iDreamPost

ఇంటి వద్దకే పెట్రోల్​, డీజిల్​ డెలివరీ.. ఇలా ఆర్డర్ చేసుకోవచ్చు!

  • Published Jan 04, 2024 | 1:52 PMUpdated Jan 04, 2024 | 1:52 PM

ప్రస్తుతం పెట్రోల్ బంకుల్లో గంటల తరబడి నిలబడే కష్టాలు లేకుండా.. పెట్రోల్ కోసం బాటిల్ పట్టుకొని బంక్ కు పరిగెత్తకుండా అతి చక్కటి సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. అదే ఏమిటంటే..

ప్రస్తుతం పెట్రోల్ బంకుల్లో గంటల తరబడి నిలబడే కష్టాలు లేకుండా.. పెట్రోల్ కోసం బాటిల్ పట్టుకొని బంక్ కు పరిగెత్తకుండా అతి చక్కటి సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. అదే ఏమిటంటే..

  • Published Jan 04, 2024 | 1:52 PMUpdated Jan 04, 2024 | 1:52 PM
ఇంటి వద్దకే పెట్రోల్​, డీజిల్​ డెలివరీ.. ఇలా ఆర్డర్ చేసుకోవచ్చు!

ట్రక్కు డ్రైవర్లు చేపట్టిన సమ్మె.. సామాన్యులపై భారీ ప్రభావం చూపింది. రెండు రోజుల సమ్మె వల్ల పెట్రోలు బంకుల వద్ద రద్దీ పెరిగింది. గంటల వ్యవధిలోనే బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనం ఇచ్చాయి. కేంద్ర ప్రభుత్వం హిట్ అండ్ రన్ కేసుల్లో తెచ్చిన మార్పులతో ట్రక్కు డ్రైవర్లు సమ్మె చెపట్టారు. అయితే సమ్మె చాలా రోజులు ఉంటుందోననే భయంతో చాలమంది ఫుల్ ట్యాంక్ చేయించుకున్నారు. కొన్ని చోట్ల బకెట్లు, క్యాన్లలో పెట్రోలు కొట్టించుకుని వెళ్లారు. దాంతో బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనం ఇచ్చాయి. రద్దీ కారణంగా ఎక్కడికక్కడ భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక పెట్రోల్ కోసం బంకుల్లో పెద్ద ఎత్తున క్యూ కట్టారు. గంటల తరబడి లైన్లో నిలబడ్డారు. దాంతో చాలా మంది.. పెట్రోల్ కూడా డోర్ డెలివరీ ఇచ్చే సర్వీసులు ఉంటే బాగుండు అని కోరుకున్నారు. అయితే ఇప్పటికే ఇలాంటి సర్వీసు అందుబాటులోకి వచ్చింది కానీ జనాలకు పెద్దగా తెలియలేదు. కానీ తాజాగా ట్రక్కు డైవర్ల సమ్మె వల్ల.. డోర్ స్టెప్ ఫ్యూయెల్ డెలివరీ సర్వీస్ వార్తల్లో నిలిచింది. దీని వివరాలు..

డోర్ స్టెప్ ఫ్యూయెల్ డెలివరీ సర్వీస్ వల్ల పెట్రోల్ బంకుల్లో గంటల తరబడి నిలబడే కష్టాలు ఉండవు. అలాగే బైక్ పై వెళ్తుంటే పెట్రోల్ అయిపోతే బంకుల దాకా బండిని నడిపించే పనిలేదు. అలానే వాహనం అక్కడే పెట్టి.. పెట్రోల్ కోసం బాటిల్ పట్టుకొని బంక్ కు పరిగెత్తే అవసరం లేదు. ఈ డోర్ స్టెప్ ఫ్యూయెల్ డెలివరీ సర్వీస్ వల్ల పెట్రోల్ ని కూడా ఆన్ లైన్ లో బుక్ చేసుకుని.. మనం ఉన్న దగ్గరకే తెప్పించుకోవచ్చు. ఇండియన్ అయిల్, భారత్ పెట్రోలియం వంటి చమురు వ్యాపార సంస్థలను కొన్ని ప్లాట్ ఫామ్స్ తో టైఅప్ అయ్యిఈ తరహా సేవలను అందిస్తున్నాయి. బిజినెస్ ఎంటీటీలు, కమర్షియల్ వెహికిల్స్ కి పెట్రోల్, డీజిల్ ను అందిస్తున్నాయి.

petrol home delivery

అయితే ఈ సేవలను పొందాలంటే.. ముందుగా సదరు ప్లాట్ ఫామ్ లో మీ పేరుని రిజస్టర్ చేసుకొని, మీ లొకేషన్ ని షేర్ చేయాలి. ఆ తర్వాత ఎంత పెట్రోల్, డీజిల్ కావాలి అన్నది చెప్పాల్సి ఉంటుంది. ఆపై ధరను కన్ఫామ్ చేయాలి. అయితే ఇండియన్ అయిల్, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం వంటి కొలాబొరేట్ అయిన ప్లాట్ ఫామ్స్ ని వాడితేనే.. ఈ సేవలు వినియోగించుకోవచ్చు.

కాగా, ఇండియన్ అయిల్ కు చెందిన సర్వీస్ సంబంధించి ఫ్యూయోల్ బడ్డీ, పెప్ ఫ్యూయెల్స్, హమ్ సఫర్, రెపోస్ ఎనర్జీ వంటి స్టార్టప్ సంస్థలు ప్రస్తుతం పెట్రోల్, డీజీల్ డోర్ డెలివరీ సేవలను అందిస్తున్నాయి. ఇక ఈ తరహా బిజినెస్ లు డీల్లీ, ముంబై, బెంగళూరుతో పాటు ఇతర ప్రధాన నగరాల్లోనే అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే వీటిని దేశవ్యాప్తంగా విస్తరించాలని సంస్థలు ప్లాన్ చేస్తున్నాయి. మరి, ఫుడ్ డెలవరీ యాప్స్ లా పెట్రోల్ డోర్ డెలవరీ సర్వీస్ అందుబాటులోకి రావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి