iDreamPost

కాంగ్రెస్ హామీల్లో కోతలొద్దు.. మా పథకాలు ఆపొద్దు: KTR

KTR Comments On Congress 6 Guarenties: బీఆర్ఎస్ వర్కిగ్ ప్రెసిడెంట్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తమ ప్రభుత్వం తెచ్చిన సంక్షేమ పథకాలు ఆపితే ఊరోకమన్నారు.

KTR Comments On Congress 6 Guarenties: బీఆర్ఎస్ వర్కిగ్ ప్రెసిడెంట్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తమ ప్రభుత్వం తెచ్చిన సంక్షేమ పథకాలు ఆపితే ఊరోకమన్నారు.

కాంగ్రెస్ హామీల్లో కోతలొద్దు.. మా పథకాలు ఆపొద్దు: KTR

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. సంక్షేమ కార్యక్రమాలను ఆపితే, ప్రభుత్వాన్ని ఎండగడతామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే దళిత బంధు పథకంలో ఎంపికైన లబ్ధిదారుల అకౌంట్లను ప్రభుత్వం ఫ్రీజ్ చేస్తోందంటూ విమర్శలు గుప్పించారు. అలాగే గృహలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా రద్దు చేసిందంటూ ఫైర్ అయ్యారు. పేద ప్రజల సంక్షేమానికి ఉద్దేశించిన పథకాలు, కార్యక్రమాలను రద్దు చేయడం దుర్మార్గం అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఆయా పథకాల లబ్ధిదారులు, సామాజిక వర్గాలకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందంటూ హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. పేద ప్రజల కోసం గత ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేస్తే ఊరుకోమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా తమ బాధ్యత నిర్వహిస్తామంటూ హెచ్చరించారు. అలాంటి పనులు చేస్తే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతామని కేటీఆర్ స్పష్టం చేశారు. 50 ఏళ్లు పాలన చేసిన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పేద కోసం విప్లవాత్మకమైన కార్యక్రమాలు అమలు చేసే ఆలోచన కూడా చేయలేద్దంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన దళిత బంధు, గృహలక్ష్మి, బీసీ బంధు, గొర్రెల పంపిణీ కార్యక్రమాల అమలును నిలిపివేసే కుట్ర చేస్తుంన్నారంటూ విమర్శించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా దళిత బంధు కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రారంభించింది అన్నారు. దళిత బంధును 10 నుంచి 12 లక్షలకు పెంచుతామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందంటూ గుర్తు చేశారు. కానీ, ఆ పార్టీ తమ హామీని మర్చిపోయిందంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఎంపికైన దళిత బంధు లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారంటూ విమర్శలు గుప్పించారు. దళిత బంధు కోసం ప్రారంభించిన బ్యాంకు అకౌంట్లను ఫ్రీజ్ చేస్తోందన్నారు.

అంతేకాకుండా గొర్రెల పంపిణీ కోసం తమ వాటాలుగా డీడీలు కట్టిన వారిని పట్టించుకోరట్లేదన్నారు. నియోజకవర్గానికి 3 వేల మందిని గృహలక్ష్మి పథకం అమలు కోసం గుర్తించామన్నారు. వారికి అవసరమైన ప్రొసీడింగ్స్ ని కూడా అందించామన్నారు. కానీ, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని రద్దు చేసిందంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తే.. ప్రధాన ప్రతిపక్షంగా లబ్ధిదారులకు అండగా నిలుస్తామంటూ స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేలా ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వంపైన ఒత్తిడి తెస్తామన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఎవరినీ లైన్లలో నిల్చోబెట్టకుండానే అన్ని రకాల సంక్షేమ పథకాలను అందించామన్నారు. ఈ రోజు ప్రతి పథకానికి లైన్లలో నిల్చోబెడుతున్నారంటూ విమర్శలు చేశారు. ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నించేలా పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేస్తాయని తెలియజేశారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల అమలుపై యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ప్రజాపాలన దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరించింది. అభయహస్తం హామీలకు సంబంధించి కోటికి పైగా దరఖాస్తులు వచ్చినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాకుండా 6 గ్యారెంటీల అమలుకు కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. 30 వేల మంది ఆపరేటర్లతో డేటా ఎంట్రీ పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయంటూ స్పష్టం చేశారు. ప్రతిపక్షం విమర్శలపై కూడా మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షం విమర్శించడమే పనిగా పెట్టుకుందంటూ పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో తాము 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పామంటూ స్పష్టం చేశారు. 40 రోజుల్లో అమలు చేస్తామంటూ ఎక్కడా చెప్పలేదంటూ వ్యాఖ్యానించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి