iDreamPost

ఇట్స్ అఫీషియల్.. OTTలోకి వచ్చేస్తోన్న నా సామిరంగ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

ఓటీటీ ప్రియులకు గుడ్ న్యూస్. కింగ్ నాగార్జున హీరోగా నటించిన నా సామిరంగ మూవీ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఓటీటీ విడుదల తేదీని ప్రముఖ ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

ఓటీటీ ప్రియులకు గుడ్ న్యూస్. కింగ్ నాగార్జున హీరోగా నటించిన నా సామిరంగ మూవీ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఓటీటీ విడుదల తేదీని ప్రముఖ ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

ఇట్స్ అఫీషియల్.. OTTలోకి వచ్చేస్తోన్న నా సామిరంగ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

ఈ ఏడాది సంక్రాంతికి ఆడియెన్స్ ను ఫుల్ గా ఎంటర్ టైన్ చేసిన మూవీస్ ఒక్కొక్కటిగా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. థియేటర్లలో తమ అభిమాన హీరోల సినిమాలను మిస్ అయిన వారు ఓటీటీ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే గుంటూరు కారం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు టాలీవుడ్ మన్మథుడు నాగార్జున నటించిన నా సామిరంగ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. నా సామిరంగ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న నాగ్ అభిమానులకు అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. నా సామిరంగకు సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్ అఫీషియల్ గా ప్రకటించింది ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్. కింగ్ నారార్జున నటించిన నా సామిరంగ ఆ ఓటీటీలో ఆ తేదీ నుంచే స్ట్రీమింగ్ కానుంది.

నాగార్జున హీరోగా డైరెక్టర్ విజయ్ బిన్నీ తెరకెక్కించిన నా సామిరంగ ఆడియెన్స్ నుంచి పాజిటీవ్ టాక్ సొంతం చేసుకుని హిట్ అందుకుంది. ఈ సినిమాలో నాగార్జున మాస్ లుక్ లో అలరించారు. ఈ సినిమాలో అషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించగా అల్లరి నరేశ్, రాజ్‌తరుణ్ కీలకపాత్రల్లో అలరించారు. మళయాళ రీమేక్ తో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇక నా సామిరంగ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. ఫిబ్రవరి 17న ఓటీటీలో విడుదలకానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ+హాట్‌స్టార్‌ లో ఈ నెల 17 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటించింది.

naa sami ranga movie in ott

కథ:

కోనసీమ జిల్లాలోని అంబాజీ పేట ఊరు. ఆ ఊరిలో కిష్టయ్య ఓ అనాధ. అతనిని ఓ తల్లి ఆదరించి, దగ్గరికి తీసుకుంటుంది. ఆమె చనిపోయాక ఆమె కొడుకు అంజిని కిష్టయ్య సొంత తమ్ముడిలా చూసుకుంటూ ఉంటాడు. ఇక కిష్టయ్య ఆ గ్రామంలోని వరాలుని చిన్ననాటి నుంచి ప్రేమిస్తూ ఉంటాడు. ఇక ఈ అన్నదమ్ములకి ఆ ఊరి పెద్ద.. పెద్దయ్య మాటే  వేదవాక్కు. అయితే.. అదే గ్రామానికి చెందిన భాస్కర్ తన ప్రేమ వ్యవహారంతో ఓ సమస్యలో ఇరుక్కుంటాడు. అతన్ని కాపాడే బాధ్యత కిష్టయ్యకి అప్పగిస్తాడు పెద్దయ్య. ఈ క్రమంలో కిష్టయ్య, అంజి ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి? కిష్టయ్య తన ప్రేమని దక్కించుకోవడానికి ఏర్పడ్డ అడ్డంకులు ఏమిటి? ఈ ప్రయాణంలో అంజి, క్రిష్టయ్యని టార్గెట్ చేసింది ఎవరు అన్నదే “నా సామిరంగ” కథ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి