iDreamPost

చంద్రబాబుకు దూరం జరిగిన కమలం నేతలు

చంద్రబాబుకు దూరం జరిగిన కమలం నేతలు

ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ ఫ్యాక్టరీ గ్యాస్ లీకేజీ ప్రమాదం తదనంతర ఘటనల్లో చంద్రబాబునాయుడుకు కమలంపార్టీ నేతలు దూరంగా జరిగారా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరికీ ఇదే అనుమానం పెరిగిపోతోంది. గడచిన పదకొండు మాసాల్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చంద్రబాబు ఎంత యాగీ చేస్తున్నాడో అందరూ చూస్తున్నదే. విషయం ఏదైనా కానీండి చంద్రబాబుకు మెజారిటి ప్రతిపక్షాల నేతలు మద్దతుగా నిలబడుతున్న సంగతి అందరూ చూస్తున్నదే.

ఇక్కడ ప్రతిపక్షాలంటే బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన అధినేత పవన్ కల్యాణ్, సిపిఐ కార్యదర్శి రామకృష్ణ లు చంద్రబాబుకు మద్దతుగా మరీ రెచ్చిపోయేవారు. అయితే గ్యాస్ లీకేజి తదనంతర ఘటనల్లో కన్నా లేకపోతే బిజెపి నేతలు ఎక్కడా చంద్రబాబుకు మద్దతుగా ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. గురువారం తెల్లవారుజామున ప్రమాదం జరిగిన తర్వాత ప్రతిపక్షాలు కూడా ఏమీ నోరిప్పలేదు. అయితే విచిత్రంగా శుక్రవారం నుండి చంద్రబాబు ప్రభుత్వంపై ఆరోపణలకు దిగారు.

జగన్ ప్రకటించిన నష్టపరిహారాన్ని కూడా చంద్రబాబు తప్పు పడుతున్నాడు. బాధిత కుటుంబాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదంతా ఒక ఎత్తైతే శనివారం ఉదయం నుండి ఫ్యాక్టరీ ముందు మృతదేహాలను పెట్టి బాధిత కుటుంబాలు గోల మొదలుపెట్టాయి. దీని వెనుక టిడిపి, జనసేన పార్టీల నేతలున్నట్లు స్పష్టంగా అందరికీ తెలిసిపోయింది. ఇంత గొడవ జరుగుతున్నా బిజెపి నుండి చంద్రబాబుకు మద్దతుగా ఒక్క మాట కూడా రాలేదు. ఎందుకంటే మొదట్లోనే జగన్ ప్రకటించిన పరిహారాన్ని కన్నాతో పాటు మాజీ ఎంఎల్ఏ విష్ణుకుమార్ రాజు కూడా స్వాగతించారు.

మొదటి నుండి కూడా బిజెపి తరపున చంద్రబాబుకు మద్దతుగా ముఖ్యంగా కన్నా మాత్రమే మద్దతుగా నిలుస్తున్నారు. అలాంటి కన్నా కూడా ఇపుడు చంద్రబాబుకు మద్దతుగా ఒక్కమాట కూడా మాట్లాడలేదు. పైగా ఫ్యాక్టరీలు, ఉద్యోగులు, కార్మికులంటే రెచ్చిపోయే వామపక్షాల్లో సిపిఐ కూడా సీన్ లో కనబడలేదు. అంటే ఇటు బిజెపి అయినా అటు సిపిఐ అయినా ప్రభుత్వ చర్యలతో ప్రధానంగా జగన్ ప్రకటనతో పూర్తిగా సంతృప్తిగా ఉన్నట్లే అర్ధమవుతోంది. మరి చంద్రబాబు మాత్రం ఎందుకు గోల చేస్తున్నాడు ? ఎందుకంటే కేవలం వ్యక్తిగత ప్రచారానికి పాకులాడుతున్నాడు కాబట్టే. సమయం, సందర్భం చూసుకోకుండా ప్రచారానికి పాకులాడితే నెగిటివ్ ప్రచారం అవుతుందని మరచిపోయినట్లున్నాడు. ఇపుడు జరుగుతున్నది ఇదే అని అర్దమైపోతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి