iDreamPost

కాలు జారిన మోడల్.. షూ కంపెనీపై కేసు.. ఎందుకంటే?

ఆ షూ కంపెనీకి చెందిన హీల్స్ ధరించడం కారణంగానే తాను ప్రమాదం బారినపడినట్లు ఆ మోడల్ ఆరోపించింది. దీంతో ఆమె జీవితాంతం హీల్స్ ధరించలేని పరిస్థితి ఎదురైందని వెల్లడించింది. ఈ కారణంగానే ఆ మోడల్ కోర్టును ఆశ్రయించింది.

ఆ షూ కంపెనీకి చెందిన హీల్స్ ధరించడం కారణంగానే తాను ప్రమాదం బారినపడినట్లు ఆ మోడల్ ఆరోపించింది. దీంతో ఆమె జీవితాంతం హీల్స్ ధరించలేని పరిస్థితి ఎదురైందని వెల్లడించింది. ఈ కారణంగానే ఆ మోడల్ కోర్టును ఆశ్రయించింది.

కాలు జారిన మోడల్.. షూ కంపెనీపై కేసు.. ఎందుకంటే?

మన కర్మ మంచిగ లేక మరొకర్ని నిందించినట్లు తాను కిందపడ్డ కారణంగా షూ కంపెనిపై కేసు వేసింది ఓ మోడల్. ఆ షూ కంపెనీకి చెందిన హీల్స్ ధరించడం కారణంగానే తాను ప్రమాదం బారినపడినట్లు ఆ మోడల్ ఆరోపించింది. దీంతో ఆమె జీవితాంతం హీల్స్ ధరించలేని పరిస్థితి ఎదురైందని వెల్లడించింది. ఈ కారణంగానే ఆ మోడల్ కోర్టును ఆశ్రయించింది. ఈ నేపధ్యంలో ఆ మోడల్ సదరు షూ కంపెనీపై £ 100,000 (సుమారు ఒక కోటి రూపాయలు) నష్టపరిహారం కోసం కేసు వేసింది. స్టెల్లా మాక్‌కార్ట్‌నీ లిమిటెడ్ షూ కంపెనీ తనకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్ చేస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే?

లండన్‌కు చెందిన ఓ మోడల్‌ హీల్స్ ధరించి ఊహకందని రీతిలో ప్రమాదానికి గురైంది. అక్కడి స్థానిక మీడియా నివేదికల ప్రకారం 31 ఏళ్ల క్లో మికెల్‌బరో 2018లో మిలన్‌లోని డిజైనర్ బేస్‌లో ప్రకటనల షూట్‌లో పాల్గొంది. ఆ సమయంలో వాక్‌వేపై నడుచుకుంటూ వెళ్తుండగా కాలు స్లిప్‌ అయి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆ మోడల్ కాలి మడమ విరిగింది. దీంతో ఆమె మంచానికే పరిమితమైంది. దీంతో పాటు ఆమెకు మళ్లీ హీల్స్ ధరించే పరిస్థితి లేకుండా పోయింది. దీనంతటికి కారణం స్టెల్లా మాక్‌కార్ట్‌నీ లిమిటెడ్ షూ కంపెనీ హీల్స్ అని ఆరోపించింది.

ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న మోడల్ మికెల్‌బరో ఆ షూ కంపెనీ నుంచి పరిహారం పొందేందుకు కోర్టును ఆశ్రయించింది. తన భవిష్యత్ ఇబ్బందుల్లో పడిందని ఇకపై తానూ డ్యాన్స్ చేయలేనని, పరిగెత్తలేనని కోర్టుకు తన గోడును వెల్లబోసుకుంది. అయితే స్టెల్లా మాక్‌కార్ట్‌నీ లిమిటెడ్ షూ కంపెనీ ఆమె వాదనల్లో నిజం లేదని తెలిపింది. ఆమె తన స్వయంకృతాపరాదంతోనే కింద పడి గాయపర్చుకుందని కంపెనీ తరపు న్యాయవాది మైఖేల్ పాట్రిక్ తెలిపారు. ఇక ఈ కేసుపై కోర్టులో విచారణ జరుగుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి