iDreamPost
android-app
ios-app

వీడియో: వరుడు చేసిన పనికి స్టేజ్‌పైనే రెచ్చిపోయిన వధువు!

  • Published May 02, 2024 | 12:14 PM Updated Updated May 02, 2024 | 12:14 PM

Wedding Viral Video: ఈ మధ్య కాలంలో పెళ్లిమండపాల్లో జరుగుతున్న కొన్ని సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అలాంటి ఓ ఘటన ప్రస్తుతం నెట్టింట నవ్వులు పూయిస్తుంది.

Wedding Viral Video: ఈ మధ్య కాలంలో పెళ్లిమండపాల్లో జరుగుతున్న కొన్ని సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అలాంటి ఓ ఘటన ప్రస్తుతం నెట్టింట నవ్వులు పూయిస్తుంది.

  • Published May 02, 2024 | 12:14 PMUpdated May 02, 2024 | 12:14 PM
వీడియో: వరుడు చేసిన పనికి స్టేజ్‌పైనే రెచ్చిపోయిన వధువు!

భారత దేశంలో వివాహ బంధానికి ఎంతో గౌరవం ఇస్తారు. వేద మంత్రాల సాక్షిగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంటను నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దీవిస్తుంటారు. ఈ మధ్యకాలంలో నిశ్చితార్థం, ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్, పెళ్లి ఇలా అన్ని విషయాల్లో వధూవరులు తమకు నచ్చిన విధంగా ప్లానింగ్ చేసుకుంటున్నారు. ఇందుకు ఇరు కుటుంబ సభ్యులు తమ పిల్లల ఇష్టాలను గౌరవిస్తున్నారు. ఇటీవల పెళ్లి వేడుకల్లో చిత్ర విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వధూ-వరుడి మధ్య గొడవలు, బారాత్ లో జరిగే కామెడీ సీన్లు ఇలా విషయాలకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ వరుడు చేసిన పనికి పెళ్లి కూతురు స్టేజ్ పైనే బీభత్సం సృష్టించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

దేశ వ్యాప్తంగా ఇటీవల పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఎవరి సంప్రదాయ ప్రకారం వారు పెళ్లి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఓ పెళ్లి మండపంలో వధువు చేసిన రచ్చకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వీడియోలో ప్రకారం.. స్టేజ్ పై పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకి రసగుళ్ల తినిపించేందుకు ప్రయత్నించాడు.. అప్పటికే తనకు ఇష్టం లేదన్నట్లుగా చెబుతుంది పెళ్లి కూతురు. కానీ పెళ్లి కొడుకు బలవంతంగా రసగుళ్ల తినిపించాడు. దీంతో పెళ్లి కూతురుకి చిర్రెత్తుకొచ్చింది..  రసగుళ్లను నోట్లో నుంచి బయటకు విసిరింది. స్టేజ్ పై నుంచి పెళ్లి కొడుకును కిందకు నెట్టి.. బండ బూతులు తిడుతూ.. కాలితో తన్నడం మొదలు పెట్టింది.  బంధువులుకు పెళ్లి కూతురు వీరంగా చూసి నిర్ఘాంతపోయారు.

అక్కడే ఉన్న వధూవరుల తల్లిదండ్రులు ఆపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. వారిని కూడా తిడుతూ పెళ్లి కొడుకుని తంతూ రచ్చ రచ్చ చేసింది. బంధువులు పెళ్లి కూతురు ని ఆపే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. అప్పటి వరకు స్టేజ్ పై ఎంతో సంతోషంగా ఉన్న పెళ్లి కొడుకు ఏం జరుగుతుందిరా నాయనా! అనుకుంటూ తల పట్టుకున్నాడు. ఈ వింత గోల చూస్తున్న బంధువులు నవ్వాలో.. వరుడు కష్టం చూసి ఏడ్వాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో వరుడు ప్రాణాలతో బయట పడితే చాలు అన్నట్టుగా పరిస్థితి మారింది. ఏది ఏమైనా పెళ్లి మండపంలో నవ వధువులు సిగ్గు, బిడియం తో వ్యవహరిస్తారు.. కానీ ఈ వీడియో చూసి పెళ్లి కూతుళ్లు ఇలా కూడా ప్రవర్తిస్తారా? అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తుంది.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetHepyek girişmeritbetCasibom GirişMarsbahis GirişCasibom GirişcasinoroyalHoliganbet Girişmeritbet