iDreamPost

ప్రియురాలితో బిగ్ బాస్ ఫేమ్ మహేష్ విట్టా పెళ్లి! వైరల్ ఫొటోలు..

  • Author Soma Sekhar Published - 08:56 AM, Tue - 5 September 23
  • Author Soma Sekhar Published - 08:56 AM, Tue - 5 September 23
ప్రియురాలితో బిగ్ బాస్ ఫేమ్ మహేష్ విట్టా పెళ్లి! వైరల్ ఫొటోలు..

బిగ్ బాస్ ఫేమ్, టాలీవుడ్ కమెడియన్ మహేష్ విట్టా గురించి ప్రత్యేకమైన పరిచయ అక్కర్లేదు. తన మార్క్ కామెడీతో యూట్యూబ్ లో అతడు క్రియేట్ చేసిన నవ్వులు అన్నీ ఇన్నీ కావు. యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్ చేసుకునే స్థాయి నుంచి సొంత నిర్మాణ సంస్థను స్థాపించే స్థాయికి ఎదిగాడు మహేష్ విట్టా. ఇక బిగ్ బాస్ తర్వాత అతడి క్రేజ్ మరింతగా పెరిగిందనే చెప్పాలి. కాగా.. బిగ్ బాస్ షోలో పాల్గొన్న సమయంలోనే తన ప్రేమ గురించి వెల్లడించాడు మహేష్. తాజాగా తన ప్రియురాలు శ్రావణి రెడ్డిని పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం మహేష్ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మహేష్ విట్టా.. టాలీవుడ్ కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ.. ఎంతో కష్టపడి వెండితెరకి పరిచయం అయ్యాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న ఈ కెమెడియన్ తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. తన ప్రియురాలు శ్రావణి రెడ్డిని పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడైయ్యాడు. ప్రొద్దుటూరులో ఓ ఫంక్షన్ హాల్ లో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. తన పెళ్లి ఫొటోలను సోషల్ మీడియా షేర్ చేశాడు.

కాగా తన లవ్ స్టోరీని బిగ్ బాస్ హోస్ లో ఉండగానే రివీల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు ఆమె పేరును మాత్రం అతడు బయటపెట్టలేదు. మహేష్ విట్టా ప్రియురాలి పేరు శ్రావణి రెడ్డి. సుమారు ఐదేళ్లుగా ఆమెను ప్రేమిస్తున్నట్లు, ఆమె తన చెల్లెలి స్నేహితురాలిగా మహేష్ విట్టా చెప్పుకొచ్చాడు. శ్రావణి ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. విషయం తెలిసిన సినీ ప్రముఖులు, అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Mahesh Vitta (@maheshvitta)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి