iDreamPost
android-app
ios-app

RCBలో కోహ్లీ కంటే ఎక్కువ డిమాండ్‌ ఈ యంగ్‌ క్రికెటర్‌కే!

  • Published Nov 28, 2023 | 12:34 PM Updated Updated Nov 28, 2023 | 12:34 PM

ఐపీఎల్‌లో ఒక్కసారి కూడా కప్పు గెలవకపోయినా.. ఫ్యాన్‌ ఫాలోయింగ్‌, ‍క్రేజ్‌ విషయంలో నంబర్‌ టీమ్‌గా ఉంది ఆర్సీబీ. అలాంటి టీమ్‌కు కోహ్లీనే కింగ్‌. కానీ, ఇప్పుడు కోహ్లీని మించినోడు ఒకడు ఆర్సీబీలో చేరాడు. అసలు కోహ్లీకి అతనికి లింక్‌ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌లో ఒక్కసారి కూడా కప్పు గెలవకపోయినా.. ఫ్యాన్‌ ఫాలోయింగ్‌, ‍క్రేజ్‌ విషయంలో నంబర్‌ టీమ్‌గా ఉంది ఆర్సీబీ. అలాంటి టీమ్‌కు కోహ్లీనే కింగ్‌. కానీ, ఇప్పుడు కోహ్లీని మించినోడు ఒకడు ఆర్సీబీలో చేరాడు. అసలు కోహ్లీకి అతనికి లింక్‌ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..

  • Published Nov 28, 2023 | 12:34 PMUpdated Nov 28, 2023 | 12:34 PM
RCBలో కోహ్లీ కంటే ఎక్కువ డిమాండ్‌ ఈ యంగ్‌ క్రికెటర్‌కే!

వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్లో ఓటమితో బాధపడుతున్న భారత క్రికెట్‌ అభిమానుల మూడ్‌ మార్చేలా ఒక్కసారిగా ఐపీఎల్‌కు సంబంధించిన ఆప్డేట్స్‌ వార్తల్లో నిలిచాయి. ఐపీఎల్‌ 2024కు ఇంకా చాలా సమయంలో ఉన్నా.. ఇంటర్నల్‌ ట్రేడింగ్‌, రిలీజ్‌, రిటేన్‌ ప్రక్రియతో ఐపీఎల్‌ టాక్‌ ఆఫ్‌ ది క్రికెట్‌ టౌన్‌గా మారింది. అందులోనూ గుజరాత్‌ టైటాన్స్‌కు ఐపీఎల్‌ 2022, 2023 సీజన్లలో కెప్టెన్‌గా వ్యవహరించి.. తొలి సీజన్‌లోనే ఆ జట్టును ఛాంపియన్‌గా నిలిపిన కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యా.. అనూహ్యంగా తిరిగి తన పాత ఫ్రాంచైజ్‌ ముంబైకి మారిపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. పాండ్యా విషయం అటుంచితే.. ఐపీఎల్‌ 2023 మినీ వేలంలో ఏకంగా రూ.17.5 కోట్ల భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన కామెరున్‌ గ్రీన్‌ను ముంబై రిలీజ్‌ చేయడం కూడా క్రికెట్‌ ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేసింది.

అయితే.. ఇప్పటికే విరాట్‌ కోహ్లీ, ఫాఫ్‌ డుప్లెసిస్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, దినేష్‌ కార్తీక్‌ లాంటి స్టార్లతో నిండిన జట్టులో కామెరున్‌ గ్రీన్‌ కూడా వచ్చి చేరడంతో.. ఆర్సీబీ మరింత బలపడినట్లు కనిపిస్తోంది. అయితే.. చాలా కాలంగా ఆర్సీబీకి కోహ్లీనే బ్రాండ్‌ అంబాసిడర్‌లా ఉన్నాడు. నిజానికి కోహ్లీ వల్లే ఆర్సీబీకి అంత క్రేజ్‌ వచ్చింది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆర్సీబీ కప్పు కొట్టకపోయినా.. ఐపీఎల్‌లో అందరి కంటే ఎక్కువ క్రేజ్‌ ఉన్న టీమ్‌, భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న టీమ్‌ ఆర్సీబీనే. అందుకు ప్రధాన కారణం కోహ్లీ. కోహ్లీకి ఉన్న అభిమాన గణం మొత్తం అవుట్‌ రైట్‌గా ఆర్సీబీకి మద్దతు ఇస్తుంటారు.

కోహ్లీ ఆర్సీబీకి కెప్టెన్‌గా ఉన్నా.. కెప్టెన్‌గా లేకపోయినా.. ఆర్సీబీలో కింగ్‌ అంటే కోహ్లీనే. ఆ జట్టుకు అతనే ముఖచిత్రం. అందుకే కోహ్లీకి ఆర్సీబీ యాజమాన్యం భారీ మొత్తంలో రెమ్యునరేషన్‌ ఇస్తూ వస్తోంది. అయితే.. ఐపీఎల్‌ 2024లో మాత్రం కోహ్లీని మించి ఓ ఆటగాడు భారీ పారితోషికం అందుకోనున్నాడు. ఆ ఆటగాడు ఎవరో కాదు.. ఆస్ట్రేలియన్‌ యంగ్‌ క్రికెటర్‌ కామెరున్‌ గ్రీన్‌. క్యాష్‌ ట్రేడింగ్‌ పద్ధతిలో ముంబై నుంచి గ్రీన్‌ను ఆర్సీబీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీంతో.. ఐపీఎల్‌ 2024 సీజన్‌కు గాను.. గ్రీన్‌కు ఆర్సీబీ రూ.17.5 కోట్లు చెల్లించనుంది. ఇది కోహ్లీ కంటే ఎక్కువ అమౌంట్‌. కోహ్లీకి రూ.15 నుంచి రూ.17 కోట్ల మధ్య చెల్లించనుంది ఆర్సీబీ. మరి ఆర్సీబీలో కోహ్లీ కంటే ఎక్కువ రెమ్యునరేషన్‌ ను గ్రీన్‌ అందుకోనుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.