iDreamPost

ఫ్యాన్స్ కోసం రూ. కోటి.. విజయ్ సెన్సేషనల్ డెసిషన్!

  • Author ajaykrishna Published - 08:35 AM, Tue - 5 September 23
  • Author ajaykrishna Published - 08:35 AM, Tue - 5 September 23
ఫ్యాన్స్ కోసం రూ. కోటి.. విజయ్ సెన్సేషనల్ డెసిషన్!

ఇండస్ట్రీలో సినిమాలు హిట్ అయితే ఫ్యాన్స్ కి గిఫ్ట్ గా డబ్బులు ఇవ్వడం అనేది అసలు ఎక్కడా జరగదు. ఒకవేళ ఇవ్వాలి అనుకున్నా.. హీరోలు తమ టీమ్ తో కొంతమందిని సెలెక్ట్ చేసి.. ఆయా ఫ్యామిలీస్ కి వారి ఆర్థిక పరిస్థితి బట్టి ఎంతోకొంత అమౌంట్ అందించడం చూశాం. కానీ.. ఫ్యాన్స్ ని ఖుషి చేయడంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ తీరే వేరు. తన సినిమాలను సెన్సేషనల్ కామెంట్స్ తో ప్రమోట్ చేసే విజయ్.. అప్పుడప్పుడు పబ్లిక్ లోనే తన మంచి మనసు చాటుతూ ఉంటాడు. జనరల్ గా విజయ్ ఏం మాట్లాడినా.. ఒకటి సెన్సేషన్ అవుతుంది లేదా కాంట్రవర్సీ అవుతుంది. తాజాగా మరోసారి ఖుషి సెలెబ్రేషన్స్ లో ఫ్యాన్స్ ఆశ్చర్యపోయే విధంగా మాట్లాడాడు.

ఖుషి ఈవెంట్ లో స్టేజ్ పై మాట్లాడుతూ.. తన అభిమానులు కూడా ఫ్యామిలీనే అని.. తన సంపాదనలో కూడా వారికి భాగం ఉందని అన్నాడు. అలాగే ఖుషి సినిమాకు తీసుకున్న రెమ్యూనరేషన్ లో ఫ్యాన్స్ కి ఏకంగా రూ. కోటి ఇవ్వడానికి సిద్ధం అయ్యాడు విజయ్. తాజాగా జరిగిన ఖుషి సక్సెస్ మీట్ లో.. తన కెరీర్ లో ఫ్యాన్స్ సపోర్ట్ ని గుర్తు చేసుకున్నాడు. ఈ క్రమంలో తాను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సపోర్ట్ చేస్తూ వచ్చిన అభిమానులకు తన సంపాదనలో కొంత భాగాన్ని షేర్ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. తన నిర్ణయానికి అనుగుణంగా రెమ్యూనరేషన్ లో కోటి రూపాయలు ఫ్యాన్స్ కి ఇస్తానని చెప్పాడు.

ఆ కోటి రూపాయలు కూడా తన టీమ్ తో 100 మందిని సెలెక్ట్ చేసి.. ఆ ఫ్యామిలీస్ కి లక్ష చొప్పున అందించనున్నట్లు తెలిపాడు. త్వరలోనే దీనికి సంబంధించి సెలక్షన్ మొదలు కానుందని.. తన టీమ్ తీసుకుంటుందని చెప్పాడు. ఇదిలా ఉండగా.. లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు విజయ్. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని శివ నిర్వాణ తెరకెక్కించాడు. మైత్రి మూవీస్ వారు నిర్మించిన ఈ సినిమాని సెప్టెంబర్ 1న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేశారు. ఇక ఫస్ట్ డే నుండి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. కలెక్షన్స్ పరంగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుందని ట్రేడ్ వర్గాల సమాచారం. మరి ఖుషి గురించి, విజయ్ వ్యాఖ్యల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి