iDreamPost
android-app
ios-app

బీర్ తాగుతూ సూచనలు ఇచ్చిన తండ్రి.. ఫ్లైట్ నడిపిన 11 ఏళ్ల పిల్లాడు! చివరికి..

  • Author Soma Sekhar Published - 02:42 PM, Wed - 9 August 23
  • Author Soma Sekhar Published - 02:42 PM, Wed - 9 August 23
బీర్ తాగుతూ సూచనలు ఇచ్చిన తండ్రి.. ఫ్లైట్ నడిపిన 11 ఏళ్ల పిల్లాడు! చివరికి..

సాధారణంగా కొడుకులు ఏది అడిగినా కానీ తల్లిదండ్రులు కాదనలేరు. అలా గారాబంగా తమ పిల్లలను పెంచుతూ ఉంటారు కొంతమంది తల్లిదండ్రులు. ఈ గారాబంతో ఒక్కోసారి అనుకోని ప్రమాదాలను కొనితెచ్చుకుంటారు. ప్రస్తుతం అలాంటి సంఘటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన 11 ఏళ్ల కొడుకుకు బీర్ తాగుతూ విమానం ఎలా నడపాలో సూచనలు ఇస్తున్నాడు తండ్రి. అదికూడా విమానం గాల్లో ఉన్నప్పుడే. వింటుంటే మనకే ఒళ్లు గగుర్పొడుస్తుంది కదా.. ఈ సంఘటన బ్రెజిల్ లో జరిగింది. తండ్రి బీరు తాగుతూ.. తన 11 ఏళ్ల కొడుక్కి విమానం ఎలా నడపాలో సూచనలు ఇస్తున్నాడు. చివరికి ఏమైందంటే?

బ్రెజిల్ కు చెందిన గారన్ మైయా తన 11 ఏళ్ల కుమారుడిని తల్లి దగ్గరకి దింపడానికి ప్రైవేట్ విమానంలో బయలుదేరాడు. ఇక మధ్యలో ఇంధనం నింపుకోవడానికి విల్హేనాలోని విమానాశ్రయంలో ఆగాడు. ఆ తర్వాత బయలుదేరాడు. ఈ క్రమంలోనే తన కొడుకుకు విమానం అప్పజెప్పి అతడు బీర్ తాగుతూ చిల్ అవుతున్నాడు. తన 11 ఏళ్ల కొడుక్కి విమానం ఎలా నడపాలో సూచనలు ఇస్తూ.. అతడు చల్లగా బీర్ తాగుతున్నాడు. ఈ క్రమంలోనే విమానం క్రాష్ అయ్యి బ్రెజిల్ అడవుల్లో కూలిపోయింది. ఈ ఘటనలో తండ్రి మైయా, కొడుకు ఫ్రాన్సిస్కో మైయా మరణించారు.

ఈ క్రమంలోనే విమానం కూలిపోయే కొద్ది క్షణాల ముందు ఈ వీడియో తీసినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. వీరిద్దరి మరణ వార్తతో తన భర్త, సవతి కొడుకు అంత్యక్రియలు చేసిన కొద్ది గంటలకే మైయా రెండో భార్య అనా ప్రిడోనిక్ మనోవేదనతో ఆత్మహత్మకు పాల్పడింది. అయితే బ్రెజిలియన్ చట్టం ప్రకారం విమానం నడపాలి అంటే హైస్కూల్ పూర్తి చేసి, నేషనల్ సివిల్ ఏవియేషన్ ఏజెన్సీలో నమోదు చేసుకున్న 18 ఏళ్లు పైబడి ఉండాలి. మరి తన ఈ విషాదకరమైన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: బట్ట బొమ్మతో వ్యక్తి పెళ్లి, సంసారం.. పిల్లలు కూడా ఉన్నారు!