iDreamPost
android-app
ios-app

సింగర్‌, జబర్దస్త్‌ ఆర్టిస్ట్‌పై కేసు నమోదు.. కారణమిదే!

  • Published Aug 20, 2023 | 11:21 AM Updated Updated Aug 20, 2023 | 11:21 AM
  • Published Aug 20, 2023 | 11:21 AMUpdated Aug 20, 2023 | 11:21 AM
సింగర్‌, జబర్దస్త్‌ ఆర్టిస్ట్‌పై కేసు నమోదు.. కారణమిదే!

బుల్లితెర మీద ప్రసారం అయ్యే జబర్దస్త్‌ కామెడీ షో ద్వారా ఎంతో మంది ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చారు. వీరిలో చాలా మంది సినిమాల్లో కమెడియన్‌లుగా కూడా రాణిస్తున్నారు. ఇక జబర్దస్త్‌ షోకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ప్రారంభమైనప్పటి నుంచి ఈ షో తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. ఎప్పటికప్పుడు ఈ షో ద్వారా కొత్త కొత్త కమెడియన్లు తెర మీదకు వస్తుంటారు. ఇలా జబర్దస్త్‌ షో ద్వారా గుర్తింపు పొందిన ఒక నటుడు, సింగర్‌పై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వివరాలు..

సింగర్‌, జబర్దస్త్‌ ఆర్టిస్ట్‌ నవ సందీప్‌పై హైదరాబాద్‌లో కేసు మోదయ్యింది. ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ ఓ యువతి కేసు నమోదు చేసింది. దాంతో పోలీసులు నవ సందీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నవ సందీప్‌.. అమీర్ పేటకు చెందిన యువతి(28)తో పరిచయం పెంచుకుని.. ఆమెతో మాట్లాడటం, చాటింగ్‌ చేయడం వంటివి చేశాడు. ఆ క్రమంలో వీరి పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా సదరు యువతి తనను పెళ్లి చేసుకోమని కోరుతూ ఉంది. కానీ సందీప్‌ మాత్రం రేపు, మాపు అంటూ వాయిదా వేయసాగాడు.

ఇక యువతి గట్టిగా నిలదీయడంతో.. పెళ్లి చేసుకోలేనని తేల్చి చెప్పాడు. దాంతో యువతి నవ సందీప్‌ తనను మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక గాయకుడు, కమెడియన్ అయిన నవ సందీప్ గోల్కొండ ప్రాంతంలో నివసిస్తున్నట్లు తెలిసింది. సందీప్‌ కమెడియన్‌గా, గాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక గంతలో జబర్దస్త్ కామెడీ షోలో కంటెస్టెంట్‌గా చేసిన జబర్దస్త్ హరిపై కూడా ఓ కేసు నమోదైంది. హరిబాబు ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో పట్టుబడిన సంగతి తెలిసిందే.

gamdomjojobetjojobet girişmarsbahiscasibom