iDreamPost

ఆస్కార్ విజేతకు లీగల్ నోటీస్ పంపిన బొమ్మన్ దంపతులు! కారణం ఏంటంటే?

  • Author Soma Sekhar Updated - 08:08 AM, Tue - 8 August 23
  • Author Soma Sekhar Updated - 08:08 AM, Tue - 8 August 23
ఆస్కార్ విజేతకు లీగల్ నోటీస్ పంపిన బొమ్మన్ దంపతులు! కారణం ఏంటంటే?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో లీగల్ గా ఎన్నో గొడవలు జరుగుతూ ఉంటాయి. అయితే కొన్ని గొడవలు బయటికి రావు.. కొన్ని మాత్రం పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారతాయి. తాజాగా ఆస్కార్ విజేత ‘ది ఎలిఫెంట్ విష్ఫరర్స్’ దర్శకురాలు అయిన కార్తికి గోంజాల్వెస్ కు రూ. 2 కోట్ల లీగల్ నోటీసులు పంపించారు బొమ్మన్-బెల్లీ దంపతులు. లీగల్ నోటీసులతో పాటు ఆస్కార్ అవార్డు అనంతరం కార్తికి తమను పట్టించుకోవడం లేదని బొమ్మన్-బెల్లీ దంపతులు తీవ్ర ఆరోపణలు చేశారు.

‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ డాక్యూమెంటరీకి ఆస్కార్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ లఘు చిత్రాన్ని లేడీ డైరెక్టర్ కార్తికి గోంజాల్వెస్ తెరకెక్కించగా.. గునీత్ మోగ్నా నిర్మించారు. 42 నిమిషాల నిడివి గల ఈ చిత్రం ఆస్కార్ 2023లో ఉత్తమ లఘు చిత్రంగా అవార్డు పొందింది. అయితే ఈ అవార్డు అనంతరం తమను కార్తికి పట్టించుకోవడం లేదని తీవ్ర ఆరోపణలు చేశారు బొమ్మన్ దంపతులు. ఈ ప్రాజెక్ట్ ను చిత్రీకరించే సమయంలో మాకు అన్ని విధాలా సాయం చేస్తానని కార్తికి మాటించినట్లుగా బొమ్మన్ దంపతులు తెలిపారు.

ఈ క్రమంలోనే ఆస్కార్ వచ్చిన తర్వాత ప్రధాని మోదీ, తమిళనాడు సీఎం చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్న తర్వాత మమ్మల్ని పట్టించుకోలేదని బొమ్మన్ దంపతులు వాపోయారు. దీంతో వారు దర్శకురాలు కార్తికికి రూ. 2 కోట్ల లీగల్ నోటీసులు పంపించినట్లు తెలిపారు. కాగా.. లీగల్ నోటీసుల వార్తలపై స్పందించమని ఓ మీడియా సంస్థ బొమ్మన్ దంపతులను సంప్రదించగా.. కోర్టు కేసులో ఉన్నందున తాము ఏం మాట్లాడలేమని, అవసరమైతే తమ న్యాయవాదిని సంప్రదించమని వారు తెలిపారు. అయితే బొమ్మన్ దంపతుల ఆరోపణలపై చిత్ర నిర్మాణ సంస్థ స్పందించింది. వీరి ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొంది.

ఇదికూడా చదవండి: ఆ ఒక్క కారణంతో స్టార్ హీరో సినిమా నుంచి తొలగించారు: ‘లవ్ టుడే’ హీరోయిన్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి