iDreamPost
android-app
ios-app

హీరోయిన్‌గా ఫేమస్‌ బాల నటి .. మాటిచ్చిన స్టార్‌ డైరెక్టర్‌!

హీరోయిన్‌గా ఫేమస్‌ బాల నటి .. మాటిచ్చిన స్టార్‌ డైరెక్టర్‌!

విక్రమ్‌ హీరోగా 2011లో వచ్చిన ‘నాన్న’ సినిమా మీకు గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో విక్రమ్‌ కూతురిగా నటించిన ‘సారా అర్జున్‌’ నటనను మెచ్చుకోని వారు ఉండరూ అంటే అతిశయోక్తి లేదు. అంత చిన్న వయసులోనే తన యాక్టింగ్‌తో సారా అదరగొట్టారు. ఎమోషన్స్‌ను అద్భుతంగా పండించారు. ‘నాన్న’ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా.. సారా అర్జున్‌కు మాత్రం మంచి పేరు వచ్చింది. ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఆమె సినిమాలు చేశారు.

ఇక, మణిరత్నం దర్శకత్వం వహించిన ‘పొన్నియన్‌ సెల్వన్‌ 2’లో సారా అర్జున్‌.. ఐశ్వర్యా రాయ్‌ చిన్నప్పటి పాత్రను పోషించారు. తన అందంతో ప్రేక్షకులను కట్టి పడేశారు. ఓ హీరోయిన్‌కు ఉండాల్సిన అందం, అభినయం సారాలో కొట్టొచ్చినట్లు కనిపించాయి. ఈ సినిమాలో సారాను చూసిన ప్రముఖ తమిళ దర్శకుడు విజయ్‌ ఓ నిర్ణయం తీసుకున్నారు. సారాను తానే హీరోయిన్‌గా లాంఛ్‌ చేస్తానని స్పష్టం చేశారు. 2025లోపు సారాను హీరోయిన్‌గా పెట్టి  ఓ సినిమా పూర్తి చేస్తానని అన్నారు.

సారాను తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిది విజయ్‌నే. ‘దైవ తిరుమగల్‌’ సినిమాలో విక్రమ్‌ కూతురిగా నటింపజేశారు. ఈ సినిమా తెలుగులో ‘నాన్న’ పేరుతో డబ్‌ అయింది. ఇప్పుడు ఆయనే సారాను హీరోయిన్‌ చేస్తానని అనటం విశేషం. కాగా, సారా అర్జున్‌ ప్రముఖ నటుడు రాజ్‌ అర్జున్‌ కుమార్తె. 2011లో వచ్చిన ‘404’ అనే హిందీ సినిమాతో ఆమె చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె ‘క్వటేషన్‌ గ్యాంగ్‌’ అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి, సారా త్వరలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetjojobetHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibomromabet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GiriştestereCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swapholiganbet giriş