iDreamPost

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లోకి జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లోకి జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7పై హైప్ రాను రాను రెట్టింపు అవుతోంది. జులై చివరి వారంలో ప్రోమో రిలీజ్ అవుతుందని గట్టిగా చెబుతున్నారు. ఇప్పటికే నాగార్జున ప్రోమో షూట్ కూడా పూర్తి చేశారని చెబుతున్నారు. ఆగస్టు నెలలోనే బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అవుతుందని చెబుతున్నారు. అయితే ఈ సీజన్ కు సంబంధించి రోజుకో సెలబ్రిటీ పేరు వినిపిస్తోంది. వెళ్లబోయేది వీళ్లే అంటూ బుల్లితెర తారల పేర్లు వైరల్ అవుతున్నాయి.

ఇప్పటికే ప్రభాకర్- అతని కుమారుడు, అమర్దీప్- తేజశ్విని గౌడ, సింగర్ మోహనా భోగరాజు, జబర్దస్త్ అప్పారావు అంటూ చాలానే చెబుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్ పేరు వినిపిస్తోంది. బుల్లెట్ భాస్కర్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో పాల్గొనబోతున్నట్లు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియా, మీమ్ పేజెస్ లో పేరు వైరల్ అవుతోంది.

సాధారణంగా ప్రతి సీజన్ కు జబర్దస్త్ నుంచి ఒకరు ఇద్దరు సభ్యులు పాల్గొంటున్నారు. ఈ సీజన్ లో కూడా జబర్దస్త్ నుంచి కచ్చితంగా పాల్గొంటారని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే బుల్లెట్ భాస్కర్ హౌస్ లో రచ్చ లేపుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సాధారణంగా బుల్లెట్ భాస్కర్ కమెడియన్ మాత్రమే కాదు.. అతను రైటర్, మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా. ముఖ్యంగా బుల్లెట్ భాస్కర్ సూపర్ స్టార్ మహేశ్ బాబుని బాగా ఇమిటేట్ చేస్తాడు. మహేశ్ అందుబాటులో లేని సమయంలో బుల్లెట్ భాస్కర్ డబ్బింగ్ చెప్పిన సందర్భం కూడా ఉందని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

 

View this post on Instagram

 

A post shared by Jabardasth Bullet Bhaskar (@bullet_basker)

ప్రస్తుతం జబర్దస్త్ లో బుల్లెట్ భాస్కర్ దూసుకుపోతున్నాడు అనే చెప్పాలి. అతని తండ్రి- తల్లికి కూడా స్కిట్లలో అవకాశం ఇచ్చి.. వారిని కూడా ఆర్టిస్టులకు పరిచయం చేశాడు. ఈ షోలో భాస్కర్ ఎంట్రీ ఇస్తే టాస్కుల్లో మంచి మంచి పంచులు, కామెడీ డైలాగు, మిమిక్రీ చూసేందుకు ప్రేక్షకులకు అవకాశం దక్కుతుంది. అయితే టీమ్ లీడర్ గా దూసుకుపోతున్న ఈ సమయంలో బుల్లెట్ భాస్కర్ బిగ్ బాస్ కు వస్తాడా అనేది కూడా ప్రశ్నే. ఎందుకంటే ఒక్కసారి బిగ్ బాస్ లో అడుగుపెడితే మళ్లీ జబర్దస్త్ లోకి వెళ్లే అవకాశం ఉండదు.

 

View this post on Instagram

 

A post shared by Jabardasth Bullet Bhaskar (@bullet_basker)

అయినా కానీ రిస్కు తీసుకుని వచ్చిన వాళ్లు కూడా ఉన్నారు. కొందరు అయితే తిరిగి వస్తామని పర్మిషన్ తీసుకుని కూడా వచ్చారు. అయితే బుల్లెట్ భాస్కర్ నిజంగానే బిగ్ బాస్ లోకి వస్తున్నాడా? అంటే చెప్పలేమనే చెప్పాలి. ఎందుకంటే బిగ్ బాస్ లో మీరు చివరి వరకు కూడా ఫలానా వ్యక్తి అని కన్ఫామ్ చేయడానికి ఉండదు. ఎందుకంటే హోటల్ పెట్టి.. ప్రోమోలు కట్ చేసినా కూడా ఆఖరి నిమిషంలో క్యాన్సిల్ అయిపోయిన సభ్యులు కూడా ఉన్నారు. అందుకే బిగ్ బాస్ కి సంబంధించి ఎవరి పేరును కూడా కచ్చితంగా చెప్పడానికి ఉండదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి