iDreamPost

పెట్టుబడి రూ.50 వేల లోపు మాత్రమే.. నెలకు లక్ష ఆదాయం సంపాదించొచ్చు

  • Published Dec 02, 2023 | 12:44 PMUpdated Dec 02, 2023 | 12:44 PM

ఇటీవల దేశ వ్యాప్తంగా యువత స్వయం ఉపాధిపై ఫోకస్ పెడుతుంది. ముఖ్యంగా మహిళలు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకొని స్వయం ఉపాధి ప్రారంభించి మంచి లాభాలు గడిస్తున్నారు.

ఇటీవల దేశ వ్యాప్తంగా యువత స్వయం ఉపాధిపై ఫోకస్ పెడుతుంది. ముఖ్యంగా మహిళలు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకొని స్వయం ఉపాధి ప్రారంభించి మంచి లాభాలు గడిస్తున్నారు.

  • Published Dec 02, 2023 | 12:44 PMUpdated Dec 02, 2023 | 12:44 PM
పెట్టుబడి రూ.50 వేల లోపు మాత్రమే.. నెలకు లక్ష ఆదాయం సంపాదించొచ్చు

ఇటీవల చాలా మంది యువత ఉద్యోగాల వేట మానేసి స్వయంఉపాధిపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. బీటెక్ చేసిన వారు సైతం ఉద్యోగం కోసం పరుగులు పెట్టుకుండా స్వయంఉపాధిపై ఫోకస్ పెడుతున్నారు. మంచి బిజినెస్ ఐడియాతో పాటు మార్కెటింగ్ పై అవగాహన ఉంటే స్వయం ఉపాధి ద్వారా లక్షలు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. నిత్య జీవితంలో మన చుట్టూ ఉండే చిన్న చిన్న అవసరాలను గమనించి వాటినే ఆదాయవనరులుగా చేసుకొని సులువుగా డబ్బు సంపాదించుకోవచ్చు. ఈ క్రమంలోనే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందే ఓ అద్భుతమైన బిజినెస్ గురించి తెలుసుకుందాం.

ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్లాస్టిక్ పేపర్ల వాడకం పూర్తిగా తగ్గుతూ వస్తుంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, రిసెప్షన్లు ఇతర శుభకార్యాలకు గతంలో ప్లాస్టిక్ ప్లేట్స్ వాడేవారు.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని పేపర్ ప్లేట్స్ వాడుతున్నారు. శుభకార్యం ఏదైనా సరే బఫే పద్ధతిలో విందు ఇవ్వడం సర్వసాధారణం అయ్యింది. శుభకార్యాలకే కాకుండా స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ లో కూడా పేపర్ ప్లేట్ వాడకం బాగా పెరిగిపోయింది. దీంతో మార్కెట్లో వీటికి డిమాండ్ కూడా బాగా పెరిగింది. పేపర్ ప్లేట్స్ బిజినెస్ వ్యాపారం తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభం ఉంటుందని అంటున్నారు. ఈ ప్లేట్ల తయారీ వ్యాపారం గురించి పూర్తి వివరాలు మీ కోసం.

పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించని పరిశ్రమ ఏదైనా ఉందంటే.. అది పేపర్ ప్లేట్స్ బిజినెస్సే. ఇంట్లో చిన్న వ్యాపారం చేయాలని భావించేవారు పేపర్ ప్లేట్ తయారీ వ్యాపారం ప్రారంభించవచ్చు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు తెచ్చే వ్యాపారాల్లో ఇది ఒకటి. పేపర్ ప్లేట్ వ్యాపారానికి పెద్దగా స్థలం అక్కరలేదు. ఇంట్లోనే ఈ మిషన్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకవేళ స్థలం లేని వారు చిన్నపాటి షెడ్లను లీజుకు తీసుకొని బిజినెస్ ప్రారంభించవచ్చు. దీనికి సింగిల్ ఫేజ్ కరెంట్ సరిపోతుంది. దీనికి సంబంధించిన మిషన్లు మన దేశంలోనే లభిస్తున్నాయి. చిన్న వ్యాపారం మొదలు పెట్టుకోవాలంటే.. చిన్న యంత్రాలు కొనుక్కుంటే సరిపోతుంది. రూ.9 వేల నుంచి రూ.25 వేల వరకు హ్యాండ్ థ్రెడ్ మిల్స్ అందుబాటులో ఉన్నాయి. సింగిల్ డై ఆటోమేటిక్ మెషిన్ 30 వేల నుంచి ఉంటాయి. డబుల్ డై పేపర్ ప్లేట్ మేకర్ మిషన్ రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఉంటాయి. మన అవసరాలకు తగ్గ మిషన్లు కొనుగోలు చేసిన తర్వాత పేపర్ ప్లేట్లు తయారు చేయడానికి ముడి సరుకు కొనుగోలు చేయాలి. మంచి క్వాలిటీ ప్రింటెడ్ పీఈ పేపర్ కొనాల్సి ఉంటుంది. ఈ పేపర్ కిలో రూ.30 నుంచి 40 రూపాయల వరకు ఉంటుంది. బాటమ్ రీల్ కిలో రూ.40 రూపాయల వరకు ఉంటుంది. ఇది ఆన్ లైన్ లో కూడా కొనుగోలు చేసుకోవచ్చు.

గ్రీన్, సిల్వర్ తదితర రంగుల్లో ఉండే చతురస్రాకార షీట్లను సిద్ధం చేసుకొని హైడ్రాలిక్ మెషిన్ హెడ్ కింద పెడితే రౌండ్ గా కట్ అవుతుంది. అదే సమయంలో దాన్ని ప్లేట్ షేప్ కి మార్చుతుంది. ఇలా హైడ్రాలిక్ మిషన్ ద్వారా రోజుకు ఐదు వేలు, డబుల్ హైడ్రాలిక్ మిషన్ ద్వారా ఎనిమిది వేల వరకు బఫెట్ ప్లేట్లను తయారు చేసుకోవచ్చు. ప్లేట్స్ తయారైన తర్వాత మర్కెటింగ్ కోసం సరైన పద్ధతులు వాడితే అన్ని ఖర్చులూ పోను మంచి ఆదాయం మిగులుతుంది. దీని కోసం అవసరమైన లైసెన్స్ లు, ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. స్థానిక దుకాణాలు, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ వాళ్లతో పరిచయం పెంచుకొని మంచి వ్యాపారం చేసుకోవచ్చు.. ఇక్కడ పోటీ వ్యవస్థ ఉంటుంది కనుక నాణ్యత విషయంలో ప్రాధాన్యత ఇస్తే.. నెలకు లక్ష రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఈ పరిశ్రమ వల్ల కొద్దిమందికి జీవనోపాధి కల్పించే అవకాశం కూడా ఉంటుంది. మరి పేపర్ ప్లేట్ బిజినెస్ పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి