iDreamPost

ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మాయి పేరుతో నకిలీ ఖాతా.. మార్ఫింగ్‌ ఫొటోలతో వేధింపులు!

ఇటీవల దేశ వ్యాప్తంగా సైబర్ నేరగాళ్ళ సంఖ్య మరీ ఎక్కువ అవుతుంది. సోషల్ మాధ్యమాల్లో అమ్మాయిల పేరిట ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయడం.. అందరినీ మోసం చేయడం సర్వ సాధారణం అయ్యింది.

ఇటీవల దేశ వ్యాప్తంగా సైబర్ నేరగాళ్ళ సంఖ్య మరీ ఎక్కువ అవుతుంది. సోషల్ మాధ్యమాల్లో అమ్మాయిల పేరిట ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయడం.. అందరినీ మోసం చేయడం సర్వ సాధారణం అయ్యింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మాయి పేరుతో నకిలీ ఖాతా.. మార్ఫింగ్‌ ఫొటోలతో వేధింపులు!

ఒకప్పుడు యువత ఎవరితో అయినా స్నేహం చేయాలంటే అన్నిరకాలుగా ఆలోచించి ఆచీ.. తూచీ వ్యవహరించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. సోషల్ మాధ్యమాల ద్వారా ముక్కు ముఖం తెలియని వారితో పరిచయాలు పెంచుకోవడం.. తమకు సంబంధించిన ఫోటోలు ఇతర అన్ని విషయాలు షేర్ చేసుకోవడం జరుగుతుంది. అలా ఫేస్ బుక్, ఇన్ స్ట్రాల్లో పరిచయాలు యువతీయువకులు కొంపలు ముంచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొంతమంది సైబర్ కేటుగాళ్ళు పర్సనల్ డాటాతో ఎన్నో అక్రమాలకు పాల్పపడుతున్నారు. బీటెక్ చేసిన ఓ యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మాయి పేరుతో నకిలీ ఖాతాలు ఓపెన్ చేసి ఎన్నో దారుణాలకు పాల్పపడ్డాడు.. చివరికి పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళితే..

ఒకప్పుడు ఎవరికైనా ఫ్రెండ్స్ మహా అంటే ముగ్గురు నలుగురు ఉండేవాళ్లు.. కానీ సోషల్ మాధ్యమాలు వచ్చిన తర్వాత ఆ సంఖ్య వందలు, వేలు దాటుతున్నాయి. ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్ట్రా లో తెలియని వారితో ఫ్రెండ్ షిప్ చేసుకోవడం.. వారి చేతిలో దారుణంగా మోస పోవడం సర్వ సాధారణమైంది. హైదారబాద్ లోని మేడ్చల్ కి చెందిన ఓ బీటెక్ విద్యార్థి చేస్తున్న అకృత్యాలను పోలీసులు గుట్టువిప్పారు. జాయింట్‌ సీపీ రంగనాథ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ కి చెందిన ఎస్ జిష్ణు కీర్తన్ రెడ్డి బీటెక్ చదువుతున్నాడు. ఇన్ స్ట్రాలో అమ్మాయి పేరుతో నకిలీ ఖాతా సృష్టించి.. బాలికలు, యువతులతో పరిచయాలు చేసుకుంటున్నాడు. అలా వారితో స్నహం పెంచుకొని మాయమాటలు చెప్పి వారి న్యూడ్ ఫోటోలు పంపించాలని కోరుతాడు. అంతేకాదు ఇన్ స్ట్రాలో పరిచయం అయిన అమ్మాయిల ఫోటోలు న్యూడ్ గా మార్ఫింగ్ చేసి వారి జీవితాలతో ఆడుకునేవాడు. అలా వారిని బెదిరించి డబ్బులు గుంచుతూ విలాసంగా గడుపుతున్నాడు.

A fake account on Instagram with a girl's name

ఇటీవల ఎస్ జిష్ణు కీర్తన్ రెడ్డి అమ్మాయి పేరుతో ఒక ఫేక్ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ క్రియేట్ చేశారు. ఆ అకౌంట్ డీపీలో అమ్మాయి ఫోలో పెట్టడంతో చాలా మంది అమ్మాయిలు అతన్ని అమ్మాయిగా భావించారు. అలా బాలికలు, యువతుల తో పరిచయం చేసుకొని మెల్లిగా వారి ఫోటోలు అడగడం మొదలు పెట్టాడు. తాను కూడా అందమైన లొకెషన్స్ షేర్ చేస్తూ ఉండేవాడు. అలా జిష్ణు మాయమాటలు విన్న అమ్మాయిలు తమ ఫోటోలు పంపారు. వాటిని నగ్నంగా మార్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా అని బెదిరించేవాడు. దీంతో భయంతో అతడు చెప్పినట్లు వినేవాళ్లు యువతులు. ఈ మద్య ఓ బాలికను ఇలాగే ట్రాప్ చేశాడు.. ప్రతిరోజూ నగ్న ఫోటోలు పంపించకుంటే మార్ఫింగ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో పెడతా అని బెదిరించాడు.

బాధితురాలు తల్లికి చెప్పడంతో ఆమె సీసీఎస్ సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇన్‌స్పెక్టర్ పద్మ నేతృత్వంలో దర్యాప్తు జరిపి నింధితుడిని అరెస్ట్ చేశారు. నింధితుడి నుంచి ల్యాప్ ట్యాప్, ఫోన్ స్వాధీనం చేసుకొని విశ్లేషిస్తున్నారు. ఫేక్ ఐడీలతో అనేకమందితో చాటింగ్ చేసినట్లు గుర్తించారు. ఇంకా ఇతని బాధితులు ఎంతమంది అమ్మాయిలు ఉన్నారన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. తెలియని వ్యక్తులతో ఫ్రెండ్ షిప్ చేసేముందు ఆలోచించాలి.. లేదంటే ఇలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుందని అంటున్నారు పోలీసులు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి