iDreamPost

ఘోర ప్రమాదం.. ఏకంగా ఫస్ట్ ఫ్లోర్​లోకి దూసుకెళ్లిన కారు!

  • Author singhj Published - 01:11 PM, Wed - 9 August 23
  • Author singhj Published - 01:11 PM, Wed - 9 August 23
ఘోర ప్రమాదం.. ఏకంగా ఫస్ట్ ఫ్లోర్​లోకి దూసుకెళ్లిన కారు!

రోడ్డు ప్రమాదాల మాట వింటేనే భయమేస్తూ ఉంటుంది. మన దేశంలోనే కాదు ప్రపంచంలో రోజూ ఎక్కడో ఏదో చోట యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది. ఈ ప్రమాదాల్లో ఎక్కువగా రాత్రి పూటే జరుగుతాయి. ట్రాఫిక్ లేకపోవడం, రోడ్లు ఫ్రీగా ఉండటంతో స్పీడ్​గా వెళ్తూ అదుపుతప్పి ప్రమాదాలు చోటుచేసుకున్న ఘటనలు అనేకం ఉన్నాయి. నిద్ర మత్తులో బండి నడుపుతూ ఇతర వాహనాలను ఢీకొట్టి జరిగిన యాక్సిడెంట్​లు కూడా ఉన్నాయి. అలాగే మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ దేన్నో ఒకదాన్ని ఢీకొట్టి ప్రాణాలు కోల్పోయిన వారి గురించి కూడా వార్తల్లో వింటూనే ఉన్నాం.

నగరాలతో పాటు ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు, హైవేలు, ఎక్స్​ప్రెస్ వేలపై యాక్సిడెంట్లు ఎక్కువగా చోటుచేసుకుంటాయి. చాలా ప్రమాదాల్లో మితిమీరిన వేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, రూల్స్ పాటించకపోవడం, మద్యం తాగి వాహనాలు నడపడమే కారణాలని నిపుణులు అంటున్నారు. యాక్సిడెంట్స్ వల్ల ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రాణ నష్టంతో పాటు ధన నష్టం కూడా వాటిల్లుతోంది. ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. కొన్ని రోడ్డు ప్రమాదాలను చూస్తుంటే అసలు ఇది ఎలా జరిగింది? అనే సందేహం కలుగక మానదు. చాలా వరకు ప్రమాదాలు అనూహ్యంగా జరుగుతాయి.

వెంట్రుకవాసి తేడాలో ప్రమాదాలు తప్పిన ఘటనలు కూడా ఉన్నాయి. అలాంటి ఒక ఘటనే అగ్రరాజ్యం అమెరికాలో చోటుచేసుకుంది. అక్కడి పెన్సిల్వేనియా రాష్ట్రంలోని అల్పరటా ప్రాంతంలో ఆగస్టు 6వ తేదీన విచిత్రం జరిగింది. రోడ్డుపై రివ్వుమని దూసుకెళ్తున్న ఒక కారు ఏకంగా ఓ ఇంటి మేడ మీదకు దూసుకెళ్లింది. మిద్దెపై వేలాడుతున్న కారును చూసి.. అసలు అది అక్కడికెలా వెళ్లిందని అందరూ తలలు పట్టుకుంటున్నారు. అయితే మితిమీరిన స్పీడుతో దూసుకొచ్చిన ఆ కారు ఓ టౌన్​షిప్​లోని ఇంటి పక్కన ఉన్న కల్వర్టును ఢీకొట్టడంతో అమాంతం గాల్లోకి ఎగిరిపడింది. ఇంటిలోని ఫస్ట్​ ఫ్లోర్​ లోపలికి దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. అయితే అదృష్టవశాత్తూ ఆ టైమ్​లో మేడ గదిలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందని సమాచారం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి