iDreamPost

చెత్తకు ఇంధన పథకం.. పెట్రోల్ ధరలపై భారీ తగ్గింపు!

చెత్తకు ఇంధన పథకం.. పెట్రోల్ ధరలపై భారీ తగ్గింపు!

ప్రస్తుతం పెరిగిన ఇంధన ధరల కారణంగా సామాన్యుడు అల్లాడిపోతున్నాడు.  పెట్రోల్,డీజిల్ ధరలు ఆకాశవైపు చూస్తున్నాయే తప్ప..నేల వైపు చూడటం లేదు. దీంతో బైక్, ఇతర వాహనాలపై వెళ్లాలంటేనే సామాన్యుడి ఒంట్లో వణుకు వస్తుంది. అంతకంతకూ పెరుగుతున్న ఇంధన ధరలను మనం ఎలాగూ కంట్రోల్ చేయలేం. ఇలాంటి సమయంలో పెట్రోల్ ను తక్కువ ధరలో పొందే మార్గాల కోసం అన్వేషించాలి.  అలాంటి సమయంలో ఏదైన పెట్రోల్ రేటు తగ్గే స్కీమ్ కనిపించ వచ్చు. అయితే ఏంటి ఈ చెత్త వాగుడు, ఇదేమైనా ఎక్స్ఛేజ్ కార్యక్రమం అనుకుంటున్నారా?. అవును.. ఇది నిజంగానే చెత్త ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామే. ఈ వెరైటీ ప్రోగ్రామ్ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది ప్రముఖ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల్లో ఒకటి. ఐవోసీఎల్ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పర్యావరణ పరిరక్షణకు నడుముబిగించే సంస్థల్లో ఒకటిగా ఐవోసీఎల్ నిలిచింది.  రీఫ్యూయల్ విత్ రీసైకిల్ పేరిట Recykalతో కలిసి పర్యావరపణ పరిరక్షణకు కృషి చేస్తేంది. హైదరాబాద్ నగర ప్రజలు.. తమ ఇళ్లలోని వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించేందుకు చేతులు కలపాలని ప్రోత్సహిస్తోంది.  ఇక ఈ ప్రోగ్రామ్ ద్వారా పెట్రోల్ ను కూడ తక్కువ ధరకే పొందవచ్చు.

అది  ఎలా అంటే.. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుల్లో క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయడం ద్వారా తొలుత ఈ ప్రోగ్రామంలో రిజిస్టర్ కావచ్చు. ప్రజలు తమ చెత్తను అక్కడ తూకం వేసి బరువుకు తగినన్ని క్రెడిట్ పాయింట్లు పొందవచ్చు. ఇక పెట్రోల్, డీజిల్ నింపుకునే సమయంలో ఈ పాయింట్లను రిడీమ్ చేసుకుని పెట్రోల్ ఖర్చు తగ్గించుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ ఆగష్టు 2023 వరకు పైలట్ ప్రాజెక్టుగా కొనసాగుతుంది. ఈ ప్రోగ్రామ్ కోసం హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాలనే ఎంపిక చేశారు. అలా ఎంపిక చేసిన వాటిల్లో హైటెక్ సిటీ COCO, టీఎస్ఐఐసీ నాలెడ్జ్ సిటీ, జూబ్లీ హిల్స్ రోడ్ నం-36 కోకో, మియాపూర్ సైబర్ ఫిల్లింగ్ స్టేషన్, బేగంపేట కోకో పెట్రోల్ బంకులలో మాత్రమే ఇందుకు అవకాశం కల్పించారు.

మొదటగా ఈ 5 చోట్ల  ప్రారంభించి.. వినియోగదారుల స్పందన ఆధారంగా భవిష్యత్తులో 34 వేల బంకులనూ కవర్ చేసేలా ప్రణాళి చేశారు. ఇక ప్రజలు చెత్తగా ప్లాస్టిక్ వ్యర్థాలు, పేపర్, కార్డు బోర్డు, ల్యాప్  ట్యాప్, మొబైల్స్, కేబుల్స్ సహా ఇతర పనికిరాని వస్తువులపై  ఎంపిక చేసిన ఇండియన్ ఆయిల్ బంకుల్లో ఇవ్వొచ్చు. 10 కేజీల కంటే ఎక్కువ వ్యర్థాలను అందించిన వారికి కొంత అదనపు ఉపయోగం ఉంటుంది. ఇలా ఒక దెబ్బకు రెండు పిట్టలు అనే సామెత మాదిరి..ఉచిత ఇంధనాన్ని ఆస్వాదిస్తూనే, వ్యర్థాలను బాధ్యతాయుతంగా రీసైకిల్ చేసే అవకాశం లభిస్తుంది. తద్వారా పరిశుభ్రమైన సమాజ స్థాపనకు సహకరించినట్లవుతుంది. మరి… వినూత్న స్కీమ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి