓ శుభవార్త అందింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పొదుపు రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించాలంటూ రాష్ట్ర బ్యాంకర్ల సమావేశంలో విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వడ్డీ తగ్గించింది. ఎస్‌బీఐ పొదుపు సంఘాల మహిళలకు ఇచ్చే రుణాలపై వడ్డీని 12.15 శాతం నుంచి 9.70కు తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలోనే మహిళలకు ఇచ్చే పొదుపు రుణాల వడ్డీ రేట్లు తగ్గించటానికి పలు బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. తాజాగా, కెనరా బ్యాంకు కూడా ఇందుకు ఆమోదం తెలిపింది. ఏ కేటగిరిలోని 5 లక్షలపైన పొదుపు రుణాలపై 9.70 వడ్డీని అమలు చేస్తామని ప్రకటించింది.

ఈ రుణాలపై అదనపు ప్రాసెసింగ్‌, ఇన్‌స్పెక్షన్‌, యాన్యువల్‌ రివ్యూ లేదా రెన్యువల్‌ ఛార్జీలను పూర్తిగా మినహాయిస్తున్నట్లు వెల్లడించింది. ఇక, పొదుపు సంఘాల మహిళల బాగు కోసం ప్రభుత్వం అన్ని రకాలు కృషి చేస్తోంది. పొదుపు సంఘాల్లో ఎక్కువగా పేద, మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయని, ప్రాసెసింగ్‌ ఛార్జీలు లేకుండా చూడాలని ప్రభుత్వం రిజర్వ బ్యాంకుకు లేఖ రాసింది. ముఖ్యమంత్రి కూడా బ్యాంకర్లకు ఇదే విషయాన్ని చెప్పారు. బ్యాంకుర్లు దీనిపై సానుకూలంగా స్పందించారు.

కాగా, డ్వాక్రా మహిళలకు సంబంధించి సున్నీ వడ్డీ రుణాలను తాజాగా ప్రభుత్వం విడుదల చేసింది. వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింది 9.48 లక్షల డ్వాక్రా సంఘాలకు నిధులను మంజూరు చేసింది. తద్వారా 1.05 కోట్ల మంది మహిళలు లబ్ధిపొందారు. ఇందుకోసం ప్రభుత్వం ఏకంగా 1353 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. మరి, డ్వాక్రా మహిళలకు ఇచ్చే పొదుపు రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ కెనరా బ్యాంకు ముందుకు రావటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి