• హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • సినిమా
  • రివ్యూస్
  • క్రైమ్
  • క్రీడలు
  • Nostalgia
  • వీడియోలు
  • బిగ్‌బాస్‌ 7
  • వార్తలు
  • జాతీయం
  • వైరల్
  • విద్య
  • ఉద్యోగాలు
  • టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • Home » news » By Polls Boosted Bjp In Telangana

Telangana BJP By Polls -తెలంగాణ బీజేపీ కి క‌లిసొచ్చిన ఉప ఎన్నిక‌లు

  • By Idream media Updated On - 10:35 PM, Fri - 11 March 22 IST
Telangana BJP By Polls -తెలంగాణ బీజేపీ కి క‌లిసొచ్చిన ఉప ఎన్నిక‌లు

తెలంగాణ‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ మంచి ఊపు మీదుంది. ఎన్నిక‌లంటే తెగ ఉత్సాహం చూపుతోంది. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో అధికారం కోసం త‌హ‌త‌హ‌లాడుతున్న పార్టీకి ఉప ఎన్నిక‌లు జోష్ నింపాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ మూడు ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ్గా.. రెండు చోట్ల ఆ పార్టీ అభ్య‌ర్థులే విజ‌యం సాధించారు. అలాగే తెలంగాణ‌కు గుండెకాయ లాంటి గ్రేట‌ర్ లో కూడా టీఆర్ఎస్ కు దీటుగా బీజేపీ కార్పొరేట‌ర్లు ఉన్నారు. ఈ ఉత్సాహంగా ఎప్పుడు ఏ ఎన్నిక‌లు వ‌స్తాయా అని ఉత్సాహంగా ఎదురుచూస్తున్న ధోర‌ణి క‌నిపిస్తోంది.

రాష్ట్రంలో ఉన్న పార్టీల్లో మంచి జోష్ మీద ఉన్న పార్టీ ఏదయ్యా అంటే కచ్చితంగా బీజేపీ అని చెప్పొచ్చు. దుబ్బాక‌, సాగ‌ర్, హుజూరాబాద్ ల‌లో ఉప ఎన్నిక‌లు జ‌రిగితే సాగ‌ర్ మిన‌హా.. రెండో చోట్లా కూడా బీజేపీ యే ఎమ్మెల్యే స్థానాల‌ను సాధించుకుంది. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఏకైక స్థానం గోషామ‌హ‌ల్ లో మాత్ర‌మే విజ‌యం సాధించింది. ఉప ఎన్నిక‌ల్లో గెలుపుతో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య మూడుకు చేరింది. రాజాసింగ్, ర‌ఘునంద‌న్, రాజేంద‌ర్ .. ముగ్గురూ ఇప్పుడు బీజేపీలో త్రిబుల్ ఆర్ గా గుర్తింపు పొందుతున్నారు. ఇదిలా ఉండ‌గా, హుజూరాబాద్ విజయంతో ఆ పార్టీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల మీద ఆశలు పెరిగాయి. అంటే అధికారంలోకి వస్తామనే నమ్మకం పెరిగింది. వచ్చే ఎన్నికల్లోగా తమ బలాన్ని మరింత పెంచుకోవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది.

Also Read : Sajjala, Prasanth Reddy, Harish Rao – మా మీద ఏడుపు ఎందుకు: తెలంగాణకు సజ్జల స్ట్రాంగ్ కౌంటర్

తెలంగాణ‌లో ఉప ఎన్నిక‌లు జ‌ర‌గాల్సిన స్థానాలు ఏమున్నాయా అని ఆరా తీసే ప‌నిలో ఉంది. ఉప ఎన్నికలు వ‌స్తే అక్క‌డ కూడా విజయం సాధించాలని ఆ పార్టీ అనుకుంటోంది. అలా చూస్తున్న కాషాయం పార్టీకి ప్రస్తుతం రెండు అసెంబ్లీ స్థానాలు కనబడుతున్నాయి. ఆ రెండు చోట్ల ఎన్నికలు జరుగుతాయని అంచనా వేస్తోంది. ఒకవేళ ఎన్నికలు జరిగితే ఆ రెండు చోట్లా గెలవడం గ్యారంటీ అనుకుంటోంది. బీజేపీ అనుకుంటున్న రెండు స్థానాల్లో మొదటిది వేములవాడ నియోజకవర్గం. ఇక్కడి ఎమ్మెల్యే టీఆర్ఎస్ కు చెందిన చెన్నమనేని రమేష్. ఈయన పౌరసత్వం కేసు కోర్టులో ఉంది. ఆ కేసులో తీర్పు రమేష్ కు ప్రతికూలంగా వస్తే ఆయన మీద అనర్హత వేటు పడుతుంది. కాబట్టి అక్కడ ఉప ఎన్నిక జరుగుతుంది. అదే జరిగితే అక్కడ పాగా వేయాలని బీజేపీ ప్లాన్.

హుజూరాబాద్ ఉప ఎన్నికలో కేసీఆర్ శతవిధాలుగా ప్రయత్నాలు చేసినా గులాబీ పార్టీ ఓడిపోవడంతో తమ పార్టీని ఓడించడం కష్టమనే నమ్మకం బీజేపీ నాయకుల్లో పెరిగిపోయింది. హుజూరాబాద్ ఉప ఎన్నికతో టీఆర్ఎస్ మీద ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా ఆ వ్యతిరేకత తగ్గదని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ఉప ఎన్నిక జరుగుతుందని బీజేపీ నాయకులు అంచనా వేస్తున్న మరో నియోజకవర్గం మునుగోడు. నల్గొండ జిల్లాలోని ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయనకు కాంగ్రెస్ పై అసంతృప్తిగా ఉంది.

తాను బీజేపీలో చేరతానని ఇదివరకే చెప్పాడు. ఒకవేళ ఆయన బీజేపీలో చేరితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాడు కాబట్టి అక్కడ ఉప ఎన్నిక జరుగుతుంది. ఇది కాకుండా నల్గొండ జిల్లాలోనే మరో రెండో మూడో స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నాడు. ఇప్పుడైతే వేములవాడ, మునుగోడు మీద ఆశలు పెట్టుకొని ఉంది కాషాయ పార్టీ. మ‌రి బీజేపీ ప్లాన్ కు టీఆర్ఎస్ ఎటువంటి ప్లాన్ లు వేయ‌నుందో చూడాలి.

Also Read : Huzurabad, Revanth – రేవంత్ కు హుజూరా”బ్యాడ్” క‌ష్టాలు

Tags  

Related News

రైతులు ఆత్మహత్యలు చేసుకొని చావాలంటూ నోరుజారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

రైతులు ఆత్మహత్యలు చేసుకొని చావాలంటూ నోరుజారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తాజాగా మరో వివాదాన్ని కొనితెచ్చుకున్నారు. ఆరిజిన్ డెయిరీ సీఈవో బోడపాటి శేజల్.. తనపై మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం రాజయ్య లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ శేజల్ పలుమార్లు ఆత్మహత్యకు పాల్పడిన సంగతి విదితమే. అతడిపై ఢిల్లీకి వెళ్లి మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేసింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల జాబితాను బీఆర్ఎస్ విడుదల చేయగా.. అందులో దుర్గం చిన్నయ్యకు కూడా సీటు కేటాయించడంపై […]

2 mins ago
కూతురిపై ట్రోలింగ్స్‌.. వీడియోకు లైక్‌ కొట్టిన స్టార్‌ హీరో!

కూతురిపై ట్రోలింగ్స్‌.. వీడియోకు లైక్‌ కొట్టిన స్టార్‌ హీరో!

3 mins ago
చంద్రబాబు క్వాష్ పిటీషన్ AP హైకోర్టు కొట్టేయడానికి అసలు కారణం ఇదే?

చంద్రబాబు క్వాష్ పిటీషన్ AP హైకోర్టు కొట్టేయడానికి అసలు కారణం ఇదే?

22 mins ago
రోకలి బండతో భర్తను కొట్టి చంపిన భార్య! ఎందుకో తెలుసా?

రోకలి బండతో భర్తను కొట్టి చంపిన భార్య! ఎందుకో తెలుసా?

31 mins ago
ఇకపై వారందరికీ  ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు: స్టాలిన్

ఇకపై వారందరికీ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు: స్టాలిన్

46 mins ago

తాజా వార్తలు

  • అమ్మకు క్యాన్సర్.. తననూ టెస్ట్ చేయించుకోమన్నారంటూ హీరోయిన్ ఎమోషనల్!
    58 mins ago
  • వీడియో: టోల్‌ ప్లాజా హర్రర్‌.. మహిళపై సిబ్బంది దాడి!
    1 hour ago
  • నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APలో స్టాఫ్ నర్సు పోస్టులు.. అర్హతలు ఏంటంటే?
    1 hour ago
  • ఉదయనిధిని చిన్నపిల్లాడ్ని చేసి వెంటాడుతున్నారు : కమల్ హాసన్
    1 hour ago
  • షాకింగ్: 6 నెలల పసికందును చంపిన ఎలుకలు!
    2 hours ago
  • వరల్డ్‌ కప్‌లో అదరగొట్టేది బాబర్‌ అజమ్‌! కోహ్లీ, రోహిత్‌లను పక్కనపెట్టిన గంభీర్‌
    2 hours ago
  • వీడియో: రంగుల రాట్నంలో ఇరుక్కున్న మహిళ జుట్టు!
    2 hours ago

సంఘటనలు వార్తలు

  • ఆసీస్‌తో మ్యాచ్‌ తర్వాత.. అశ్విన్ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌! ఎందుకు ఇదంతా?
    2 hours ago
  • పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ‘వదినమ్మ’ సీరియల్ నటి!
    2 hours ago
  • ప్రధాని మోడీకి అరుదైన బహుమతిని అందజేసిన సచిన్!
    2 hours ago
  • ఇప్పుడు టీమిండియా సూపర్‌ గా కనిపిస్తుందా? కానీ, ఒక పెద్ద మైనస్‌ ఉంది!
    3 hours ago
  • ఆటోలో వరుణ్ ధావన్, కీర్తి సురేష్ షికార్లు.. వీడియో వైరల్!
    3 hours ago
  • ఢిల్లీకే పరిమితమైన లోకేష్‌.. అరెస్ట్‌ చేస్తారనే భయమా?
    3 hours ago
  • బ్రాహ్మ‌ణి వైపు తమ్ముళ్ల చూపు! లోకేశ్‌ని లైట్ తీసుకున్నారా?
    3 hours ago

News

  • Box Office
  • Movies
  • Events
  • Food
  • Popular Social Media
  • Sports

News

  • Reviews
  • Spot Light
  • Gallery
  • USA Show Times
  • Videos
  • Travel

follow us

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • about us
  • Contact us
  • Privacy
  • Disclaimer

Copyright 2022 © Developed By Veegam Software Pvt Ltd.

Go to mobile version