iDreamPost

19 మందితో కింగ్ నాగార్జున సందడి

19 మందితో కింగ్ నాగార్జున సందడి

భారీ అంచనాల మధ్య అట్టహాసంగా నిన్న సాయంత్రం బిగ్ బాస్ 5 ఈవెంట్ గ్రాండ్ లాంచ్ జరిగింది. నాలుగున్నర గంటల పాటు జరిగిన ఈ ఎపిసోడ్ కొన్ని ముందు వచ్చిన లీకులను నిజం చేయడంతో పాటు ఊహించని ట్విస్టులు కూడా ఇచ్చింది. గత సీజన్లకు వచ్చిన కామెంట్లు దృష్టిలో పెట్టుకున్నారు కాబోలు ఈసారి బోరింగ్ ఉండదని ముందే హామీ ఇచ్చేశారు. నాగార్జున ఎంట్రీ చాలా లావిష్ గా జరిగింది. బిగ్ బాస్ గొంతు చేసిన విన్నపం మేరకు సూపర్ హిట్ సాంగ్స్ కి డాన్స్ చేయడం అభిమానులను ఆకట్టుకుంది. సరదా మాటలతో హౌస్ లో కలియతిరుగుతూ ఫ్లాష్ బ్యాక్ మెమోరీస్ ని నెమరువేసుకున్నారు. మొత్తం ఇంటిని పరిచయం చేశారు నాగ్.

మన్మథుడు సినిమాలో పాటకు స్టెప్పులు వేసి మరోసారి హుషారు తెప్పించారు. కిచెన్ లోకి వెళ్ళినప్పుడు శివలో సరసాలు చాలు శ్రీవారు సాంగ్ ప్లే కావడం బాగా సింక్ అయ్యింది. కనివిని ఎరుగని రీతిలో ఈసారి ఏకంగా 19 కంటెస్టెంట్స్ ని తీసుకోవడం విశేషం. ఇది మాత్రం ట్విస్టే. సిరి హనుమంత్ రాగానే తన పెర్ఫార్మన్స్ ని మొదలుపెట్టడం విశేషం. సరైనోడు పాటతో ఎంట్రీ ఇచ్చిన విజె సన్నీ నాగ్ సూచనల మేరకు పులిహోర ప్రోగ్రాం స్టార్ట్ చేశాడు. నాగ్ కే లవ్ ప్రపోజ్ చేయడం ద్వారా లహరి శారి డిఫరెంట్ ఇంప్రెషన్ కు ట్రై చేసింది. ఆమని పాడవే అంటూ పాడిన గాయకుడు శ్రీరామ్ డీసెంట్ గా హౌస్ లోకి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ అనీ వచ్చింది.

ఆపై ఆ ఐదుగురికి ఒక టాస్క్ ఇచ్చాక గతంలో బిగ్ బాస్ షో అంటేనే నాకు పడదని చెప్పిన లోబో ఆరో వ్యక్తిగా వచ్చాడు. ఎమోషనల్ టచ్ ఇచ్చాడు. తర్వాతి వంతు సీనియర్ నటి ప్రియా. నెక్స్ట్ వచ్చింది ర్యాంప్ వాకర్ జెస్సీ. ట్రాన్స్ జెండర్ ప్రియాంక తాను జెండర్ మార్చుకోవడం గురించి భావోద్వేగానికి గురి చేసింది. ఆమధ్య డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికి వివాదం తెచ్చుకున్న సోషల్ మీడియా స్టార్ షణ్ముఖ్ ఆ సంఘటన ప్రస్తావన తేవడం విశేషం. హమీదా, నటరాజ్ మాస్టర్, సరయు, విశ్వ, ఉమాదేవి, మానస్, ఆర్జె కాజల్, శ్వేతా ఇలా అందరూ ఒక్కొక్కరుగా ఎమోషన్స్ ని టార్గెట్ చేసి ఎంట్రీ ఇచ్చారు. చివర్లో యాంకర్ రవితో ఈ ప్రహసనం ముగిసింది.

మొత్తానికి పార్టిసిపెంట్స్ ని చూస్తుంటే సామాన్యులకు పెద్దగా అవహగాన లేని బ్యాచ్ ని సెట్ చేసినట్టు కనిపిస్తోంది. కేవలం సగం ముఖాలు మాత్రమే సుపరిచితంగా ఉన్నాయి. ఈసారి ఎక్కువగా సోషల్ మీడియా సెలబ్రిటీలను తీసుకొచ్చి నింపడం స్పష్టంగా కనిపించింది. కాకపోతే ఫ్యాన్స్ కోరుకునే మసాలా డ్రామా కావాల్సినంత పండించేందుకు వీళ్లంతా సిద్ధంగా ఉన్నట్టు అర్థమవుతోంది. ముందే బోర్ ఉండదని చెప్పేశారు కాబట్టి దానికి తగ్గట్టే స్కిట్లు, డ్రామాలు జోరుగా ఉండబోతున్నాయి. ఇప్పుడే ఇలా యాక్ట్ చేస్తున్నారంటే ఇక ఎలిమినేషన్ల టైంలో వీళ్ళ పెర్ఫార్మన్స్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవడం కష్టమే

Also Read: భారం నాగ్ మీద కాదు సభ్యుల మీదే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి