iDreamPost

చిరంజీవి, రజినీ కాదు.. సౌత్‌లో రిచ్చెస్ట్‌ హీరో అతనే

  • Published Feb 24, 2024 | 10:20 AMUpdated Feb 24, 2024 | 10:20 AM

దక్షిణాది పరిశ్రమలో అత్యంత ధనవంతుడైన హీరో ఎవరూ అంటే ముందుగా రజనీ, చిరు, మహేష్‌ బాబు, విజయ్‌ వంటి స్లార్ల పేర్తు గుర్తుకు వస్తాయి. కానీ వారేవరు కాదు. ఇంతకు సౌత్‌ రిచ్చెస్ట్‌ హీరో ఎవరంటే..

దక్షిణాది పరిశ్రమలో అత్యంత ధనవంతుడైన హీరో ఎవరూ అంటే ముందుగా రజనీ, చిరు, మహేష్‌ బాబు, విజయ్‌ వంటి స్లార్ల పేర్తు గుర్తుకు వస్తాయి. కానీ వారేవరు కాదు. ఇంతకు సౌత్‌ రిచ్చెస్ట్‌ హీరో ఎవరంటే..

  • Published Feb 24, 2024 | 10:20 AMUpdated Feb 24, 2024 | 10:20 AM
చిరంజీవి, రజినీ కాదు.. సౌత్‌లో రిచ్చెస్ట్‌ హీరో అతనే

హీరోల సంపాదన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్క సినిమా హిట్‌ అయినా సరే రెమ్యూనరేషన్‌ భారీగా పెంచుతారు. అలానే వరుసగా హిట్‌ సినిమాలు వస్తే.. కోట్ల రూపాయలు పారితోషికం అందుకుంటారు. ఇవి కాక యాడ్స్‌, గెస్ట్‌ రోల్స్‌ వంటివి చేస్తూ.. భారీగానే సంపాదిస్తారు. ఇక టాప్‌ హీరో పొజిషన్‌కు చేరుకుంటూ.. గరిష్టంగా వంద కోట్ల రూపాయల వరకు కూడా పారితోషికం తీసుకుంటారు. ఇక సౌత్‌లో అయితే 50-100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్‌ తీసుకునే హీరోల జాబితాలో ముందు వరుసలో ఉంటారు చిరంజీవి, రజనీకాంత్‌, విజయ్‌, మహేష్‌ బాబు. వీరు ఒక్కో సినిమాకు 50-100 కోట్ల రూపాయల వరకు తీసుకుంటారు. ఈ క్రమంలో మరి దక్షిణాదిలో అత్యంత సంపన్న హీరో ఎవరు అని ఆరా తీస్తే.. షాకింగ్‌ రిజల్ట్‌ వచ్చింది. సౌత్‌ రిచ్చెస్ట్‌ హీరో.. చిరునో, రజనీకాంత అనుకుంటే పొరబడినట్లే. మరి ఎవరంటే..

ప్రస్తుతం సౌత్‌ ఇండియా సినిమాలన్ని.. పాన్‌ ఇండియా రేంజ్‌లోనే తెరకెక్కుతున్నాయి. ఇండియా వైడ్‌గా విడుదలవుతున్నాయి. బాహుబలి, కేజీఎఫ్‌, కాంతార, ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటి సినిమాలన్ని పాన్‌ ఇండియా మూవీలే. ఒకప్పుడు కేవలం సౌత్‌కే పరిమితమైన నటీనటులు.. పాన్‌ ఇండియా సినిమాల వల్ల దేశవ్యాప్తంగా క్రేజ్‌ తెచ్చుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే రెమ్యూనరేషన్‌ కూడా వసూలు చేస్తున్నారు. ఇక ఇటీవల విడుదలైన జైలర్ సినిమాకు రజనీకాంత్ ఏకంగా రూ.110 కోట్లు తీసుకోగా.. లియో సినిమా కోసం విజయ్ 130 కోట్ల రూపాయలు, భారతీయుడు-2 చిత్రానికి కమల్ రూ.150 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు సినీ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగింది. ఇక టాలీవుడ్‌ స్టార్‌ హీరోలైతే 50-60 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నారు.

ఈ క్రమంలో దక్షిణాది సినిమాలో టాప్ రిచెస్ట్ యాక్టర్ ఎవరూ అనే దాని గురించి ఆరా తీస్తే.. ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. హీరోలు తీసుకునే రెమ్యూనరేషన్‌ను బట్టి.. చిరంజీవో, రజనీకాంతో, విజయో, మహేష్‌ బాబునో అనుకుంటారు కదా. వారేవరూ కాదు. మరి ఎవరు అంటే ఆయనే అక్కినేని హీరో నాగార్జున. అవును సౌత్‌లో రిచ్చెస్ట్‌ హీరో నాగార్జుననే. ఆయన భార్య అమల, పెద్ద కుమారుడు నాగచైతన్య, చిన్న కుమారుడు అఖిల్ సైతం నటీనటులుగా సంపాదిస్తూనే ఉన్నారు. దీనికి తోడు అన్నపూర్ణాస్టూడియోస్‌తో పాటు వారు మరికొన్ని వ్యాపారాలను కూడా చేస్తుంటారు. దీంతో అక్కినేని నాగార్జున ఆస్తుల విలువ దాదాపు రూ.3,010 కోట్లుగా ఉంటుందని జీక్యూ నివేదిక వెల్లడించింది.

60 ఏళ్లు పైబడినా సరే.. నాగార్జున కుర్ర హీరోలకు ధీటుగా వరుస సినిమాలు చేస్తున్నారు. అలానే బిగ్‌బాస్‌ వంటి షోకు హోస్ట్‌గా కూడా వ్యవహరిస్తూ… బిజీ బిజీగా గడుపుతుంటారు. ఇక నాగార్జున సినీ కెరీర్‌ విషయానికి వస్తే.. దాదాపు 30 ఏళ్ల సినీ కెరీర్‌లో సుమారు 100కు పైగా చిత్రాల్లో నటించారు. సినిమాలతో పాటుగా ఆయన రియల్ ఎస్టేట్, సినిమాల నిర్మాణం, ఐపీఎల్‌లో పెట్టుబడులు పెట్టడం చేస్తుంటారు. ఇక నాగార్జునకు హైదరాబాద్‌లో రూ.45 కోట్లు విలువైన బంగ్లా, ఖరీదైన కార్లు, కోట్లాది రూపాయల ప్రైవేట్ జెట్‌ కలిగి ఉన్నారు.

సౌత్ ఇండియాలో నాగార్జున తర్వాత అత్యంత ధనవంతుడైన నటుడిగా దగ్గుబాటి వెంకటేష్ నిలిచారు. ఆయన ఆస్తి విలువ రూ.2,200 కోట్లుగా అంచనా వేయబడింది. రూ.1,650 కోట్ల ఆస్తులతో తెలుగు సూపర్ స్టార్ చిరంజీవి మూడో స్థానంలో, రూ.1,370 కోట్ల ఆస్తులతో రామ్ చరణ్ నాలుగో స్థానంలో ఉన్నారు. అయితే ఆశ్చర్యకరంగా రజనీకాంత్ ఆస్తుల విలువ కేవలం రూ.430 కోట్లుగా ఉన్నట్లు వెల్లడైంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి