iDreamPost

సినిమా ఒప్పుకున్న హీరోయిన్.. ఫోన్లు చేసి మరీ టార్చర్.. ఎందుకంటే?

Raima Sen On Threatening Calls: సెలబ్రిటీ అన్నాక విమర్శలు, ట్రోలింగ్ అనేది సహజంగానే ఉంటుంది. కానీ, కొందరికి మాత్రం బెదిరింపులు కూడా వస్తుంటాయి. ఇప్పుడు ఒక హీరోయిన్ పరిస్థితి ఇలాగే ఉంది.

Raima Sen On Threatening Calls: సెలబ్రిటీ అన్నాక విమర్శలు, ట్రోలింగ్ అనేది సహజంగానే ఉంటుంది. కానీ, కొందరికి మాత్రం బెదిరింపులు కూడా వస్తుంటాయి. ఇప్పుడు ఒక హీరోయిన్ పరిస్థితి ఇలాగే ఉంది.

సినిమా ఒప్పుకున్న హీరోయిన్.. ఫోన్లు చేసి మరీ టార్చర్.. ఎందుకంటే?

సాధారణంగా హీరో అయినా.. హీరోయిన్ అయినా.. మరే సెలబ్రిటీ అయినా ట్రోలింగ్ అనేది ఇప్పుడు సహజంగా మారిపోయింది. ఏ పని లేకుండా ఖాళీగా ఉన్న వాళ్లు నెట్టింట చాలామంది ఉంటారు. ఏం తోచకపోయినా ఎవరో ఒకరిని ట్రోల్ చేస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్లకు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. సరైన దుస్తులు వేసుకోలేదని కొందరిని, మంచిగా వస్త్రధారణ ఉందని కొందరిని, మంచిగా యాక్టింగ్ చేసినా ఇంకొందరిని ట్రోల్ చేస్తూనే ఉంటారు. ఇంకొందరికి అలాంటి మూవీ ఎందుకు చేస్తున్నావ్ అంటూ కూడా టార్చర్ చూపిస్తుంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే నటికి కూడా అలాంటి కష్టమే వచ్చింది. తాను ఒప్పుకున్న సినిమా నచ్చలేదంటూ ఆమెకు టార్చర్ పెడుతున్నారు.

ఇప్పుడు చెప్పుకుంటోంది రైమా సేన్ అనే హీరోయిన్ గురించి. సాదారణంగా కొంతమంది కారణం లేకుండా విమర్శలు చేస్తుంటారు. కానీ, ఇప్పుడు రైమా సేన్ కి విమర్శల స్టేజ్ దాటిపోయి బెదిరింపుల దాకా వచ్చిందంటూ వాపోతోంది. ఏకంగా తన ల్యాండ్ లైన్ కి కాల్ చేసి బదిరిస్తున్నారంటూ కామెంట్స్ చేసింది. ఈ హీరోయిన్ ‘మా కాళి’ అనే సినిమా చేస్తోంది. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఆ మూవీకి సంబంధించిన పోస్టర్ ని ఇటీవల విడుదల చేశారు. ఆ పోస్టర్ విడుదలైనప్పటి నుంచి ఆమెకు ఎంతో మంది నుంచి బెదిరింపులు వస్తున్నాయి. అసలు ఆ సినిమా ఎందుకు ఒప్పుకున్నావ్ అంటూ టార్చర్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది.

“మా కాళి సినిమా పోస్టర్ విడుదలైనప్పటి నుంచి నాపై విమర్శలు రావడమే కాకుండా.. నాకు బెదిరింపులు కూడా వస్తున్నాయి. సినిమా విడుదలయ్యాక మీ అభిప్రాయాలు చెప్పండి. అంతేకానీ ఎందుకు విడుదలకు ముందే ఏది పడితే అది మాట్లాడతారు. చాలామంది కాల్ చేసి లెజెండరీ యాక్ట్రెస్ సుచిత్రా సేన్ మనవరాలివి ఇలాంటి సినిమాలు చేస్తావా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నువ్వు కోల్ కతాలోనే ఉండేది గుర్తుంచుకో అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. నేను ఇలాంటి బెదిరింపు కాల్స్, విమర్శలు తట్టుకోలేకపోతున్నాను” అంటూ రైమా సేన్ ఆవేదన వ్యక్తం చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Raima Sen (@raimasen)

అసలు ఆ మూవీ వల్ల ఎందుకు విమర్శలు అంటే.. 1946 ఆగస్టు 16న కోల్ కతాలో జరిగిన ఒక దారుణ ఉదంతం నేపథ్యంలో ఈ ‘మా కాళి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ లో ఓవైపు కాళికా మాతను ఉంచగా.. మరోవైపు హిజాబ్ ధరించి గాయాలపాలైన యువతి ముఖం ఉంది. బెంగాల్ చరిత్రలో తుడిచిపెట్టుకుపోయిన కథ ఇది అంటూ ఈ పోస్టర్ ని విడుదల చేశారు. అప్పటి నుంచి రైమా సేన్ కు ఈ బెదిరింపులు తప్పడం లేదు. కాగా ఈ రైమా సేన్ ఇటీవల ది వ్యాక్సిన్ వార్ అనే సినిమాలో చేసింది. ఆ మూవీ కూడా వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ అమ్మడు తెలుగులో కేవలం ఒకే ఒక్క సినిమా చేసింది. టాలీవుడ్ లో ధైర్యం అనే సినిమాలో మెరిసింది.

 

View this post on Instagram

 

A post shared by People Media Factory (@peoplemediafactory)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి