iDreamPost

దయచేసి న్యాయం చేయండి.. పోలీసుల సాయం కోరిన ఆమిర్ ఖాన్!

  • Published Apr 16, 2024 | 5:13 PMUpdated Apr 16, 2024 | 5:26 PM

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ పై గత రెండు మూడు రోజులుగా ఓ వీడియో అనేది నెట్టింట వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వీడియోను చూసిన అమీర్ ఖాన్ అందులో ఎంతవరకు వాస్తవం లేదని, వాటిని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఇంతకి ఏం జరిగిందంటే..

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ పై గత రెండు మూడు రోజులుగా ఓ వీడియో అనేది నెట్టింట వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వీడియోను చూసిన అమీర్ ఖాన్ అందులో ఎంతవరకు వాస్తవం లేదని, వాటిని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఇంతకి ఏం జరిగిందంటే..

  • Published Apr 16, 2024 | 5:13 PMUpdated Apr 16, 2024 | 5:26 PM
దయచేసి న్యాయం చేయండి.. పోలీసుల సాయం కోరిన ఆమిర్ ఖాన్!

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే.. ఇండస్ట్రీలోని ఉన్న టాప్ హీరోల్లో అమీర్ ఖాన్ కూడా ఒకరు. అలాగే ఎన్నో వైవిధ్యమైన చిత్రాల్లో అద్భుతంగా అలరించిన అమీర్.. ఆయన కేరిర్ లో ఎన్నో సూపర్ హిట్స్ ను అందుకున్నారు. ఇక ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. కాగా, ఇటీవలే లాల్ సింగ్ చద్దా సినిమాతో అమీర్ ఖాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో అమీర్ తన తదుపరి ప్రాజెక్ట్స్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా అమీర్ ఖాన్ కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో చూసిన అమీర్ ఖాన్ తాజాగా స్పందించి దానిని నమ్మవద్దంటూ విజ్ఞప్తి చేశారు. ఇంతకి ఏం జరిగిందంటే..

స్టార్ హీరో అమీర్ ఖాన్ కు సంబంధించి ఇటీవలే ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వీడియోను చూసిన అమీర్ ఖాన్ అందులో ఎంతవరకు వాస్తవం లేదని, వాటిని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. గత రెండు మూడు రోజులుగా హీరో అమీర్ ఖాన్.. ప్రస్తుతం రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ఓ ఫేక్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. కాగా, ఈ వీడియో పై స్పందించిన అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. . గత 35 ఏళ్ల సినీ కెరీర్‏లో ఎన్నడూ ఏ రాజకీయ పార్టీని ఆమోదించలేదని అన్నారు. తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని తెలిపారు.అలాగే తాను రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. అది ఫేక్ వీడియో అని నమ్మవద్దని చెప్పారు. కాగా, దీనిపై ముంబై సైబర్ క్రైమ్ పోలీసులకు ఆశ్రయించి, ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేసినట్లు తెలిపారు. ఇక గత ఎన్నికల సంఘం ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మాత్రమే ప్రయత్నం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

కాగా, 2024 లోక్ సభ ఎన్నికల కోసం అమీర్ ఖాన్ ఓ సందేశం ఇచ్చారు. ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎన్నికలలో చురుకుగా ఉండాలని అన్నారు. అయితే ఆ గత ఎన్నికల్లో తాను ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికే మాత్రమే ప్రయత్నం చేసినట్లు కూడా ఆయన తెలిపారు.   కానీ, ప్రస్తుతం ఆమీర్ ఖాన్ వీడియో నెట్టింట వైరల్ తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ ఫోటో అనేది ఆర్టిఫిషియేల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసిందన్నారు. ఇక ప్రస్తుతం అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ సినిమాలో నటిస్తున్నారు. అలాగే రాజ్ కుమార్ సంతోషి తెరకెక్కించనున్న లాహోర్:1947 చిత్రంలో నటించనున్నారు. ఇందులో జెనీలియా డిసౌజా నటిస్తుంది. త్వరలోనే ఈ మూవీ పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మరి, అమీర్ ఖాన్ పై వైరల్ అవుతున్న ఫేక్ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి