iDreamPost

ఈ కోటి రూపాయల ప్రశ్నకు సమాధానం చెప్పగలరా?

ఈ కోటి రూపాయల ప్రశ్నకు సమాధానం చెప్పగలరా?

టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా రియాలిటీ షోలకు ఉండే క్రేజ్ వేరు. రియాలిటీ షోలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా తెలుగులో వచ్చిన మీలో ఎవరు కోటీశ్వరుడు, హిందీలో ప్రసారమవతోన్న కౌన్ బనేగా కరోడ్ పతి వంటి రియాలిటీ షోలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ షోలల్లో పాల్గొనాలంటే సామాన్యులు, సంపన్నులు అనే వ్యత్యాసం ఉండదు కేవలం నాలెడ్జ్ మీదనే ఆదారపడి ఉంటుంది. మీరు సంపాదించిన జ్ఞానమే ఈ రియాలిటీ షో మిమ్మల్ని లక్షాదికారిని, కోటీశ్వరులను చేస్తాయి. అయితే తాజాగా కౌన్ బనేగా కరోడ్ పతి షోలో పాల్గొన్న ఓ కంటెస్టెంట్ కు కోటీ రూపాలయ ప్రశ్న ఎదురైంది. మరి అతడు దానికి సమాధానం చెప్పాడా? అసలు ఆ ప్రశ్న ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా చేస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచంలో చోటుచేసుకున్న అంశాలపై అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం ద్వారా డబ్బులు గెలుచుకోవచ్చు. ఈ క్విజ్ ప్రశ్నలతో కూడిన ఈ కౌన్ బనేగా కరోడ్ పతి రియాలిటీ షో జ్ఞానాన్ని అందించే విధంగా ఉండడంతో ప్రేక్షకులు ఆసక్తికరంగా వీక్షిస్తుంటారు. కాగా కౌన్ బనేగా కరోడ్ పతి షోలో ఇండోర్ కు చెందిన శుభమ్ గ్యాంగ్రేడేకు కోటీరూపాలయ ప్రశ్న ఎదురవగా సమాధానం చెప్పలేకపోయాడు. ముందు నుంచి కోటి రూపాయలు గెలుస్తాడని అనుకున్న సందర్భంలో అంచనాలన్నీ తలకిందులయ్యాయి.

ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే

కౌన్ బనేగా కరోడ్ పతిలో పోటీదారుగా ఉన్న శుభమ్ గ్యాంగ్రేడ్ అద్భుతమైన ప్రదర్శనును కనబర్చాడు. ప్రశ్నలన్నింటికి సమాధానాలు చెబుతూ కోటీ రూపాయల ప్రశ్నకు చేరుకున్నాడు. అదే ఆ షోలో అడిగిన 14వ ప్రశ్న. అదేంటంటే జపాన్‌లోని హిరోషిమాపై వేసిన మొదటి అణు బాంబు దాడుల గురించిన ప్రశ్న. “ఆగస్టు 6, 1945న హిరోషిమాపై మొదటి అణు బాంబును వేసిన విమానానికి ఏ పేరు పెట్టారు?” అనేది ప్రశ్న. దీనికి శుభమ్‌ గ్యాంగ్రేడ్ కు నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు. కానీ అతడు చెప్పలేక పోయాడు. ఈ ప్రశ్నకు సమాధానం ‘ఎనోలా గే’ అని తేలిపోయింది. అయితే శుభమ్ గ్యాంగ్రేడ్ కు 50 లక్షల ప్రశ్న సమయంలో తనకున్న లైఫ్ లైన్లు అన్నీ ఉపయోగించుకున్నాడు. దీంతో అతడు కోటి రూపాయల ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు. దీంతో శుభమ్ రూ. 50 లక్షలు తీసుకుని షో నుంచి వెళ్లిపోయాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి