iDreamPost

జగన్ బాటలో రేవంత్ రెడ్డి.. త్వరలో ఆ కార్యక్రమాలకు శ్రీకారం!

AP Volunteer System: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన వాలంటీర్ వ్యవస్థ మీద ప్రశంసలు కురిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణలో కూడా దీన్ని అమలు చేయనున్నట్లు సమాచారం. ఆ వివరాలు..

AP Volunteer System: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన వాలంటీర్ వ్యవస్థ మీద ప్రశంసలు కురిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణలో కూడా దీన్ని అమలు చేయనున్నట్లు సమాచారం. ఆ వివరాలు..

జగన్ బాటలో రేవంత్ రెడ్డి.. త్వరలో ఆ కార్యక్రమాలకు శ్రీకారం!

ఏపీలో సీఎం జగన్‌మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ప్రభుత్వం అందించే ప్రతిఒక్క పథకం అందాలనే సదుద్దేశంతో వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు. సంక్షేమ పథకాల ఫలితాలు లబ్దిదారులకు నేరుగా అందించాలని.. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రతి ఒక్కటీ ప్రజలకు తెలియాలి.. వృద్దులకు, వికలాంగులకు సంక్షేమ పథకాలు ఫలితాలు వారి గడప వద్దకు వెళ్లాలి అనే ఉద్దేశంతో సీఎం జగన్ వాలంటీర్ వ్యవస్థను ప్రవేశ పెట్టారు. దేశ వ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థకు మంచి ఆధరణ లభిస్తుంది.. ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు.తెలంగాణలో కూడా త్వరలో వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చేందుక సిద్దమైనట్లు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్ లో దిగ్విజయంగా కొనసాగుతున్న వాలంటీర్ వ్యవస్థను తెలంగాణలో తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దమైతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్న ప్రజలకు అన్ని పథకాలు చేరువయ్యే విధంగా కార్యకర్తలను వాలంటీర్లుగా నియమిస్తానని పేర్కొన్న సంగతి తెలిసిందే. నాడు చెప్పిన మాటలు ఇప్పుడు నిజం చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. ప్రజలకు ఆరు గ్యారెంటీ పథకాలు సక్రమంగా చేరువయ్యేలా చూడాలని చూస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో ‘ఇందిరమ్మ కమిటీ’ ఏర్పాటు చేసేందుక సమాలోచనలు చేస్తున్నారు. కమిటీల్లో నియమితులైన వారికి ప్రతి నెల గౌరవ వేతనం ఇవ్వనున్నట్లు సమాచారం.

తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది.. ఇప్పుడు అదే రిజల్ట్ మళ్లీ తీసుకువచ్చేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తుంది. అందులో భాగంగానే పార్లమెంట్ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను పోటీలో దింపింది. బుధవారం భువనగిరి లోక్ సభ నియోజకవర్గ ఎన్నికల సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఓ కీలక ప్రకటన చేశారు. ఏపీలో సీఎం జగన్ అమలు చేస్తున్న వాలంటీర్ల విధానానికి మంచి రెస్పాన్స్ వస్తుంది.. అదే తరహాలో తెలంగాణలో కూడా ఓ కొత్త వ్యవస్థను తీసుకువస్తామని ప్రకటించారు. ఇప్పటికే ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణలో పలు పథకాలు అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి