iDreamPost

అంత కడుపుమంట ఎందుకు ఐవైఆర్..?

అంత కడుపుమంట ఎందుకు ఐవైఆర్..?

ఆయన బ్రాహ్మణుడు. అందులోనూ ఉన్నత చదువులు చదివి ఐఏఎస్ పాస్ అయ్యి, రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శి హోదాలో పనిచేసారు. తన పదవీ విరమణ తర్వాత రాజకీయాల్లో కి వెళ్ళిన ఆ వ్యక్తి సాటి బ్రాహ్మణులు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఆలయాల్లో అర్చక త్వానికి ఎలాంటి పదవీ విరమణ ఉండదని కోర్టు ఇచ్చిన తీర్పును తూచా తప్పకుండా ప్రభుత్వం పాటిస్తూ ఉంటే మాత్రం ఆయనకు నచ్చడం లేదు. దానికి ఏదో రాజకీయ రంగు పూసి ఆనంద పడాలన్న ఉద్దేశం తప్ప సాటి బ్రాహ్మణులకు దేవుడి సేవలో తరించే అర్చకులకు కాస్త ఉపశమనం కలుగుతుంది అన్న ఆలోచన లేని వ్యక్తి ఐవైఆర్ కృష్టారావు.

మాజీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు బిజెపి లోకి వెళ్ళిన తర్వాత పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారిపోయారు. కనీసం ఆలోచించే జ్ఞానం ఆయనకు ఉండటం లేదా అనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తప్పు పట్టడం లో ఐవైఆర్ ముందుంటున్నారు. దానిలో కనీసం ధర్మం ఉందా అనే ఆలోచన చేయకుండానే కేవలం విమర్శలకే పరిమితమై ఉన్న గౌరవాన్ని తగ్గించుకుంటున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అర్చకులకు పదవీ విరమణ ఉండదని, గత ప్రభుత్వం 65 సంవత్సరాలు దాటి విధుల నుంచి తొలగించిన వారిని తీసుకునేలా టీటీడీ కీలక ఉత్తర్వులు వెలువరించింది. దీంతో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు తో పాటు మరో 14 మంది టిటిడి అర్చకులు విధుల్లోకి వచ్చేందుకు మార్గం సుగమం అయింది. వీరి తో పాటు దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న దేవాలయాల్లోని అర్చకులకు మేలు జరిగింది.

2018 లో మే 18న టీటీడీ పాలక మండలి 65 సంవత్సరాలు వయస్సు దాటిన అర్చకులను రిటైల్ చేసేలా ఒక తీర్మానం ఆమెదించింది. ఈ నిర్ణయం అనుసరించి శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు గా ఉన్నా రమణదీక్షితులు తో పాటు శ్రీనివాస దీక్షితులు, నరసింహ దీక్షితులు, నారాయణమూర్తి దీక్షితులుతో పాటు 11 మంది పదవి విరమణ చేయాల్సి వచ్చింది.

ఈ నిర్ణయంపై తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో పనిచేసే అర్చకులు కోర్టును ఆశ్రయించారు. గతంలో ఎప్పుడూ ఇలా పదవీ విరమణ అర్చకులకు లేదని, వారసత్వం గానే అర్చకత్వం వస్తోందని కోర్టుకు విన్నవించారు. వారి వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం విధుల్లో కొనసాగవచ్చని తీర్పు వెల్లడించింది.

అయితే అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులను వెంటనే అమలు చేయలేదు. దీనిపై రమణదీక్షితులు తో పాటు మరి కొందరు అర్చకులు కోర్టుకు పదే పదే విన్నవించిన అది టీటీడీ లోని అంశం కావడంతో పాలక మండలి నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. దీనిపై 2019 ఎన్నికల హామీలో జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా టీటీడీ అర్చకులను వీధుల్లోకి తీసుకుంటామని, కోర్టు ఉత్తర్వులను అమలు చేస్తామని ప్రకటించారు. దీనినే ఇప్పుడు అన్ని న్యాయ పరమైన అంశాలను అధిగమించిన తర్వాత అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకున్నారు.

అర్చకులను విధుల్లోకి తీసుకోవడం, హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయడం వెనుక తిరుపతి ఉప ఎన్నికల ప్రభావితం అనే విషయాన్నీ ఒక మాజీ ఐఏఎస్ అధికారి పేర్కొనడం ఇప్పుడు విచిత్రంగా అనిపిస్తుంది. అందులోనూ టీటీడీ ఈవోగా పనిచేసిన ఐవైఆర్ ఏ లెక్కలు వేసి ఈ అంశాన్ని ఉప ఎన్నిక మూడు పెడుతున్నారో ఆయనకే తెలియాలి. తిరుపతి లోక్ సభ స్థానం పరిధిలో బ్రాహ్మణుల ఓట్లు కేవలం 3 శాతం మాత్రమే. ఇప్పుడు ఈ నిర్ణయంతో వారు ప్రభావితం అయిపోతారు.. అధికార పక్షానికి అనుకూలంగా మారిపోతారు అనుకోవడం భ్రమ మాత్రమే.

తోటి అర్చకులను అప్పటికప్పుడు ఒక తీర్మానం ద్వారా తొలగించినపుడు ఎవరూ ప్రశ్నించలేదు. అలాగే కోర్టు తీర్పును వెంటనే అమలు చేయడానికి రకరకాల కారణాలు చెప్పిన టీటీడీ బోర్డును ఎవరూ మాట్లాడలేదు. ఇప్పుడు తోటి బ్రాహ్మణులను, అర్చకులుగా కొనసాగించేందుకు ఉత్తర్వులు ఇవ్వడం మాత్రం రాజకీయాలకు ముడి పెట్టడం, దానికి రాజకీయ రంగు పూసి ఏదో మేధావులుగా ఫీల్ అవ్వడం కొందరికే చెల్లుతుంది. 2019 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాల్సింది పోయి రాజకీయానికి ఆపాదించి విమర్శలు చేయడం ఐ వై ఆర్ మానుకుంటే ఆయన గౌరవం పెరుగుతుంది.

Also Read : నాడు టిడిపి – బీజేపీ ప్రభుత్వం సాగనంపింది.. నేడు వైసీపీ ప్రభుత్వం స్వాగతించింది..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి