iDreamPost

బురదలో దొర్లుతూ.. బిగ్ బాస్ కంటెస్టెంట్ రచ్చ! వీడియో వైరల్

  • Author Soma Sekhar Published - 06:35 PM, Mon - 3 July 23
  • Author Soma Sekhar Published - 06:35 PM, Mon - 3 July 23
బురదలో దొర్లుతూ.. బిగ్ బాస్ కంటెస్టెంట్ రచ్చ! వీడియో వైరల్

సోషల్ మీడియా వచ్చాక.. ఎవరు ఎందుకు ఫేమస్ అవుతున్నారో చాలా మందికి అర్ధం కావడంలేదు. పిచ్చిపిచ్చి చేష్టలు చేసి కొందరు సోషల్ మీడియా స్టార్లుగా ఎదిగారు. ఇక ఈ క్రేజ్ తో ఏకంగా కొన్ని రియాలిటీ షోలల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటున్నారు. అలా బిగ్ బాస్ ఓటీటీ2లో అవకాశం దక్కించుకున్నాడు పునీత్ సూపర్ స్టార్. తన చిత్రవిచిత్రమైన వీడియోల ద్వారా ఇతడు ఫుల్ పాపులర్ అయ్యాడు. దాంతో అతడికి బిగ్ బాస్ ఓటీటీ 2 నుంచి పిలుపు వచ్చింది. దాంతో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోలో ఇతడు కూడా పాల్గొన్నాడు. అయితే 24 గంటల్లోనే ఇతడి రచ్చను తట్టుకోలేక బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించి వేశారు. అంతలా ఉంటుంది మనోడి రచ్చ. తాజాగా పునీత్ రోడ్డుపై తాగుతూ.. బురదలో దొర్లుతున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

బిగ్ బాస్ షోలో ఛాన్స్ వస్తే.. ఎవరైనా ఎగిరిగంతేస్తారు. ఇక ఎలాగైనా టైటిల్ కొట్టేయాలి అని అనుకుంటారు. కొంతలో కొంత ఎక్కువ వారాలైనా హౌల్ లో ఉండేందుకు ప్రయత్నిస్తారు. కానీ పునీత్ అలా కాదు. హౌస్ లోకి అడుగుపెట్టిన 24 గంటల్లోనే షో నుంచి ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ హౌస్ లో కెమెరాలతో ఆడుకునేందుకు పునీత్ ప్రయత్నించాడు. అక్కడ క్రిమిసంహరక మందు డబ్బా కనిపించగానే మీద పోసుకుని రచ్చరచ్చ చేశాడు. ఈ చర్యకు అవాక్కైన బిగ్ బాస్ అతడిని షో నుంచి ఎలిమినేట్ చేశాడు. దాంతో అతడు మరింతగా పాపులర్ అయ్యాడు. అతడి చిత్రవిచిత్రమైన వీడియోలు చూస్తే.. మనమే ముక్కున వేలేసుకుంటాము.

తాజాగా ఢిల్లీలోని నడిరోడ్డుపై పట్టపగలే మద్యం తాగుతూ.. బురదలో దొర్లుతూ.. పాటలకు చింతులు వేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాడంతో.. పలువురు స్పందిస్తున్నారు. పిచ్చి పీక్స్ లోకి ఎక్కిందని కొందరు అంటే.. నువ్వింక మారవా? అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. నీ దరిద్రాన్ని మాకెందుకు చూపిస్తున్నావ్ అంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ షోలోకి తన రీ ఎంట్రీ గురించి చెప్తూ.. ఎక్కువ డబ్బులు ఇస్తే, హౌస్ లోకి అడుగుపెడతానని చెప్పుకొచ్చాడు. ఈ వీడియోకు 4.43 లక్షల లైక్ లు రావడం గమనార్హం.

 

View this post on Instagram

 

A post shared by prakash kumar (@puneetsuper_starrrr)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి