iDreamPost
android-app
ios-app

ఇదేం ట్విస్టు మావా.. ఫోన్ దొంగిలించిన వ్యక్తితో రెండేళ్లుగా..!

ఇదేం ట్విస్టు మావా.. ఫోన్ దొంగిలించిన వ్యక్తితో రెండేళ్లుగా..!

ప్రేమ గుడ్డిది అని అంటారు. ప్రేమకు కులం, మతం, వర్ణం, వర్గం, ప్రాంతంతో సంబంధం లేదని కూడా చెబుతారు. అలాగే ఇప్పుడు ఆ ప్రేమకు ఇంకా చాలానే కొత్త అర్థాలు, నిర్వచనాలు వస్తూనే ఉన్నాయి. అమ్మాయిలు.. అబ్బాయిలను ఎందుకు ఇష్టపడతారో.. ఎలా ఇష్టపడతారో కూడా ఒక్కోసారి అర్థం కాదు. చరిత్రలో కొన్ని వింత ప్రేమలు, రాక్షస ప్రేమలు కూడా ఉన్నాయి. మరీ అంత ఘోరం కాకపోయినా.. ఒక ప్రేమ కథ మాత్రం ఇప్పుడు వరల్డ్ వైడ్ గా సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. మరి.. ఆ వైరల్ ప్రేమ కథ ఏంటో మీరూ తెలుసుకోండి.

ప్రేమలో ఏం చూసినా చూడకపోయినా.. ఒకటి మాత్రం తప్పకుండా చూడాలి. అదేంటంటే.. మీ పార్టనర్ వ్యక్తిత్వం ఎలాంటిది? మంచివాడా కాదా అనే విషయంలో మాత్రం మీకు ఒక క్లారిటీ ఉండాలి. కానీ, కొందరు మాత్రం ఆ విషయాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా.. ప్రేమ గుడ్డిది బ్రో అంటూ విచ్చలవిడిగా లవ్ చేస్తున్నారు. ఈ జంట కూడా ఆ కోవకు చెందిందే. ఒక యువతి ఏకంగా ఒక దొంగను లవ్ చేసింది. అది కూడా తన ఫోన్ కొట్టేసిన దొంగతోనే ప్రేమలో పడింది. అదేంటి మేడమ్ దొంగ కదా అంటే.. అతను మంచి దొంగ అని సినిమా టైటిల్స్ చెప్పేస్తోంది.

అయితే ఈ వింత ప్రేమ కథ జరిగింది ఇక్కడ కాదులెండి. ఈ లవ్ స్టోరీ బ్రెజిల్ దేశానికి చెందింది. ఇమ్మాన్యులా అనే యువతి జాకర్ అనే దొంగతో ప్రేమలో పడింది. వాళ్ల ప్రేమకథను వివరించిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. జాకర్ అనే యువకుడికి ప్రేయసి లేదు. తనకు ఒక ప్రేయసి లేదు అని ఎప్పుడూ పాపం బాధపడుతూ ఉండేవాడు. ఒకరోజు ఇమ్మాన్యూలా వద్ద ఫోన్ దొంగిలించాడు. ఆమె ఫోన్ చెక్ చేస్తుండగా ఆమె ఫొటోలు చూసి తొలి చూపుకే ప్రేమలో పడిపోయాడు. అంత అందగత్తె దగ్గర ఫోన్ కొట్టేశానే అని విలవిల్లాడిపోయాడు. రోజూ ఆమెను చూసేందుకు వెళ్తుండేవాడు. కొన్నిరోజుల తర్వాత ఆమె ఫోన్ తిరిగి ఇచ్చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇంకేముంది అనుకున్నదే తడవుగా ఇమ్మాన్యులాను కలిసి ఫోన్ తిరిగిచ్చాడు. జాకర్ మంచి మనసు చూసి ఇమ్మాన్యులా ఫిదా అయిపోయింది. అతను లెట్స్ బీ ఫ్రెండ్స్ అనగానే.. ఓకే అనేసింది.

సినిమాల్లో మాదిరిగానే తర్వాత వారి మధ్య స్నేహం కాస్తా.. ప్రేమగా మారింది. వీరిని ఇంటర్వ్యూ చేసిన రిపోర్టర్ కూడా ఈ లవ్ స్టోరీ గురించి స్పందించాడు. జాకర్ తొలుత ఇమ్మాన్యులా ఫోన్ కొట్టేశాడు.. ఆ తర్వాత ఆమె మనసు దొంగిలించాడన్నారు. ఇంకేముంది వాళ్లు రెండేళ్లుగా డేటింగ్ లో ఉన్నట్లు రిపోర్టర్ వ్యాఖ్యానించారు. వారి పెళ్లికి పెద్దలు అంగీకరించారా? అనే ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేదట. ఈ లవ్ స్టోరీపై నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎంతోమంది మంచివాళ్లు సింగిల్స్ గా ఉండగా.. ఎందుకు అమ్మాయిలు క్రిమినల్స్ తో ప్రేమలో పడుతున్నారు? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం.. దొంగకు మనసు ఉండదా.. ప్రేమించడా అంటూ కామెంట్ చేస్తున్నాడు. అయితే ఈ దొంగ ప్రేమ కథ ఒక్కటే కాదు.. చరిత్రలో ఇంతకన్నా ఘోరమైన క్రిమినల్స్ ప్రేమించిన ఆడవాళ్లు ఉన్నారంటూ నిపుణులు చెబుతున్నారు.

jojobet girişJojobet GirişBetcioivermectin tabletMadridbetMadridbetPusulabetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişJojobet GirişHoliganbetMarsbahis