iDreamPost
android-app
ios-app

హీరోయిన్ల చీరలు లాగి లాగి చిరాకొచ్చింది! ప్రముఖ నటుడు షాకింగ్ కామెంట్స్..

  • Author Soma Sekhar Published - 04:54 PM, Tue - 25 July 23
  • Author Soma Sekhar Published - 04:54 PM, Tue - 25 July 23
హీరోయిన్ల చీరలు లాగి లాగి చిరాకొచ్చింది! ప్రముఖ నటుడు షాకింగ్ కామెంట్స్..

సాధారంగా సినిమా ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్సే ఎక్కువగా కష్టపడుతూ ఉంటారని చాలా మంది అనుకుంటూ ఉంటారు. దానికి కారణం ఎక్కువగా వారే స్క్రీన్ పై కనిపించడం. అయితే హీరో, హీరోయిన్స్ తో పాటుగా మాకూ కష్టాలు ఉంటాయంటున్నాడు ఓ ప్రముఖ నటుడు. తాజాగా ఇంటర్య్వూ ఇచ్చిన ఆ నటుగు తన సినీ కెరీర్ లో తాను ఎదుర్కొన్న కష్టాలను గూర్చి చెప్పుకొచ్చాడు. అలాగే హీరోయిన్ల చీరలు లాగి లాగి చిరాకు వచ్చిందని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఆ నటుడు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం.

గోపాల్ బేడీ.. ఈ పేరు ఇప్పటి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు. కానీ 80వ దశకంలో విలన్ గా ఓ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎంతలా అంటే తన పాత్ర పేరుతో తనని పిలిచేంతగా. గోపాల్ బేడీ అసలు పేరు అయినప్పటికీ ఇండస్ట్రీకి వచ్చాక రంజిత్ గా మార్చుకున్నాడు. తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు గోపాల్ బేడీ. అతడు మాట్లాడుతూ..”నేను నా సినీ కెరీర్ లో ఒకేసారి 80 సినిమాలు చేసిన సందర్భాలూ ఉన్నాయి. కొందరు చిన్న పాత్రలు ఇస్తే.. మరికొందరు విలన్ గా అవకాశాలు ఇచ్చేవారు. అయితే విలన్ పాత్రల్లో ఎక్కువగా హీరోయిన్ ల చీరలు లాగే పాత్రలు, రేపిస్ట్ పాత్రలే ఇచ్చేవారు. దాంతో నాకు హీరోయిన్ల చీరలు లాగి లాగి చిరాకు వచ్చేది. ఈ సీన్స్ లో ఎక్కువగా యాక్ట్ చేయడంతో నా పేరు రంజిత్ ద రే*పిస్ట్ అనే పేరుతోనే ఎక్కువగా ప్రేక్షకులు పిలిచేవారు” అని చెప్పుకొచ్చాడు గోపాల్ బేడీ.

ఇక తాను సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉండటంతో.. తనను కలవడానికి వచ్చిన అమ్మను సైతం తిరిగి వెళ్లేటప్పుడు డ్రాప్ చేసే వాడిని కాదని, అంతలా షూటింగ్స్ లో బిజీగా ఉండే వాడినని రంజిత్ చెప్పుకొచ్చాడు. రే*పిస్ట్ క్యారెక్టర్లతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న విలన్ ఇలాంటి కామెంట్స్ చేయడం ప్రస్తుతం వైరల్ గా మారింది. మరి రంజిత్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: హీరోయిన్‌గా ఫేమస్‌ బాల నటి .. మాటిచ్చిన స్టార్‌ డైరెక్టర్‌!

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş