iDreamPost

Pallavi Prashanth:బస్సులపై దాడి ఘటనలో కేసు నమోదు.. ఏ-1గా Bigg Boss విన్నర్ పల్లవి ప్రశాంత్

బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దాడులకు పల్లవి ప్రశాంత్ కారణమని పోలీసులు తేల్చారు. ఆయన ఫ్యాన్స్ బస్సులపై దాడి చేసి ధ్వంసం చేసిన కేసులో ప్రశాంత్ ను ఏ1గా చేర్చారు.

బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దాడులకు పల్లవి ప్రశాంత్ కారణమని పోలీసులు తేల్చారు. ఆయన ఫ్యాన్స్ బస్సులపై దాడి చేసి ధ్వంసం చేసిన కేసులో ప్రశాంత్ ను ఏ1గా చేర్చారు.

Pallavi Prashanth:బస్సులపై దాడి ఘటనలో కేసు నమోదు.. ఏ-1గా Bigg Boss విన్నర్ పల్లవి ప్రశాంత్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ముగిసింది. ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో రైతు బిడ్డ, కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచి కప్ అందుకున్నాడు. రన్నరప్ గా అమర్ దీప్ నిలిచారు. అయితే ఫైనల్ సందర్భంగా పల్లవి ప్రశాంత్ అభిమానులు, అమర్ దీప్ అభిమానులు అన్నపూర్ణ స్టూడియో వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి ఫ్యాన్స్ మధ్య గొడవలు చెలరేగాయి. అన్నపూర్ణ స్టూడియో ముందు ప్రశాంత్ అభిమానులు, అమర్ దీప్ అభిమానులు నానా రచ్చ చేశారు. వీరిదాడుల్లో ఆర్టీసీ బస్సులు ధ్వంసం అయ్యాయి. దాడులపై ఫిర్యాదు అందిన నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులు పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు చేశారు. ఆ కేసులో ప్రధాన నిందితుడిగా పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు చేశారు.

బిగ్ బాస్ ఫైనల్స్ సందర్భంగా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఆర్టీసీ బస్సులపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడులకు పల్లవి ప్రశాంత్ కారణమని పోలీసులు తేల్చారు. ఈ ఘటనలో బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేగాక పల్లవి ప్రశాంత్ సోదరుడిని, అతని స్నేహితుడిని సైతం నిందితులుగా చేర్చారు. ఈ కేసులో మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. కాగా వాహనాల ధ్వంసం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పల్లవి ప్రశాంత్ ను ఏ1గా చేర్చారు జూబ్లీహిల్స్ పోలీసులు. ఇక ఏ2గా అతడి సోదరుడు మనోహర్, ఏ3గా ప్రశాంత్ ఫ్రెండ్ వినయ్ ను చేర్చారు. ఏ4గా ఉన్న సాయికిరణ్, అంకిరావుపల్లి రాజులను పోలీసులు అరెస్ట్ చేశారు. పల్లవి ప్రశాంత్ కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ ఫైనల్స్ జరిగిన రోజున పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్, అమర్ దీప్ ఫ్యాన్స్ మధ్య చోటుచేసుకున్న ఘర్షనలు ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది. అమర్ దీప్ తో పాటు మరికొంత మంది కార్లపై దాడి చేసి, భౌతిక దాడుకలకు కూడా పాల్పడ్డారు. ఫ్యాన్స్ ను తీసుకు రావొద్దని చెప్పిన తర్వాత కూడా పల్లవి ప్రశాంత్ పోలీసుల మాటను వినకుండా, బిగ్ బాస్ యాజమాన్యం చేసిన సూచనలను పట్టించుకోకుండా వ్యవహరించాడు. కప్ తీసుకుని ప్రశాంత్ బయటికి వచ్చిన తర్వాత పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సులపై దాడి చేసిన ఆయన ఫ్యాన్స్ బీభత్సం సృష్టించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను సేకరిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పరారీలో ఉన్న పల్లవి ప్రశాంత్ జాడ తెలుసుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. అతడి డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రశాంత్ ఫ్రెండ్స్, అనుచరుల ఫోస్ డేటా ఆధారంగా అతడిని పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు. మరి బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలోతెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి