iDreamPost

కేంద్రం కొత్త యాప్.. స్విగ్గీ, జొమాటోల కన్నా తక్కువ ధరకే ఫుడ్‌

  • Published May 22, 2024 | 12:08 PMUpdated May 22, 2024 | 12:31 PM

ఆన్‌ లైన్‌ ఫుడ్‌ డెలివరీ అనగానే మనకి ముందుగా గుర్తుకు వచ్చేది జొమాటో, స్విగ్గీ. ప్రస్తుతం ఈ రెండిటి హవానే జోరుగా కొనసాగుతుంది. అయితే వీటికన్నా మార్కెట్‌ లో కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసిని ONDC లో అతి తక్కువ ధరకే ఫుడ్‌ లభిస్తుంది. ఆ వివరాలు చూద్దం.

ఆన్‌ లైన్‌ ఫుడ్‌ డెలివరీ అనగానే మనకి ముందుగా గుర్తుకు వచ్చేది జొమాటో, స్విగ్గీ. ప్రస్తుతం ఈ రెండిటి హవానే జోరుగా కొనసాగుతుంది. అయితే వీటికన్నా మార్కెట్‌ లో కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసిని ONDC లో అతి తక్కువ ధరకే ఫుడ్‌ లభిస్తుంది. ఆ వివరాలు చూద్దం.

  • Published May 22, 2024 | 12:08 PMUpdated May 22, 2024 | 12:31 PM
కేంద్రం కొత్త యాప్.. స్విగ్గీ, జొమాటోల కన్నా తక్కువ ధరకే ఫుడ్‌

ప్రస్తుతం ఆన్‌ లైన్‌ ఫుడ్‌ కు ఎంత గిరాకీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  నిమిషాల వ్యవధిలో ఉన్న చోటుకే  మనకి నచ్చిన ఫుడ్‌ డెలివరీ కావడంతో.. చాలామంది ఈ ఆన్‌ లైన్‌ ఫుడ్‌ పైనే ఆసక్తి చూపుస్తున్నారు. ఈ క్రమంలోనే ఆన్‌ లైన్‌ ఫుడ్‌ డెలివరీ అంటే.. మనకు ముందుగా గుర్తుకు వచ్చేది.. జొమాటో, స్విగ్గీ. ఎందుకంటే.. ఈ రెండు కంపెనీలూ నువ్వా నేనా అన్నట్లు పోటాపోటి పడుతున్నాయి.  ఇక వీటి మధ్య ఎన్నో కొత్త కంపెనీలు వచ్చినా వీటి ఆదరణలో ఎలాంటి మార్పు కనిపించదు. కొత్త కొత్త ఆఫర్లతో యూజర్లను ఆకట్టుకోవడంలో కొత్త కొత్త ఆఫర్లతో యూజర్లను ఆకట్టుకోవడంలో వాటికవే సాటి అని చెప్పవచ్చు. కానీ, ఇకపై  వాటికి చెక్‌ పెడుతూ..  ప్రభుత్వ రంగ ప్లాట్ ఫామ్ ఓఎన్‌డీసీ మార్కెట్‌ లో దూసుకుపోతుంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ONDC (ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్).. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఓఎన్‌డీసీ గురించే చర్చ నడుస్తోంది. ప్రభుత్వ రంగ ప్లాట్ ఫామ్ ఓఎన్‌డీసీ వేగంగా దూసుకొస్తోంది. రోజు రోజుకు ఈ ప్లాట్‌ఫామ్‌కు ఆదరణ పెరుగుతోంది.  కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఈ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో.. స్విగ్గీ, జొమాటోల వంటి వాటితో పోలిస్తే ఆహార పదార్థాల ధరలకు, ఫుడ్ డెలివరీ చాలా తేడాలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పలంటే ఎక్కువగా ఉన్నాయనే చెప్పవచ్చు. అందుకే ఆన్‌ లైన్‌ ఫుడ్‌ లవర్స్‌ ఇప్పుడు స్విగ్గీ, జొమాటో నుంచి ONDC పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాకుండా.. చాలా తక్కువ ధరకే ఫుడ్ లభిస్తోందంటూ ఇప్పటికే చాలా మంది యూజర్లు స్క్రీన్స్ షాట్లను తీసి సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు.  ఈ క్రమంలోనే.. చాలా తక్కువ కాలంలోనే ఓఎన్‌డీసీకి మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే రోజువారీ డెలివరీల సంఖ్య 10 వేలకు పైగా అందుకుంటుంది.

ముఖ్యంగా థర్డ్ పార్టీ యాప్‌లతో సంబంధం లేకుండానే.. ఎవరైనా ఈ ప్లాట్‌ఫామ్‌ లో కొనుగోలు చేయడం, ఫుడ్ ఆర్డర్లు చేయడం సులభంగా చేసుకోవచ్చు. కాగా, ప్రస్తుతం ఓఎన్‌డీసీ ప్లాట్‌ఫాన్ హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ సహా మొత్తం 240కిపైగా నగరాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. త్వరలో మరిన్ని నగరాల్లో అందుబాటులోకి రానుంది. అయితే ఇప్పుడు ఓఎన్‌డీసీ రిటైల్ ఆర్డర్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తుండడంతో.. త్వరలోనే జొమాటో, స్విగ్గీల వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడనుందని సోషల్‌ మీడియాలో వాదనలు వినబడుతున్నాయి. మరి, జొమాటో, స్విగ్గీల కన్నా ఓఎన్‌డీసీ ప్లాట్‌ఫామ్‌లో అతి తక్కువ ధరకే ఫుడ్‌ లభించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి