iDreamPost

జనసేన, బీజేపీ – లాంగ్ మార్చ్ వాయిదా

జనసేన, బీజేపీ – లాంగ్ మార్చ్ వాయిదా

అమరావతి లో భూములిచ్చిన రైతులకు సంఘీభావంగా ఫిబ్రవరి 2 న ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్న సీతానగరం లాకుల నుంచి బందరు రోడ్డులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు బీజేపీ, జనసేన పార్టీలు సంయుక్తంగా తలపెట్టిన లాంగ్ మార్చ్ కార్యక్రమం వాయిదా పడింది. అయితే ఈ లాంగ్ మార్చ్ నిర్వహించబోయే తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఇరు పార్టీలు ప్రకటించాయి. రాజధాని కోసం భూములను త్యాగం చేసిన అమరావతి ప్రాంత గ్రామాల రైతుల కోసం ఫిబ్రవరి 2న మధ్యాహ్నం 2 గంటల నుండి తాడేపల్లి నుండి విజయవాడ నగరంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు ఈ భారీ కవాతు నిర్ణయించాలని తొలుత జనసేన, బీజేపీలు భావించాయి.

Read Also: జ‌న‌సేన ప్ర‌స్థానం ముగిసిన‌ట్టేనా?..ఇంకా ఉందా?

బుధవారం ఢిల్లీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ని కలసిన అనంతరం బీజేపీ – జనసేన కూటమి సమన్వయ కమిటీ సమావేశంలో రాష్ట్రంలో బిజెపి జనసేన ఆధ్వర్యంలో సంయుక్తంగా చెప్పట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహన్ తో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి వంటి నేతలు చర్చించారు.

Read Also: ప్ర‌స్తుతానికి క‌లిసి సాగుదాం..ఆ త‌ర్వాతే పూర్తి క‌ల‌యిక‌..!

ఇకమీదట రాష్ట్రవ్యాప్తంగా ఏ కార్యక్రమాలు నిర్వహించినా ఇరు పార్టీలు కలిసే చేయాలని ఒక అవహాగానకి వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో అమరావతి రైతులకోసం చేపట్టాల్సిన లాంగ్ మార్చ్ కార్యక్రమం వాయిదా పడడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి