iDreamPost

కుక్క మరణం.. మూడున్నరేళ్లుగా న్యాయం కోసం నటి పోరాటం.. ఇది ఒక విచిత్రమైన కేసు!

  • Published Apr 13, 2024 | 2:05 PMUpdated Apr 13, 2024 | 2:05 PM

బాలీవుడ్ కు చెందిన ఓ నటి తాజాగా తన పెంపుడు శునకం కోసం ఏకంగా ముంబయి హైకోర్టు మెట్లెక్కింది. అలాగే తనకు న్యాయం చేయాలని కోర్టును వేడుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..?

బాలీవుడ్ కు చెందిన ఓ నటి తాజాగా తన పెంపుడు శునకం కోసం ఏకంగా ముంబయి హైకోర్టు మెట్లెక్కింది. అలాగే తనకు న్యాయం చేయాలని కోర్టును వేడుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..?

  • Published Apr 13, 2024 | 2:05 PMUpdated Apr 13, 2024 | 2:05 PM
కుక్క మరణం.. మూడున్నరేళ్లుగా న్యాయం కోసం నటి పోరాటం.. ఇది ఒక విచిత్రమైన కేసు!

ఇటీవల కాలంలో సామాన్యుల దగ్గర నుంచి స్టార్ సెలబ్రిటీల వరకు పెట్ డాగ్స్ అంటే ఇష్టపడనివారంటూ ఎవరు ఉంటారు. ముఖ్యంగా.. ఇంట్లో మనుషుల కంటే తమ పెంపుడు శునకాలనే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంటారు. పైగా వాటిని సొంత పిల్లలా తనిపిస్తూ.. వాటి అలనా, పాలానా చూసుకుంటారు. ఈ క్రమంలోనే ఎంతో ఇష్టంగా పెంచుకున్న తమ పెంపుడు శునకాలకు ఏ చిన్న కష్టం వచ్చిన తట్టుకోలేరు. అవి అనారోగ్యనికి గురయ్యి తినకపోయినా.. చనిపోయినా, చాలా ఎక్కువగా ఎమోషనల్ అవుతుంటారు. ఇప్పటికే పెట్ డాగ్స్ పై ఇటు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు కురిపిస్తున్న ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. అయితే ఈ నేపథ్యంలోనే.. తాజాగా మరో బాలీవుడ్ నటి కూడా తన పెట్ డాగ్ కోసం ఏకంగా హైకోర్ట్ మెట్టెక్కింది. ఇంతకీ ఏం జరిగిందంటే..?

బాలీవవుడ్ నటి ‘ఆయేషా జుల్కా’. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పేరుకు బాలీవుడ్ నటి అయిన ఈ భామ అటు హిందీతో పాటు కన్నడ, తెలుగు సినిమాల్లో కూడా సహాయ పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈమె టాలీవుడ్ లో ‘నేటి సిద్ధార్థ’, ‘జై’ చిత్రాల్లో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇదిలా ఉంటే.. నటిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఆయేషా జుల్కా.. మూగ జీవులను కూడా ప్రేమిస్తుంది. ఈ క్రమంలోనే. వీధి కుక్కల్ని సంరక్షిస్తూ ఉంటుంది. అలాగే కొన్నిసార్లు వాటిని పెంచుకుంటూ ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఆయేషా.. రాఖీ అనే శునకాన్ని ఇంటికి తెచ్చుకొని పెంచుకుంటుంది. అయితే ఆ శునకం 2020 సెప్టెంబరు లో అనుమానస్పద రీతిలో చనిపోయింది. కాగా, దీని చావుకి కారణం తమ కేర్ టేకర్ రామ్ ఆండ్రే అని అతడిపై పోలీస్ కేసు పెట్టింది.

Dog justice

ఇక ఆయేషా పెట్టిన కేసు పై 2021లో పోలీసులు ఛార్జ్ షీట్ నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె ఇంట్లో పని చేసే రామ్ ఆండ్రేని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కొన్నాళ్ల తర్వాత.. అతడు బెయిల్ పై బయటకొచ్చేశాడు. కాగా, అప్పటి నుంచి ఆయేషా పెట్టిన కేసు అలానే ఉండిపోయింది. దీంతో తాజాగా ఈ విషయపై నటి ఆయేషా ముంబయి హైకోర్టు మెట్లెక్కింది. అలాగే తన పెంపుడు కుక్క విషయంలో పెట్టిన కేసు పై తనకి న్యాయం చేయాలని కోర్టుకు కోరింది. ప్రస్తుతం పెంపుడు కుక్క కోసం ఆయేషా హైకోర్టుకు వెళ్లడం అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి, పెంపుడు కుక్క కోసం నటి ఆయేషా కోర్టు మెట్లెక్కడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి