iDreamPost

వలంటీర్‌ వ్యవస్థ శుద్ధ దండగని విష్ణుకుమార్‌ రాజుకు తెలియకపాయే వీర్రాజు గారు..!

వలంటీర్‌ వ్యవస్థ శుద్ధ దండగని విష్ణుకుమార్‌ రాజుకు తెలియకపాయే వీర్రాజు గారు..!

వలంటీర్‌ వ్యవస్థపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా తన అక్కసును వెల్లగక్కారు. వలంటీర్‌ వ్యవస్థ శుద్ధ దండగని వీర్రాజు చెబుతున్నారు. నవరత్నాల అమలు కోసం వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వలంటీర్‌ వ్యవస్థ ఎన్నికల నిర్వహణకు ప్రతిబంధకంగా మారుతోందంటున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో వలంటీర్లు ఓటర్లను బెదిరించారని సోము వీర్రాజు ఆరోపిస్తున్నారు. వలంటర్‌ వ్యవస్థపై వైసీపీ ప్రభుత్వం నెలకు 310 కోట్ల రూపాయలను వృథా చేస్తోందని కూడా చెప్పారు.

గ్రామ, వార్డు స్థాయి నేతలతో సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా ఏపీలో ౖÐð సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయంటే దానికి ప్రధాన కారణం వలంటీర్లే. కాంగ్రెస్, టీడీపీ పార్టీల ప్రభుత్వాలలో పథకాల అందజేతలో పార్టీల ఆధారంగా వివక్ష ఉండేది. గత టీyీ పీ ప్రభుత్వంలోనూ ఈ వివక్ష కొనసాగింది. జన్మభూమి కమిటీలు వైసీపీ సానుభూతిపరులకు సంక్షేమ పథకాలు రాకుండా అడ్డుకున్నారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో వలంటీర్ల ద్వారా వివక్షకు తావు లేకుండా అందరికీ పథకాలు అందుతున్నాయి. ఇక కరోనా సమయంలో వలంటీర్లు అందించిన సేవలు మాటల్లో వర్ణించలేం. ఇంతటి గొప్ప సేవలు అందిస్తున్న వలంటీర్‌ వ్యవస్థ శుద్ధ దండగని సోము వీర్రాజు ఏ ప్రతిపాదికన అన్నారో..?

వలంటీర్‌ వ్యవస్థ వల్ల ప్రయోజనం ఉందో, లేదో సోము వీర్రాజు తన పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే అయిన విష్ణుకుమార్‌ రాజును అడిగితే తెలుస్తుంది. వలంటీర్‌ వ్యవస్థ వల్ల ప్రయోజనం, వలంటీర్లు అందిస్తున్న సేవలు ఎలాంటివో గత ఏడాది జూన్‌లో విష్ణుకుమార్‌ రాజు బహిరంగంగా వెల్లడించారు. వలంటీర్ల సేవలు భేష్‌ అంటూ కొనియాడిన విష్ణుకుమార్‌ రాజు.. వారికి ప్రభుత్వం అందిస్తున్న గౌరవ వేతనం 5 వేల రూపాయలు సరిపోదన్నారు. నెలకు 10 వేల రూపాయల గౌరవ వేతనం వలంటీర్లకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మరి మాజీ ఎమ్మెల్యే కూడా అయిన విష్ణుకుమార్‌ రాజు ఇలా ఎందుకు అన్నారో పార్టీ అధ్యక్షుడైన సోము వీర్రాజు తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.

వలంటీర్ల ద్వారా వివక్ష లేకుండా, అర్హతే ఆధారంగా ప్రజలకు పథకాలు అందడం ప్రతిపక్ష పార్టీల నేతలకు ఏ మాత్రం రుచించడం లేదు. పథకాలు అందడంతో గత ప్రభుత్వాలకు, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు గ్రహించారు. తమకు మేలు చేసే వారికే మద్ధతు తెలుపుతున్నారు. ఈ విషయం గడిచిన పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో రుజువైంది. ఎన్నికల విధులకు వలంటీర్లను దూరంగా పెట్టినా.. వారిపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం మానలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ చేసిన విమర్శలే.. ఇప్పుడు తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల సమయంలో బీజేపీ ఏపీ చీఫ్‌ సోము వీర్రాజు చేస్తున్నారనుకోవాలి.

Also Read : తిరుపతిలో బీజేపీ ఆశలు సన్నగిల్లాయ్యా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి