iDreamPost

ఉపాధి కూలీలకు శుభవార్త చెప్పిన కేంద్రం!

Good News for Employed Laborers: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు గెలుపు లక్ష్యంగా తమ వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తున్నాయి.

Good News for Employed Laborers: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు గెలుపు లక్ష్యంగా తమ వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తున్నాయి.

ఉపాధి కూలీలకు శుభవార్త చెప్పిన కేంద్రం!

దేశ వ్యాప్తంగా త్వరలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ తమ వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. పేద ప్రజల కోసం, రైతు సంక్షేమం కోసం వివిధ పథకాలు అమలు చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేద ప్రజల కోసం ఉపాధి హామీ పథకాన్ని అమల్లోకి తీసుకు వచ్చింది కేంద్రం.  తాజాగా ఉపాధి హామీ కూలీలకు కేంద్రం ఓ శుభవార్త చెప్పింది. వివరాల్లోకి వెళితే..

ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకం నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం అనేక మార్పులు తీసుకు వచ్చింది. ఈ క్రమంలోనే సాఫ్ట్ వేర్ ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొని పనిదినాల లక్ష్యాన్ని కేటాయింపులపై పర్యవేక్షణ కొనసాగిస్తుంది. ఎన్నికల వేల ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రాల వారిగా రోజు కూలీ రేటును ఏప్రిల్ 1 నుంచి అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రోజు కూలీ రూ.272 నుంచి రూ.300 లకు పెరిగింది.

ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల సంఘం నుంచి క్లియరెన్స్ వచ్చాకే.. ఉపాధి హామీ కూలీల వేతన సవరణ వివరాలను మార్చి 27న కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ నోటిఫై చేసినట్లు తెలుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేదలకు ఆర్థికంగా అండగా నిలవాలనే ఉద్దేశ్యంతో కేంద్రం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఏడాదికి 100 రోజులు ఉపాధి కల్పించడమే ప్రధాన ఉద్దేశం. ఈ పథకాన్ని 2005 నుంచి ప్రారంభించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి