iDreamPost

బెల్లం టీతో వ్యాపారం.. బిజినెస్ క్లిక్ అయితే లక్షలు గడించొచ్చు!

ఒక కప్పు టీతో రోజును ప్రారంభించడం చాలా మందికి అలవాటు. టీ తియ్యగా లేకపోతే త్రాగలేనివారు ఉన్నారు. అలాగే ఆరోగ్య కారణాల వల్ల చక్కెర టీ కి దూరంగా ఉండే వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ల కోసం వచ్చిందే బెల్లం టీ.

ఒక కప్పు టీతో రోజును ప్రారంభించడం చాలా మందికి అలవాటు. టీ తియ్యగా లేకపోతే త్రాగలేనివారు ఉన్నారు. అలాగే ఆరోగ్య కారణాల వల్ల చక్కెర టీ కి దూరంగా ఉండే వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ల కోసం వచ్చిందే బెల్లం టీ.

బెల్లం టీతో వ్యాపారం.. బిజినెస్ క్లిక్ అయితే లక్షలు గడించొచ్చు!

ఛాయ్ చమక్కున తాగరా భాయ్.. అంటూ చిరంజీవి పాడారని కాదు కాని అండీ.. టీ అంటే ఓ మత్తు, అంతకు మించిన గమ్మత్తు అందులో ఏదో అంతర్లీనంగా దాగి ఉంది. అందుకే పొద్దున్న లేవగానే టీ కడుపులో పడనిదే.. ఏ పని చేయబుద్ది కాదు. ఓ కప్పు టీ పడాల్సిందే. అయితే చాలా మంది టీ తియ్యగా ఉంటేనే తాగుతారు. కొంచెం చక్కెర తగ్గినా ఏదో కొంపలు మునిగిపోయినట్లు అరుస్తూ ఉంటారు. తల్లి లేదా భార్య మీద విరుచుకుపడుతూ ఉంటారు.  మరీ చక్కెర ఎక్కువయ్యితే ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిసినా వదులుకోరు. అలాంటి వారికో పరిష్కార మార్గం ఏంటంటే.. టీలో పంచదారకు బదులుగా బెల్లం కలుపుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలతో పాటు పోషకాలు కూడా లభిస్తాయి. మరి అటువంటి బెల్లం టీతోనే ఏకంగా లక్షలు గడిస్తున్నారట. దీని వల్ల అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయండోయ్

మనిషి జీవన ప్రయాణంలో టీ పాత్ర లేనిదే రోజులు గడవవు. ఉదయం నిద్ర లేచింది మొదలు తిరిగి నిద్ర పోయే వరకు ఒక ఎనర్జీ డ్రింక్ లా టీని సేవిస్తుంటారు. సామాన్యుడి నుంచి ధనికుల వరకు టీని అమృతంగా తీసుకుంటారు. ఈ క్రమంలో పంచదార అనారోగ్యానికి హాని కనుక.. దానికి ప్రత్యామ్నాయంగా బెల్లంతో టీ చేసుకుని సేవిస్తే.. అనేక లాభాలు ఉన్నాయి.  ఈ బెల్లం టీ లో ఐరెన్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తున్నాయి. శరీరంలో ఐరెన్ స్థాయి తక్కువగా ఉన్నప్పుడు బెల్లం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది రక్తహీనత సమస్యను మెరుగు పరుస్తుంది.  అలాగే ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ఈ టీ వ్యాపారం చేస్తూ లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు.

మరి ఇలాంటి తరుణంలో ఎంతో ఆర్యోగకరమైన బెల్లం టీ తో వ్యాపారం చేస్తూ లక్షలు గడిస్తున్నాడు ఓ యువకుడు. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటూ వ్యాపారంలో లాభాలను ఆర్జిస్తున్నాడు. అవును మీరు విన్నది నిజమే. అదేలాగో తెలుసుకుందాం. భద్రాద్రి లోని కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన ఓ యువకుడు ఎంతో రుచికరమైన బెల్లం టీని తయారు చేస్తూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన బెల్లం టీని చేస్తూ ఆ ప్రాంత వాసులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు.వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని పాత ఫారెస్ట్ ఆఫీసర్ ఏరియాలో పూర్ణ అనే యువకుడు పూర్ణ అనే టీ స్టాల్ పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించాడు.

క్రమక్రమంగా ఆ టీ వ్యాపారంతో అతను ఊహించని విధంగా ఎంతగానో అభివృద్ధి చెందాడు. నిత్యం వందలాది మంది ప్రజలు తను చేసే బెల్లం టీని రుచి చూడడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఈ టీ కోసం ఎంతో మంది తన టీ స్టాల్ వద్ద క్యూ కడుతున్నారు. అతను ఈ వ్యాపారాన్ని 2020 సంవత్సరంలో పాల్వంచ కేంద్రంగా టీ స్టాల్ ను ప్రారంభించాడు. ఇందులో భాగంగా నాణ్యమైన టీని పట్టణ వాసులకు అందించాలనే లక్ష్యంతో కేవలం రూ. 10 కి మాత్రమే ఈ బెల్లం టీని అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతిరోజు 1200 నుంచి 1500 వరకు టీలను అమ్ముతూ లక్షలు ఆర్జిస్తున్నట్లు చెబుతున్నాడు పూర్ణ.