iDreamPost

ఎలాంటి పరీక్ష లేకుండానే బ్యాంక్‌లో ఉద్యోగాలు..నెలకు రూ. 20000 జీతం!

  • Published Apr 15, 2024 | 8:56 PMUpdated Apr 15, 2024 | 8:56 PM

బ్యాంకులలో ఉద్యోగాలు సాధించాలని ఎంతో మంది కలలు కంటూ ఉంటారు. అయితే, అటువంటి వారికీ ఒక గుడ్ న్యూస్. తాజాగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని పోస్ట్స్ ను రిలీజ్ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

బ్యాంకులలో ఉద్యోగాలు సాధించాలని ఎంతో మంది కలలు కంటూ ఉంటారు. అయితే, అటువంటి వారికీ ఒక గుడ్ న్యూస్. తాజాగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని పోస్ట్స్ ను రిలీజ్ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

  • Published Apr 15, 2024 | 8:56 PMUpdated Apr 15, 2024 | 8:56 PM
ఎలాంటి పరీక్ష లేకుండానే బ్యాంక్‌లో ఉద్యోగాలు..నెలకు రూ. 20000 జీతం!

బ్యాంకులలో ఉద్యోగాలు సాదించేందుకు.. సంవత్సరాల తరబడి చదువుతూనే ఉంటారు. చాలా మందికి బ్యాంక్ జాబ్స్ చేయడం అనేది ఒక కళ. దానికోసం పగలు రాత్రి తేడా లేకుండా చదువును కొనసాగిస్తూ.. అందుకు సంబంధించిన పరీక్షలను రాస్తూ ఉంటారు. విఫలం అయినా సరే .. ఎప్పుడో ఒకసారి సక్సెస్ కాలేకపోతామా అనే నమ్మకంతో.. చాలా మంది బ్యాంక్ జాబ్స్ కోసం నిరంతరం ట్రై చేస్తూనే ఉంటారు. అటువంటి వారందరికీ ఒక గుడ్ న్యూస్.. ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా .. తాజాగా కొన్ని పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్స్ ను రిలీజ్ చేసింది. ఈ పోస్టులు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభం అయింది. కాబట్టి అర్హత ఉన్న వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా .. తాజాగా విడుదల చేసిన పోస్ట్స్ వివరాలు ఇలా ఉన్నాయి. ఆఫీస్ అసిస్టెంట్ , ఫ్యాకల్టీ, అటెండర్ పోస్ట్స్. ఈ పోస్టులకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు.. అధికారిక వెబ్‌సైట్ centralbankofindia.co.in ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. ఈ పోస్ట్స్ కొరకు అప్లై చేసుకునేందుకు చివరి తేదీ ఏప్రిల్ 22. ఇక ఈ పోస్ట్స్ కు సంబంధించి వయోపరిమితి విషయానికొస్తే.. ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితి 35 ఏళ్లలోపు ఉండాలి. అటెండర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 ఏళ్ల నుచి 35 ఏళ్ళ మధ్యలో ఉండాలి. ఇక ఫ్యాకల్టీ దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 65 ఏళ్ల కంటే తక్కువ ఉండకూడదు.

ఇక ఏ పోస్ట్స్ కు సంబంధించిన జీతం విషయానికొస్తే.. ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు జీతం కింద నెలకు రూ. 12000 చెల్లిస్తారు. అటెండర్ పోస్టులకు ఎంపిక చేసిన అభ్యర్థులకు వారికి జీతం కింద రూ.8000 చెల్లిస్తారు. ఇక ఫ్యాకల్టీ పోస్టులకు ఎంపిక చేసిన అభ్యర్థులకు నెలవారీ జీతం రూ. 20000 ఇవ్వబడుతుంది. ఈ పోస్ట్ ల కొరకు ఎంపిక ఎలా జరుగుతుందంటే.. అభ్యర్థులను మొదట ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆ తర్వాత అందులో షార్ట్ లిస్ట్ చేసిన వారికి ఇంటర్వ్యూ తేదీ, సమయం, వేదిక తర్వాత తెలియజేయబడుతుంది. కాబట్టి ఎలాంటి పరీక్ష లేకుండానే బ్యాంక్‌లో ఉద్యోగాలు సంపాదించాలి అనుకునేవారు.. ఈ పోస్ట్స్ కు ధరఖాస్తు చేసుకోవచ్చు. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి