iDreamPost
android-app
ios-app

నటుడి బ్యాగ్‌లో బయటపడ్డ బులెట్లు.. అరెస్ట్!

Chennai Airport: ఇటీవల దేశంలో పలు చోట్ల బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. దేశ ద్రోహులు రవాణా స్టేషన్లను టార్గెట్ చేసుకొని బాంబు దాడులకు పాల్పపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విమానాశ్రయాల్లో ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా చెక్ చేస్తుంటారు.

Chennai Airport: ఇటీవల దేశంలో పలు చోట్ల బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. దేశ ద్రోహులు రవాణా స్టేషన్లను టార్గెట్ చేసుకొని బాంబు దాడులకు పాల్పపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విమానాశ్రయాల్లో ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా చెక్ చేస్తుంటారు.

నటుడి బ్యాగ్‌లో బయటపడ్డ బులెట్లు.. అరెస్ట్!

ఇటీవల విమానాలకు బాంబులు పెట్టాం అంటూ తరుచూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అందుకే ఎయిర్ పోర్ట్ లో ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా చెక్ చేస్తూ ఉంటారు. సామాన్యులే కాదు సెలబ్రెటీలకు కూడా ఈ తిప్పలు తప్పవు అంటారు. ఈ మధ్య కాలంలో రవాణా స్టేషన్లలో, షాపింగ్ మాల్స్, ఆస్పత్రులు, విద్యాసంస్థలకు, సెలబ్రెటీ ఇండ్లల్లో బాంబులు పెట్టినట్లు వార్తలు రావడం..వెంటనే పోలీసులు అలర్ట్ అయి బాంబు స్క్వాడ్ తో వెళ్లి క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఏవీ లేవని నిర్దారించడం చూస్తూనే ఉన్నాం. కొన్నిసార్లు ఫేక్ అని కొట్టి పడేసినవి నిజమైన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఎయిర్ పోర్ట్ లో ప్రముఖ నటుడి బ్యాగ్ లో 40 బుల్లెట్స్ దొరకడం తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..

తమిళ ఇండస్ట్రీలో తనదైన కామెడీతో కడుపుబ్బా నవ్వించి మంచి పేరు సంపాదించాడు కరుణాస్. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచాడు. తర్వాత పోటీ చేసి ఓడిపోయారు.  తాజాగా నటుడు, మాజీ ఎమ్మెల్యే కరుణాస్ ని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి బ్యాగ్ లో బుల్లెట్లు ఉన్నట్లో పోలీసులు గుర్తించారు. తిరుచ్చీ వెళ్లేందుకు నేడు ఉదయం చెన్నై విమానాశ్రయానికి వచ్చిన కరుణాస్ ని భద్రతా బలగాలు సోదాలు చేయగా.. ఆయన బ్యాగ్ లో 40 బుల్లెట్లు బయటపడ్డాయి. దీంతో హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న 40 బుల్లెట్లను అధికారులు స్వాధీనం చేసుకోవడంతో ఆయన ప్రయాణాన్ని రద్దు చేశారు. భద్రతా అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే.. కరుణాస్ పొరపాటున తన బ్యాగ్ లో బల్లెట్లు తీసుకువచ్చినట్లు విచారణలో పేర్కొన్నట్లు తెలుస్తుంది. మరి ఈ విషయం పై ఎయిర్ పోర్ట్ అధికారలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

కరుణాస్ విషయానికి వస్తే.. కోలీవుడ్ లో తాదాపు 200 చిత్రాల్లో నటించారు. కమెడీయన్ గా ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. కెరీర్ బిగినింగ్ లో ఆయన కొరియో గ్రాఫర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఎంతోమంది స్టార్ కమెడియన్స్ తో కలిసి నటించారు. తర్వాత రాజకీయాల వైపు ఎంట్రీ ఇచ్చాడు. 2016 నుంచి 2021 వరకు తమిళనాడు శాసనసభకు ప్రాతినిధ్యం వహించాడు. 2021 లో శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం కరుణాస్ తమిళనాడు సినీ కళాకారుల సంఘం అధ్యక్షుడగా కొనసాగుతున్నారు.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి