iDreamPost

Amitabh Bachchan: విరాట్ కోహ్లీ ఇంటి పక్కనే స్థలం కొన్న అమితాబ్! ఎన్ని కోట్లంటే?

బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ కొన్ని రోజుల వ్యవధిలోనే రెండు చోట్ల ఇళ్ల స్థలాలను కొనుగోలు చేసి అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇందులో ఒకటి విరాట్ కోహ్లీ ఇంటి పక్కనే కావడం విశేషం. ఆ వివరాలు..

బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ కొన్ని రోజుల వ్యవధిలోనే రెండు చోట్ల ఇళ్ల స్థలాలను కొనుగోలు చేసి అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇందులో ఒకటి విరాట్ కోహ్లీ ఇంటి పక్కనే కావడం విశేషం. ఆ వివరాలు..

Amitabh Bachchan: విరాట్ కోహ్లీ ఇంటి పక్కనే స్థలం కొన్న అమితాబ్! ఎన్ని కోట్లంటే?

రాజకీయ, సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఎక్కువగా స్థలాలపైనే పెట్టుబడి పెడుతూ ఉంటారు. తమకు నచ్చిన చోట భూములను కొనుగోలు చేసి విల్లాలు, భారీ బంగ్లాలు కట్టుకుంటారు. మరి కొందరు మాత్రం స్థిరాస్తి ఉండాలని భావించి ఇలా భూములు కొనుగోలు చేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ కొన్ని రోజుల వ్యవధిలోనే రెండు చోట్ల ఇళ్ల స్థలాలను కొనుగోలు చేసి అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే? విరాట్ కోహ్లీ ఇంటి పక్కనే బిగ్ బి స్థలం కొన్నాడట. ఈ విషయం ప్రస్తుతం వైరల్ గా మారింది.

బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ ఇటీవలే అయోధ్యలోని సరయూ నదికి దగ్గరలో ఉన్న ది సరయు ఎన్ క్లేవ్ లో భూమిని కోనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడి నుంచి అయోధ్య రామమందిరానికి వెళ్లడానికి కేవలం 15 నిమిషాలు మాత్రమే పడుతుంది. ఇక ఎయిర్ పోర్ట్ కు 30 నిమిషాల ప్రయాణం. ఈ ప్రాపర్టీతో పాటుగా తాజాగా మరోటి కొనుగోలు చేశాడట బిగ్ బి. ముంబైలోని అలీబాగ్ ద్వీపంలో అమితాబ్ దాదాపు 20 ఎకరాల భూమిని కొన్నాడట. ఇందుకు రూ. 10 కోట్లు ఖర్చు అయినట్లు అక్కడి వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ఇదిలా ఉండగా.. ఇప్పటికే అక్కడ టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఓ భారీ బంగ్లా ఉంది. దానికి దగ్గర్లోనే బిగ్ బి స్థలం కొన్నట్లు తెలుస్తోంది. అమితాబ్ సైతం ఈ ప్లేస్ లో భారీ ఫామ్ హౌస్ నిర్మించడానికే ఈ స్థలం కొనుగోలు చేశాడని సమాచారం. ఇక బిగ్ బి చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడీ మూవీలో కీలక పాత్ర అయిన అశ్వత్థామ రోల్ లో నటిస్తున్నాడు. కాగా.. ఇటీవలే బిగ్ బి పాత్రకు సంబంధించిన గ్లింప్స్ విడుదలై సూపర్ రెస్పాన్స్ ను దక్కించుకున్నాయి. ఈ మూవీతో పాటుగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘వెట్టయన్’లో కూడా కీ రోల్ చేస్తున్నాడు. బిగ్ బికి ఇది తొలి తమిళ ప్రాజెక్ట్ కావడం విశేషం. వీటితో పాటుగా బ్రహ్మాస్త్ర 2, ది ఉమేష్ క్రోనికల్స్ మూవీలు బిగ్ బి చేతిలో ఉన్నాయి. 81 ఏళ్లు వచ్చినాగానీ.. వరుసగా సినిమాలు చేస్తూ తగ్గేదేలే అంటున్నాడు అమితాబ్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి