iDreamPost

బిగ్​ బ్రేకింగ్: పల్లవి ప్రశాంత్​కు 14 రోజుల రిమాండ్.. శిక్ష తప్పదా?

  • Published Dec 21, 2023 | 8:11 AMUpdated Dec 21, 2023 | 8:18 AM

Pallavi Prashanth: బిగ్​బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్​ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్ తర్వాత అతడ్ని మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు పోలీసులు.

Pallavi Prashanth: బిగ్​బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్​ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్ తర్వాత అతడ్ని మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు పోలీసులు.

  • Published Dec 21, 2023 | 8:11 AMUpdated Dec 21, 2023 | 8:18 AM
బిగ్​ బ్రేకింగ్: పల్లవి ప్రశాంత్​కు 14 రోజుల రిమాండ్.. శిక్ష తప్పదా?

బిగ్​బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్​ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రశాంత్​తో పాటు అతడి సోదరుడ్ని అదుపులోకి తీసుకున్నారు. బిగ్​బాస్ టైటిల్ అందుకున్న రోజు రాత్రి హైదరాబాద్​లోని అన్నపూర్ణ స్టూడియో దగ్గర ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల ధ్వంసం కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు ప్రశాంత్ మీద కేసు నమోదు చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లా, గజ్వేల్ మండలం, అతడి సొంత గ్రామమైన కొలుగూరులో బుధవారం అరెస్ట్ చేసి హైదరాబాద్​ ‌‌జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్​కు తరలించారు. అయితే ప్రశాంత్​ను నేరుగా పోలీసు స్టేషన్​కు తీసుకెళ్లకుండా మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. ఈ క్రమంలోనే కోర్టు ప్రశాంత్​కు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ విషయంపై ఏసీపీ హరి ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. అన్నపూర్ణ స్టూడియో వద్ద గొడవ నేపథ్యంలో బిగ్​బాస్ కంటెస్టెంట్ అయిన పల్లవి ప్రశాంత్ మీద సుమోటోగా కేసు నమోదు చేశామన్నారు.

పోలీసులు చెప్పినా కూడా ప్రశాంత్ వినకుండా భారీ ఎత్తున ర్యాలీలు చేశారని ఏసీపీ హరి ప్రసాద్ తెలిపారు. ఈ ర్యాలీలో అతడి అభిమానులు బందోబస్తుకు వచ్చిన పోలీసుల కార్లతో పాటు ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారని చెప్పారు. ఈ ఘటన నేపథ్యంలో ప్రశాంత్​, తదితరుల మీద 9 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. ఈ క్రమంలో మొదట అతడి కారు డ్రైవర్లు అయిన సాయికిరణ్, రాజును అరెస్ట్ చేశామని.. ఆ తర్వాత బుధవారం రాత్రి పల్లవి ప్రశాంత్​, అతడి సోదరుడు మహా విరాన్​ను అదుపులోకి తీసుకున్నామని ఏసీపీ హరి ప్రసాద్ వివరించారు. అరెస్ట్ తర్వాత ప్రశాంత్​ను పోలీసు స్టేషన్​కు తీసుకురాకుండా నేరుగా మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచామన్నారు. అతడికి మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించిందని వ్యాఖ్యానించారు. ఈ కేసు మీద విచారణ జరుగుతోందని.. దీనికి సంబంధించి మిగిలిన విషయాలను తదుపరి వెల్లడిస్తామని హరి ప్రసాద్ చెప్పుకొచ్చారు. యువత ఇలాంటి అసాంఘిక చర్యల్లో పాల్గొనొద్దని ఆయన సూచించారు.

ఇక, బిగ్​బాస్ ఫైనల్స్ నేపథ్యంలో ఆదివారం రాత్రి హైదరాబాద్​లోని అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడికి భారీగా చేరుకున్న విన్నర్ పల్లవి ప్రశాంత్, రన్నరప్ అమర్​దీప్ ఫ్యాన్స్ మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో స్టూడియోస్ నుంచి ప్రశాంత్ బయటకు రాగా అభిమానులు ఘన స్వాగతం పలికారు. అయితే అదే టైమ్​లో అమర్​దీప్ కూడా బయటకు రావడంతో ఇద్దరి ఫ్యాన్స్ నడుమ గొడవ జరిగింది. ఈ క్రమంలో అమర్​దీప్ కారుపై కొందరు రాళ్లు రువ్వడం, అతడి కారు మీదకు ఎక్కడం, మరో కంటెస్టెంట్ అశ్వినీ కారు అద్దాలు పగులగొట్టడం, ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. బందోబస్తు కోసం వచ్చిన పంజాగుట్ట ఏసీసీ మోహన్ కుమార్ కారు అద్దాన్ని కూడా పగలగొట్టారు. దీంతో వారి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే కేసులో అరెస్ట్ అయిన ప్రశాంత్​కు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో ఈ కేసులో బిగ్​బాస్​ విన్నర్​కు శిక్ష పడుతుందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఒకవేళ అతడు నేరం చేసినట్లు రుజువైతే మాత్రం శిక్ష తప్పదు. మరి.. పల్లవి ప్రశాంత్​కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: పల్లవి ప్రశాంత్ కావాలని మోసం చేశాడు! యాంకర్ శివ ఆవేదన!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి